అనంతపురం: నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని అనంతపురం మాజీ మేయర్ రాగే పరశురాం అన్నారు. ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చారన్నారు. అనంతపురం జిల్లా వైయస్‌ఆర్ సీపీ కార్యాలయంలో పరశురాం మాట్లాడుతూ.. మాట తప్పని మడమ తిప్పని సీఎం వైయస్ జగన్ ఆరు నెలల పాలనలోనే మేనిఫెస్టోలోని అంశాలతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీలను సుమారు 80 శాతం నెరవేర్చారన్నారు. బీసీలకు 50 శాతం నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశారన్నారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల్లో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారన్నారు. అదే విధంగా త్వరలో జరగబోయే మార్కెట్ యార్డుల చైర్మన్ల నియామకంలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌దన్నారు. Read Also: సమాధానం చెప్పండి చంద్రబాబూ..?