ఎంపీ మిథున్‌ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట 

ఢిల్లీ:  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది. మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ   ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయ‌గా జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక, పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.  

Back to Top