నాయకుడంటే ఎలా ఉంటాడు? తాను ముందు నిలిచి ప్రజలను నడిపించేలా ఉంటాడు. నాయకుడంటే ఏం చేస్తాడు? ఏ కష్టానికైనా ఎదురు నిలిచి పోరాడుతుంటాడు. నాయకుడు ఏమంటాడు? ప్రజాహితం నా మతం అంటాడు. అలాంటి నాయకుడిని ఈ తెలుగు నేలపై చూపించమంటే అందరి చూపూ వైఎస్ జగన్ వైపే నిలుస్తుంది. అందరి అడుగులూ వైఎస్ జగన్ వైపే సాగుతాయి. అందరి గొంతులూ ముక్తకంఠంతో వైఎస్ జగన్ పేరే పలుకుతాయి. అందరివాడై అందరిలోనూ తానై నిలిచిన వాడై నిరంతరం ప్రజల్లో ఉన్న ప్రజానాయకుడైన వైఎస్ జగన్ కు రాష్ట్రమే చెబుతోంది పుట్టిన రోజు శుభాకాంక్షలు.ధ్యాస, శ్వాస ప్రజలే..నమ్మిన వాళ్లగురించే ఆలోచన. ప్రజల సమస్యలు తీర్చడంపైనే ధ్యాస. తను నమ్మే సిద్ధాంతాల ఆచరణపైనే గురి. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, ఆశలు, ఆంకాంక్షలు, అవసరాలు, అన్యాయాలు అన్నీ అతడవీ అయ్యాయి. అవి చూసి చలించి, జ్వలించి, ప్రజా క్షేమం కోసం తపించి ముందుకు నడిచాడు వైఎస్ జగన్. ఆ దారి కోటి ఆశల మార్గం. ఆ దారి కొత్త జగతికి ద్వారం. కన్నీళ్లను చూసినవాడే వాటిని తుడిచే మార్గం వెతుకగలడంటారు పెద్దలు. నిజమే. అందుకే అడుగడుగునా ప్రజావసరాలు గుర్తించి అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడా యువనేత. కులం, మతం, జాతి, వర్గం ఈ బేధాలేవీ లేవు. బాధలున్నవారే బంధువులు. నిరంతరం ప్రజల్లో..ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటమే వైఎస్ జగన్ పంథా. ప్రజల్లో ఉంటూ, ప్రజలతో ఉంటూ ప్రజాగళం వినిపించడమే వైఎస్ జగన్ అజెండా. ప్రజలు కష్టంలో ఉన్నా, స్వయంగా తన కుటుంబం కష్టంలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలోనైనా ఈ నాయకుడు ప్రజలతోనే ఉన్నాడు. ప్రజల నుంచి అతడిని దూరం చేయాలని కుట్రలు పన్నినా ప్రజల కోసం పనిచేయడం మానలేదు వైఎస్ జగన్. ఇదీ నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడిలోని నిబద్ధత.