చంద్రబాబు పట్ల అప్రమత్తత అవసరం

–  తెలంగాణలో టీడీపీ ఖాళీ..ఏపీలోనూ అదే పరిస్థితి
–  మనీ, మీడియా, మ్యానిక్యులేషన్‌ బాబు జిమ్మిక్కులు
– ఎక్కడ అవకాశం వచ్చినా చంద్రబాబును ఓడించాలి
– టీఆర్‌ఎస్‌కు వైయస్‌ఆర్‌సీపీ అభినందనలు
హైదరాబాద్‌: చంద్రబాబు పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు మనీ, మీడియా, మేనిక్యులేషన్‌తో గెలవాలని ప్రయత్నించి ఘోరంగా  విఫలమయ్యారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందటం పట్ల వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు వెలుబడిన ఐదు రాష్ట్రాల ఫలితాలను సెమీ ఫైనల్‌గా భావించారన్నారని తెలిపారు. మేం కూడా ఈ ఫలితాలను విశ్లేషించుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌ ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిందన్నారు. ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్‌ మంచి అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ తరఫున అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. 
అత్యంత ఆసక్తి చూపించే అంశం..గత రెండు నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఆయన పోషించిన ప్రధాన పాత్ర, నేరుగా పగ్గాలు తీసుకొని ఓ కూటమిని తీసుకొని సీట్లు ఇవ్వడం, తన శక్తినంత ప్రయోగించారన్నారు. తన సామర్థ్యం వల్లే ఇక్కడ గెలిచామనే వ్యూహం బెడిసికొట్టిందన్నారు. కూటమి ఓటమి తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు.  మనీ, మీడియా, మేనిక్యులేషన్‌ ప్రయోగించి ఒక్క స్థానంలో టీడీపీని గెలిపించుకున్నారన్నారు. తన విద్యలన్నింటిని తెలంగాణలో చంద్రబాబు ప్రదర్శించారన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు అంటే చంద్రబాబు గెలుపు అన్నట్లుగా ప్రచారం చేశారన్నారు. దేశ రాజకీయాల్లో మలుపు అన్నట్లుగా బాజాలు మోగించారన్నారు. కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబు అన్నట్లుగా ఈ ఎన్నికలు మారాయన్నారు. ఏపీలో అన్యాయంగా విభజన జరిగిన తరువాత మరింత చీకట్లోకి చంద్రబాబు తీసుకెళ్లారన్నారు. ఏ దిశగా రాష్ట్రం వెళ్తుందని తెలంగాణ ఎన్నికలు చూసి ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాస్తవాల ఆధారంగా ఈ ఎన్నికలు ఒక గుణపాఠంగా ఉపయోగించుకోవాలన్నారు. లగడపాటి రాజగోపాల్‌ సర్వేలతో మాయాజాలం చేయాలని చూశారన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ల్లో పడిన ఓట్లను కూడా అబద్ధం అన్నట్లుగా కూటమి గెలువబోతుందని చంద్రబాబు బ్రమలు కల్పించారన్నారు. 
ఇలాంటి వ్యక్తులు, వ్యవస్థలను నిర్వీర్యం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. రేపు పొద్దున లగడపాటి రాజగోపాల్‌ భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తారని తెలిపారు. ప్రజల ఆలోచనను కప్పి పుచ్చి సర్వేలతో మ్యాజిక్‌ చేయించారన్నారు. 1970లో స్కైలాబ్‌ పడుతుందని అప్పట్లో ప్రచారం జరిగిందని, మాస్‌ హిస్టీరియ కలుగజేయగలిన శక్తి మీడియాకు ఉందన్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తరువాత కూడా మీడియాను మేనేజ్‌ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇదే ప్రయోగించారన్నారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా ఇవన్నీ చేశారని, రేపు ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంతకంటే ఎక్కువగా చేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వేల మెజారిటీతో గెలిచారంటే చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మలేదని రుజువైందన్నారు. 
ఎక్కడ అవకాశం వచ్చినా చంద్రబాబును ఓడించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు మనీ, మీడియా, మాలిక్యులేషన్స్‌ ప్రయోగిస్తారన్నారు. తాను చేసిన తప్పులను పక్కన పెట్టి లేనిది ఉన్నట్లు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తారన్నారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని, ఏపీలో కూడా ఇదే జరుగబోతుందని జోస్యం చెప్పారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారన్నారు. టీడీపీకి పార్టీ స్వభావం లేదని, అది ఒక వ్యక్తి చేతిలో ఉందన్నారు. పదవి కోసం ఎవరితోనైనా చంద్రబాబు కలుస్తారన్నారు. జుగుప్సాకరమైన పనులు చేసే సమర్ధుడు చంద్రబాబు అని విమర్శించారు. అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతారన్నారు. మేధావులు, విద్యావంతులు, యువత,  ఇలా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలని  సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. 
 
Back to Top