అనంతపురం: రాజకీయాల కోసం ఎంత నీచానికైనా టీడీపీ దిగజారుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (Thopudurthi Prakash Reddy) మండిపడ్డారు. తనపై ఒకవర్గానికి చెందిన మీడియా, యూట్యూబ్ ఛానళ్లు ఉదయం నుంచి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎయిర్‌పోర్టు (Airport) లో ఒక అమ్మాయితో తోపుదుర్తి కనిపించాడంటూ, యువతితో ఆయనకు అక్రమ సంబంధం ఉందంటూ అసభ్యకరమైన హెడ్డింగ్స్, కామెంట్స్ పెడుతూ అధికార పార్టీకి చెందిన కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై ట్రోల్స్ (Trolls) మొదలుపెట్టారు. అయితే దీనిపై తోపుదుర్తి సంచలన విషయాలను వెల్లడిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. నమస్తే.. నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రేపటి రోజున రామగిరి మండలానికి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి దురాగతాలపై గొంతు ఎత్తడానికి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండడం వైయస్ జగన్ గారిని రామగిరి మండలం లోనికి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా సమీప బంధువులు నా కుటుంబ సభ్యులు అందర్నీ కూడా నీచపు రాజకీయ క్రీడలో కి లాగుతున్నారు. ఎయిర్‌పోర్టులో మా బంధువుల అమ్మాయితో నేను మాట్లాడుతుండగా ఆ వీడియో వైరల్ చేసి నీచానికి పాల్పడుతున్నారు. ఎవరైతే ఆ వీడియోని అప్‌లోడ్ చేశారో, పోస్టులు పెట్టడం జరుగుతుందో ఎవరైతే వైరల్ చేయడం జరుగుతుందో వారందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తూ లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దాదాపుగా 25 సంవత్సరాల నా రాజకీయ జీవితం లో నేను సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఈ పద్ధతిలో నష్టపరుస్తామనే మీరు ఆలోచన చేస్తే దీన్ని మీ దుర్మార్గమైనటువంటి విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిల్లో ఎవరు లేరు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నా నిజాయితీ కలిగిన నాయకత్వంతో రాప్తాడు నియోజకవర్గంలో పేదలకు సేవలు అందిస్తున్న నాపై బురద చల్లేటువంటి కార్యక్రమాల వల్ల మీకు ఎటువంటి ఫలితం ఉండదు దానివల్ల మీరు గొప్పవారు కాలేరని తెలుసుకోవాలని కోరుతున్నాం…అంటూ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదంతా తప్పుడు ప్రచారం: సుమయ ఆగ్రహం.. టీడీపీ (TDP) ట్రోల్ చేస్తున్న వీడియోపై అటు తోపుదుర్తి బంధువు, ట్రోల్ ఎదుర్కొంటున్న యువతి సుమయ రెడ్డి (Sumaya Reddy) కూడా మరో వీడియో విడుదల చేశారు. డియర్ ఉమ సినిమా ప్రమోషన్లలో ఉన్న తనకు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుంచి మెసేజ్‌లు, కాల్స్ వస్తున్నాయని, తీరా చూస్తే ఎయిర్‌పోర్టు వీడియోపై కొందరు నచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ దుష్ప్రచారం చూసి షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తమకు బంధువు అని, దానిపై కూడా ఇలా విషప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. నిజానిజాలు తెలియకుండా అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దని కోరారు. ఆడవారికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని సుమయ రెడ్డి ప్రశ్నించారు.