<br/>శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గంలోకి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. వంశధార నదిపై పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. <br/>