ప్రొద్దుటూరులో వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్ల నిర‌స‌న‌

వైయ‌స్ఆర్ జిల్లా:  ప్రొద్దుటూరు మునిసిపాలిటీ లో అధికారులు ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. మున్సిపాలిటీ లో ఇవాళ జ‌ర‌గాల్సిన అధికారిక కౌన్సిల్ సమావేశానికి మునిసిపల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్ గౌర్హాజ‌ర‌య్యారు.
ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారుల తీరును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఆందోళ‌న‌ చేప‌ట్టారు. మున్సిప‌ల్ కార్యాల‌యంలో నేల‌పై కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు.
 

Back to Top