తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు చేపడుతూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటనలు వెలుబడ్డాయి. ఉమ్మడి కర్నూలు, వైయస్ఆర్ జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్ వైవీ సుబ్బారెడ్డికి అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గానికి చెందిన కోమటి విష్ణువర్ధన్‌రావు ముదిరాజ్‌ను వైయస్ఆర్సీపీ రాష్ట్ర ముదిరాజ్-ముత్రాసి విభాగం అధ్యక్షులుగా నియమించారు.