ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ సత్తా

రాష్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌లో ఏపీ టాప్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన

97.89 శాతం స్కోర్‌ పొందిన ఆంధ్రప్రదేశ్‌

సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో సాధించాం

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడి

పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం

ఇక నుంచి ప్రతి నెల పలు పరిశ్రమల ప్రారంభోత్సవం

భూమి పూజలు జరిపే విధంగా క్యాలెండర్‌ రూపకల్పన

ప్రెస్‌మీట్‌లో మంత్రి  గుడివాడ అమర్‌నాథ్‌ ప్రకటన

విశాఖపట్నం: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రభుత్వం మరోసారి సత్తా చూపింది. బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌–2020 లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌లో నిల్చింది. ఇందులో టాప్‌ అచీవర్స్‌లో ఏడు రాష్ట్రాలను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్ర స్థానంలో నిల్చింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ తర్వాత గుజరాత్, హరియాణ, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి.  

    ఏపీ 97.89 శాతం స్కోర్‌ పొందగా, రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌ది 97.77 శాతం స్కోర్‌ కాగా, తెలంగాణ 94.86 శాతం స్కోర్‌ పొందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త విధానాలతో ర్యాంకింగ్‌ ప్రక్రియ కొనసాగింది. పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు, స్టాక్‌ హోల్డర్ల నుంచి అభిప్రాయం సేకరించారు.

150 అంశాల ప్రాతిపదికన:
    ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి, అందులో ఎదుర్కొంటున్న సమస్యలు.. దాదాపు 150 అంశాలు పరిగణలోకి తీసుకుని ర్యాంక్‌లు ఇస్తారు. ఇందులో ఆం«ధ్రప్రదేశ్‌ దేశంలోనే తొలి స్థానం పొందింది. పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వేలాది పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు.. వాటికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం. ఆ సమాచారంతో కూడా ర్యాంక్‌ ప్రకటిస్తారు.

ఇదంతా సీఎంగారి ఘనత:
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తొలి నుంచి కూడా పారిశ్రామిక పురోగతి కోసం చాలా చిత్తశుద్థితో కృషి చేశారు. కోవిడ్‌ వల్ల రెండేళ్లు పూర్తిగా పోయినా, మనం ఈ రంగంలో మంచి పురోగతి సాధించాం. రాష్ట్రంలో వనరులను సద్వినియోగం చేసుకునే దిశలో ప్రభుత్వం చూపిన చొరవ, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందించడం వల్ల ఇదంతా సా«ధ్యమైంది. గడప వద్దే ప్రభుత్వం ఆ సేవలందించింది.
    ఇటీవలే సీఎంగారు చెప్పిన మాటలు మీరు విన్నారు. పరిశ్రమలకు ఏ అవసరం ఉన్నా, పారిశ్రామికవేత్తలకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. 
    గత కొన్నేళ్లుగా ర్యాంక్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు టాప్‌ అచీవర్స్‌ అని ఇస్తున్నారు. దాదాపు 7 రాష్ట్రాలను టాప్‌ అచీవర్స్‌గా ప్రకటించగా, అందులో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్‌ది అని గర్వంగా చెబుతున్నాం.
వచ్చిన టాప్‌ అచీవర్స్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, జగన్‌గారి నేతృత్వంలో దాన్ని సాధించినందుకు సంతోషిస్తున్నాం.

పూర్తి అండగా ఉంటాం:
    రాష్ట్రంలో ఏ పరిశ్రమకు ఔత్సాహికులు ముందుకు వచ్చినా, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అది ఏ స్థాయి పరిశ్రమ అయినా సరే. ఈ ర్యాంక్‌ ఆధారంగానే ఇక్కడికి ఇంకా పరిశ్రమలు వస్తాయి. గత మూడేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పాలన సాగుతోంది. మరోవైపు పారిశ్రామిక పురోగతి కోసం సీఎంగారు పడుతున్న తపన వల్లే ఇదంతా సా«ధ్యమైంది. పారిశ్రామికవేత్తల్లో సీఎంగారు ఒక మంచి విశ్వాసం పెంపొందించగలిగారు. ఈ ర్యాంక్‌ ప్రభుత్వానికి ఒక నూతన ఉత్తేజం తీసుకొస్తోంది. అంతే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్శిస్తుంది.

ఎంఎస్‌ఎంఈ రంగం:
    రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో 1.25 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కావాలని, తద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రావాలని, దాని వల్ల 1.50 లక్షల ఉద్యోగాలు రావాలన్నదే లక్ష్యమని ప్రధాని నేతృత్వంలో జరిగిన సదస్సులో స్పష్టం చేయడం జరిగింది. దాదాపు రూ.1700 కోట్ల రాయితీలు ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చాం. వచ్చే ఆగస్టులో మరో రూ.500 కోట్లకు పైగా మొత్తాన్ని ఇవ్వబోతున్నాం. ఇది వేలాది ఎంఎస్‌ఎంఈలకు ఉపయోగపడుతుంది. 

ఇండస్ట్రియల్‌ క్యాలెండర్‌:
    రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలకు అవసరమైన సహకారం. టైలర్‌ మేడ్‌ ఇన్సెంటివ్స్‌ విషయంలో ఎక్కడా రాజీ పడబోము. వెనక్కు తగ్గబోము. ఇక నుంచి ప్రతి నెల పలు పరిశ్రమల ప్రారంభోత్సవం. భూమి పూజలు జరిపే విధంగా క్యాలెండర్‌ రూపొందిస్తున్నాం.
    మనకు విశాల సముద్ర తీరం ఉంది. దాదాపు 974 కి.మీ తీరం ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది యోచన.
అందుకే కొత్తగా రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు, 9 ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో నాలుగింటి పనులుల మొదుల కాగా, మిగిలిన వాటికి అనుమతులు వచ్చాయి. ఆ విధంగా ప్రతి 50 కి.మీ.కు ఒక యాక్టివిటీ ఉండే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతోంది.

పారిశ్రామిక పురోగతి–చర్యలు:
    డీకార్బనైజ్డ్‌ ఎకానమీ. దావోస్‌లో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నాం. అందులో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి క్యాబినెట్‌ భేటీలో క్లియరెన్స్‌ ఇచ్చాం. ఇంకా రాష్ట్రంలో 30 చోట్ల 32 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు మొదలు పెట్టాం. ప్రభుత్వ చర్యలు, సహకారం వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వేగంగా పురోగమిస్తోంది.

     విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ఉన్న విశాఖ నోడ్, మచిలీపట్నం నోడ్‌ లేదా దొనకొండ, కొప్పర్తి లేదా ఏర్పేడు–శ్రీకాళహస్తి ప్రాంతం కానీ వాటిలో నీరు, విద్యుత్‌ వంటి కనీస సదుపాయాల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ తర్వాత వాటన్నింటినీ ఇప్పటికే ఉన్న పోర్టులతో పాటు, కొత్తగా వస్తున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లకు అనుసంధానం చేయడం జరుగుతుంది.

Back to Top