వైయస్ఆర్ జిల్లా: పులివెందుల నియోజకవర్గంలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఎంపీ అవినాష్‌రెడ్డి సమక్షంలో వారు వైయస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 కుటుంబాలు.. టీడీపీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.. ఈ సందర్భంగా వారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి టీడీపీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి నుండి ప్రతిరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం స్వాగతం పలుకుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే విధంగా ప్రతి ఒక కార్యకర్తకు అండగా ఉంటామని వెల్లడించారు. సతీష్ రెడ్డి అన్న ఆలోచనలు.. నా ఆలోచనలు ఒకటేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమయ్యే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను విజయవంతం చేయలని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కోరారు.