కాసేపట్లో మేదరమెట్లకు వైయ‌స్‌ జగన్ 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy)కాసేపట్లో బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరి వెళ్లనున్నారు.  పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

Back to Top