చిత్తూరు : వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు, ఆలోచన, ముందుచూపు వల్లే విజయవాడ ప్రజలు కష్టాల నుంచి గట్టెక్కుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. విజయవాడ వరదల సహాయక చర్యలు, అక్కడి ప్రజలకు అందుతున్న సహాయక చర్యలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం.. గత ప్రభుత్వపు సేవలపైనే ఆధారపడడం గమనార్హం. ఇదే విషయాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. వరద సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందేమీ లేదని అన్నారామె. జగన్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన వలంటీర్ వ్యవస్థ, సచివాలయ ఉద్యోగుల మొదలు.. ఆయన ప్రవేశపెట్టిన రేషన్ వాహనాలు, ఆయన హయాంలో కొన్న ఆంబులెన్స్ సర్వీస్ వాహనాలు, క్లీన్ ఆంధ్రా వాహనాలు.. ఇలా ప్రతీదానినిన ఇప్పుడు వరద సాయం కోసం కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని అన్నారామె. అంతేకాదు.. వైయస్ఆర్ హెల్త్ సెంటర్లు కూడా ఉపయోగించుకుంటోందని ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని తెలిపారామె. ఇక 80వేల మంది వరద ముంపునకు గురికాకుండా జగన్ ప్రభుత్వం కట్టించిన రిటైనింగ్ వాల్‌ను సైతం ఆమె ప్రస్తావించారు. ఇలా.. వైయస్ జగన్ చేసినవి, ఆలోచన, ముందుచూపు వల్లే విజయవాడ ప్రజలు కష్టాల నుంచి గట్టెక్కుతున్నారని రోజా తెలిపారు.