శ్రీ సత్యసాయి జిల్లా: కళ్యాణదుర్గం నియోజకవర్గం లో టీడీపీ నేతల వేధింపులకు వైయస్ఆర్ సీపీ కార్యకర్త మృతి చెందాడు. సీబావి గ్రామం లో వైయస్ఆర్‌సీపీ జెండా దిమ్మెను టీడీపీ నేతలు కూల్చారు. ఈ విషయంపై ప్రశ్నించిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పోలీసులపై ఒత్తిడి చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. అక్రమ కేసు భయంతో వైయస్ఆర్ సీపీ కార్యకర్త రామాంజనేయులు గుండెపోటు తో మృతి చెందారు. టీడీపీ నేతల అక్రమ కేసుల వల్లే రామాంజనేయులు చనిపోయారని బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి వారే నా కొడుకును పొట్టన పెట్టుకున్నారని మృతుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధిత కుటుంబాన్ని వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య, పార్టీ నాయకులు పరామర్శించి, ధైర్యం చెప్పారు.