బాబు, ప‌వ‌న్‌, లోకేష్‌లపై ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

తాడేప‌ల్లి: ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యక్తిగత ఆరోపణలు,ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్,చంద్రబాబు,నారా లోకేష్ లపై ఎన్నికల క‌మిషన్ కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది .వైయ‌స్ఆర్‌సీపీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, లీగల్ సెల్ రాష్ర్ట ఛైర్మన్ మనోహర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు నారాయణమూర్తి లు రాష్ర్ట ఎన్నికల  అదనపు సీఈఓ కోటేశ్వరరావు ను కలసి ఫిర్యాదులను వాటి ఆధారాలను అందచేశారు.

1.ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ముఖ్యమంత్రి జగన్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ.

మార్చి 11 వతేదీన అమలాపురంలో జరిగిన బహిరంగసభలో పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీనికి సంబంధించిన ఆధారాలను సైతం ఎన్నికల కమీషన్ కు పార్టీ అందచేసింది.

అదే అమలాపురం సభలో వైయస్సార్ సిపి పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి,రాష్ర్టమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలపై ఎన్నికల నియమావళిపై విరుధ్దంగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందుల పాలు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు.

ఈ రెండు ఫిర్యాదులకు సంబంధించి పవన్ కల్యాణ్ పై తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ కోరింది.

2. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఈనెల 11 వతేదీన అమలాపురం సభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు,ఆధారాలు లేని ఆరోపణలు చేశారు.ఇది ఎన్నికల7 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం అని చంద్రబాబుపై తగిన చర్యలు చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల కమీషన్ ను కోరింది.

3.ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా రచించిన ఓ పాట టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేశారు.ఆ పాటను  బల్క్ వాయిస్ మెసేజ్ (ఐవిఆర్ ఎస్ విధానం) ద్వారా బల్క్ కాల్స్ పంపుతున్నారు.ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం అని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల కమీషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. లోకేష్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Back to Top