సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న‌ కేబినెట్ భేటీ ప్రారంభం

స‌చివాల‌యం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభ‌మైంది. స‌చివాల‌యంలోని మొదటి బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో మంత్రిమండ‌లి స‌మావేశం జ‌రుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు స‌మాచారం. డీఎస్సీ నోటిఫికేషన్‌పై చ‌ర్చించ‌నున్నారు. అదే విధంగా 6 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీపై చర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుపై చర్చించనున్నారు. ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేయ‌నున్న‌ వైయ‌స్సార్ చేయూత నాలుగో విడతకు కేబినెట్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌నుంది. ఎస్‌ఐపీబి ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

Back to Top