ఒంగోలు: పాదయాత్ర, మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పావలా వడ్డీని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది. తర్వాత వచ్చిన చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టి డ్వాక్రా మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతంపైగా హామీలను నెరవేర్చా తెలిపారు. మూడో విడత వైయస్సార్ సున్నా వడ్డీ విడుదల కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ రోజు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది రెండోసారి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదములు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పావలా వడ్డీ ఇవ్వకుండా మోసం చేశారు. ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకులో బంగారాన్ని ఇంటికి తెప్పిస్తానని మాట చెప్పి మోసం చేశారు. వైయస్ జగన్ చెప్పిన మాట ప్రకారం, మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలు మాఫీ చేయడమే కాకుండా సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్న ఘనత వైయస్ జగన్‌కే దక్కింది. గతంలో చంద్రబాబు చాలా వాగ్ధానాలు చేశారు..వాటిలో ఒక్కటైనా పూర్తిగా నెరవేర్చారా అని ప్రశ్నిస్తున్నా..ఈ రోజు వైయస్ జగన్ ప్రతి విషయంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా మహిళలకే అవకాశం ఇస్తారేమో అన్న అనుమానం కలుగుతుంది. అక్టోబర్‌లో వైయస్ జగన్ ఒంగోలుకు వచ్చినప్పుడు మంచినీటి సరఫరాకు రూ.400 కోట్లు మంజూరు చేశారు. రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి జీవో కూడా రాబోతుంది. ఒంగోలును అభివృద్ధి చేస్తున్న వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న ఒంగోల్‌లో చిన్న అపసృతి జరిగింది. ఈ ఘటనపై వెంటనే సీఎం వైయస్ జగన్ స్పందించారు. కారు ఆపిన వారిని సస్పెండ్ చే శారు. చంద్రబాబు ఈ విషయంపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ..మీరు గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారే..మీరు చేసింది తప్పు కాదా? కనీసం ఆ కుటుంబాలకు క్షమాపణ కూడా చెప్పలేదు. డాక్యుమెంట్ కోసం 29 మందిని పొట్టనపెట్టుకున్న చ ంద్రబాబుకు ఈ విధంగా మాట్లాడటం సిగ్గుండాలి. ఎల్లోమీడియా కల్లోబొల్లి కథనాలు రాస్తోంది. ఇలాంటి దుష్ప్రచారం మానుకోవాలి. సీఎం సభ కోసం ఎవరి షాపులు మూయలేదు. ప్రకాశం జిల్లాకు మంచి రోజులు తీసుకురావాలని సీఎం వైయస్ జగన్‌ను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు.