విశ్వసనీయతకు అర్థం వైయ‌స్ జగనే

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చ‌ర్చ‌లో  సీఎం వైయ‌స్ జగన్‌ 

జూన్‌లో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ పెడతాం 

సంప్రదాయం ప్రకారం.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం ఈ సమావేశాల్లో తెలపనున్నాం  

జూన్‌లో కొలువుదీరబోయే మన ప్రభుత్వం.. ఇదే సభలో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పిస్తుంది

ఇప్పటిదాకా ఐదు ప్రజా బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం 

ప్రతిపక్షం వేస్తున్న నిందలు.. వాస్తవాలేంటన్నది ప్రజలకు వివరించబోతున్నాం

కఠినమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం

ఈ ఐదు సంవత్సరాల్లో అనూహ్య పరిస్థితులెన్నో చూశాం.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కరోనా లాంటి సంక్షోభం ఎప్పుడూ రాష్ట్రం చవిచూడలేదు

గత ప్రభుత్వ పాలన ప్రభావం కూడా రాష్ట్రంపై కనిపించింది

ఈ పరిస్థితులన్నీ అధిగమించి గొప్ప పాలన అందించాం

సీఎం జగన్‌ పాలనతో పేదరికం తగ్గింది

ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఐదేళ్లు పాలించాం: సీఎం వైయ‌స్ జగన్‌

రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది

ప్రతీ రూపాయి ప్రజలకే ఖ‌ర్చు చేశాం

అప్పుల‌పై ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తోంది

చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరింది.

చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకొస్తుందా?

నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు..ఇదే చంద్రబాబు సిద్ధాంతం 

బాబు సంపద సృష్టిస్తే.. రెవెన్యూ లోటు ఎందుకు వస్తుంది?

చంద్రబాబు కంటే మన హయాంలోనే ఎక్కువ సంపద సృష్టించాం

జరిగిన మంచిపై ప్రతి ఇంటా చర్చ జరగాలి

అమ‌రావ‌తి: విశ్వసనీయతకు అర్థం తానే అని  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉద్ఘాటించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేయగలిగిందే చెబుతుంది..చెప్పింది ఏదైనా కూడా వంద‌శాతం కచ్చితంగా మాట మీద నిలబడుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధిని  అసెంబ్లీ వేదిక‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ వివరించారు. కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అప్పులు తెచ్చాడు అని ఫైర్‌ అయ్యారు. కానీ, ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల ప్రచారం చేస్తున్నారని.. మన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే చేసింది.. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం సరిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరిందన్నారు. 2019 మే నెల నాటికి 4,12,288 కోట్ల రూపాయల అప్పులు ఏపీకి ఉన్నాయని.. రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉందన్నారు.. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువగా అప్పులు తీసుకున్నామని గుర్తుచేశారు.. గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 132000 కోట్లుగా ఉందన్నారు. గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 1,53,000 కోట్లు అన్నారు.. మొత్తంగా చంద్రబాబు హయాంలో అప్పులు పెరగింది 21.87 ఏడాదికైతే… మన హయాంలో ఇది కోవిడ్‌ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ.. ఖర్చులు పెరిగినప్పటికీ.. బటన్‌లు నొక్కినప్పటికీ కూడా.. చంద్రబాబు హయాయంలో ఉన్న 21. 87 శాతం అప్పుల పెరుగుదల రేటు ఉంటే మన హయాంలో మాత్రం అది 12.13 శాతం మాత్రమే ఉందని..అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశామని సీఎం వెల్లడించారు.. కానీ, మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అసెంబ్లీ వేదికగా వివ‌రించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చాకార్యక్రమంలో పాల్గొంటూ కొన్ని విషయాలు ఈ సభ ద్వారా ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను.

ఈ బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన ప్రస్తావనకు వస్తే.. ఇది మన ఆరో బడ్జెట్‌. ఈ సమావేశాల్లో మనం కేవలం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే ప్రవేశపెడుతున్నాం. సాంప్రదాయాలకు గౌరవమిస్తూ.. తాత్కాలికంగా మరో మూడు నెలలపాటు అంటే ఏఫ్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బడ్జెట్‌కు ఆమోదం తెలిపే విధంగా అడుగులు వేస్తున్నాం.

ఇదే బడ్జెట్‌కు మరింత మెరుగులు దిద్ది, 2004 జూన్‌లో  మళ్లీ కొలువుదీరబోయే మనందరి ప్రభుత్వం... ఇదే సభలో పూర్తిస్ధాయి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. గవర్నర్‌ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలోకి వెళ్తున్నాను.

ఐదు ప్రజాబడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ప్రభుత్వంమీద ప్రతిపక్షం వేస్తున్న నిందలు, ఆ నిందలకు సంబంధించిన వాస్తవాలేంటి అన్నది... జవాబులు చెబుతూ.. అవి ఏ రకంగా నిందలనేవి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పదల్చుకున్నాను. 

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి ఐదు సంవత్సరాలలో మనం ఎదుర్కొన్న సవాళ్లను ఒకసారి గమనిస్తే.. ఒక జఠిలమైన పరిస్థితుల మధ్య మనం అధికారంలోకి వచ్చాం. 
అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడూ ఊహించని విధంగా సమస్యలు ఎదుర్కొన్నాం. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. అనుకోకుండా ఖర్చులు పెరిగాయి. నాకు ఊహ తెలిసిన తర్వాత..  దేశంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కోవిడ్‌ లాంటి పరిస్థితులు ఊహించలేదు. మామూలుగా రాష్ట్రఆదాయాలు ఎప్పుడూ ఈ ఏడాది ఇంత ఉంటే మరుసటి ఏడాది 10శాతమో, 15 శాతమే పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప... తగ్గడం అన్నది ఎప్పుడూ చూడలేదు. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూశాం. కోవిడ్‌ మహమ్మారివల్ల అనూహ్యంగా ప్రజల ఆరోగ్యం కోసం, వారిని ఆదుకునే విషయంలో ఊహించని దానికన్నా ఖర్చులు పెరిగిపోయాయి. 

ఈ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికిచ్చే పన్నుల వాటా గమనిస్తే.. అవి కూడా తగ్గాయి. గతంలో చంద్రబాబు పాలనలో ఉన్న ఐదేళ్లతో ఈ ఐదేళ్ల పరిస్థతి ఏంటని గమనిస్తే.. మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం నుంచి రావాల్సిన డివల్యూషన్స్‌ తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ప్రయాణించింది.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయం, విద్య, మహిళాసాధికారిత ఇటువంటి రంగాల మీద గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద, ప్రజల మీద తీవ్ర ప్రభావం   పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు మందుకు నడపాల్సిన పరిస్థితి.

నాలుగోది రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు... రెవెన్యూలోటు మనల్ని వెంటాడుతుంది. ఇవన్నీ ఈ ఐదేళ్లలో ఇలాంటి అన్ని అనూహ్య పరిస్థితులని అధిగమించి గొప్ప పాలన చేయగలిగామని గర్వంగా చెప్పగలుగుతున్నాం.

ఈ నాలుగు అంశాలకు సంబంధించి గమనిస్తే..
కోవిడ్‌ కారణంగా రెండు ఆర్ధిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2019–2022 వరకు ఈ మూడేళ్లలో రాష్ట్ర ఆదాయాలు దాదాపు రూ.66వేల కోట్లు కోల్పోయి, నష్టపోయిన పరిస్థితి. 

రాష్ట్రం ఇంతకముందు అంటే 2015–19 వరకు గత పాలనలో స్టేట్‌ టాక్స్‌ రెవెన్యూస్‌ ఏ రకంగా పెరిగాయన్నది చూస్తే... దాదాపుగా 13.29శాతం ప్రతి సంవత్సరం టాక్స్‌ రెవెన్యూ గ్రోత్‌ పెరుగుతూ పోతున్నాయి. గత ఐదేళ్లలో స్టేట్‌ కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ (సీఏజీఆర్‌) ఆఫ్‌ టాక్స్‌ రెవెన్యూస్‌ 13.29 పెరిగిన మాదిరిగా అడుగులు ముందుకుపడి ఉండి ఉంటే... ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టాక్స్‌ రెవెన్యూ రూపంలో రూ.2,24,603 కోట్లు 2019–20, 20–21,21–22 సంవత్సరాలకు వచ్చి ఉండేది. 

కానీ రాష్ట్రానికి కేవలం రూ.1,85,687 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అంటే రాష్ట్రం ఈ మూడు సంవత్సరాలలో టాక్స్‌ రెవెన్యూ రూపంలో కోవిడ్‌ మహమ్మూరి వల్ల రూ.38,916 కోట్లు రావాల్సిన ఆదాయం నష్టపోయింది. 
రెండోవైపు కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ సెంట్రల్‌ గవర్నమెంటుకి కూడా 2014–19 వరకు 12.76 శాతం ఉంటే... వాళ్లకు ఇదే మాదిరిగా దెబ్బపడి వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే డెవల్యూషన్స్‌ ఇవ్వలేకపోయారు. దానివల్ల మామూలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్‌లో రూ.27,200 కోట్లు మన వాటా కోల్పోయాం. ఈ రెండింటి వల్ల ఈ మూడేళ్లలో రూ.66,116 కోట్ల  రాష్ట్ర అదాయాలను నష్టపోయాం. ఇలా కోల్పోయిన ఆదాయాలలో సొంత పన్నుల రాబడి, కేంద్ర పన్నుల వాటా కూడా ఉంది. 

ఆదాయాలు కోల్పోవడం, ఖర్చుల భారం పెరగడం తద్వారా అప్పులు భారం పెరగడం వల్ల ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలో అనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధలను కుదిపేయడం మనం గమనించాం. దీనివల్ల మన రాష్ట్రం, దేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా  అప్పులు పెరగడం, ఆనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధలను కుదిపేయడం చూశాం. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల కంటే మనం మెరుగ్గా చేశాం. 

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గణంకాలు పరిశీలిస్తే.. 2013–14లో వారికి సంబంధించిన  డెట్‌ టు  జీడీపీ రేషియో 50శాతం ఉంటే.. వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని 2018–19 సంవత్సరానికి వచ్చేసరికి డెట్‌ టు జీడీపీ రేష్యోని రకరకాల పద్ధతుల్లో 48 శాతానికి తీసుకుని రాగలిగారు.

ఎప్పుడైతే కోవిడ్‌ వంటి పరిస్థితులు వచ్చాయో... కేంద్రం యొక్క డెట్‌ టు జీడీపీ 58 నుంచి 61 శాతానికి పెరుగుదల కనిపించింది. ఇవాల్టికి కూడా 57శాతం కనిపిస్తుంది.
రెండోది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటాను గమనిస్తే.. ఇందులో కూడా బాధను కలిగించే అంశాలు కనిపిస్తాయి.

2015–19 వరకు గమనిస్తే... కేంద్ర ఆర్ధిక సంఘం సిఫార్సు 42 శాతం రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలని సిఫార్సు చేస్తే... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ కాలంలో 35శాతం మేరకు ఇచ్చింది. చంద్రబాబు హయాంలో కనీసం ఆ మేరకు వచ్చింది. వాస్తవం పైనాన్స్‌ కమిషన్‌ రికమెండేషన్స్‌ 42శాతం చేసినా.. అది ఇస్తే ఏ రాష్ట్రం అయినా సంతోషపడుతుంది. అయితే కేంద్రం రాను రాను సెస్‌లు, సర్‌ఛార్జీలు వేయడం వల్ల.. ఇవి టాక్స్‌ డెవల్యూషన్‌ పరిధిలోకి రావు. అందులో వచ్చిన ఆదాయం 100శాతం వాళ్లే తీసుకుంటారు. కాబట్టి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి. 

13వ ఆర్ధికసంఘం పీరియడ్‌లో కేంద్ర ఆర్ధికసంఘం 32శాతం సిఫార్సు చేస్తే... రాష్ట్రాలకు 28 శాతం ఇచ్చే పరిస్థితి. అదే 14వ ఆర్ధికసంఘం 42శాతం సిఫార్సు చేస్తే.. కనీసం అందులో 35శాతం రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. మన దగ్గరకు వచ్చేసరికి 15వ ఆర్ధిక సంఘం 41శాతం కనీసం రాష్ట్రాలకు ఇవ్వండని సిఫార్సు చేస్తే... మన కర్మకొద్ది 31.5శాతం మాత్రమే కేంద్రం డెవల్యూషన్స్‌ నుంచి రాష్ట్రానికి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాని అర్ధమేమిటంటే.. గతంలో చంద్రబాబునాయుడు పీరియడ్‌లో కనీసం 35శాతం అన్నా వచ్చే డెవల్యూషన్స్‌ మన దగ్గరికి వచ్చేసరికి 31.5శాతానికి పడిపోయింది. అంటే 41 నుంచి 31.5 శాతానికి పడిపోవడం అంటే 10శాతం తగ్గిపోయాయి. ఆంటే డెవల్యూషన్స్‌లో కూడా గతంలో వచ్చినవి కూడా మన టైంలో రాని పరిస్థితి. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం నడిపాం. 

ఆర్ధిక సంఘం సిఫార్సులు ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా గత ఐదు సంవత్సరాలలో గమనిస్తే... కేంద్రం నుంచి రాష్ట్రానికి  హక్కుగా రావాల్సిన వాటా 2018–19లో రూ.32,780 కోట్లు వస్తే, 2019–20లో రూ. 28వేల కోట్లుకు తగ్గింది. 2020–21కు వచ్చేసరికి అది కోవిడ్, రకరకాల కారణాల వల్ల రూ.24,460 కోట్లకు తగ్గిపోయింది. అలాంటి పరిస్థితులు చూశాం. అది మళ్లీ 2021–22కు రూ.36వేల కోట్లకు చేరింది. ఇప్పుడు మరలా 2022–23 నాటికి రూ.38 వేల కోట్లకు నెమ్మదిగా కుదుటుపడుతుంది. 

అదే మాదిరిగా జీఎస్‌డీపీలో కూడా అప్పట్లో 2014–19లో 2.72 శాతం వచ్చే పరిస్థితి నుంచి మన పీరియడ్‌లో రాష్ట్ర స్ధూల ఉత్పత్తిలో 2019–23 మ«ధ్యలో 2.92 శాతానికి పడిపోయింది. మనకు రావాల్సిన డెవెల్యూషన్స్‌ కూడా పడిపోయాయి. 

మూడో అంశం రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాలు గత ప్రభుత్వ విధానాల వల్ల కుదేలైపోయిన పరిస్థితి.
విద్యారంగాన్నే తీసుకుంటే 2018 మార్చిలో కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో(జీఈఆర్‌) గమనిస్తే.. జాతీయ సగటు 96.91 ఉంటే మన రాష్ట్రంలో 83.29శాతం ఉంది.

అమ్మఒడి పథకానికి ఆలోచన ఎలా వచ్చిందని.. చాలామందికి అనిపిస్తుంది. ఈ డేటా చూస్తే అమ్మఒడి అనేది ఎంత అవసరమో ఎవరికైనా అర్ధం అవుతుంది. ఈ డేటా 2018 మార్చిలో విడుదల అయింది.దేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలను చూస్తే... రెండూ కలిపి 36 ఉంటే మన రాష్ట్రంలో అట్టడుగును 32వ స్ధానంలో ఉన్నాం. అలాంటి అధ్వాన్నస్ధితిలో మనం వచ్చాం. అలాంటి పరిస్థితుల్లో విద్యారంగానికి  ప్రాధాన్యత ఎంత ఇవ్వాలో అంత మనం వచ్చిన తర్వాత ఇచ్చాం.
అదేవిధంగా వ్యవసాయరంగంలో రైతుల పరిస్థితి గమనిస్తే.. రూ.87,612 కోట్లు రుణాలన్నీ తన మొదటి సంతకంలోనే మాఫీ చేస్తానని, బ్యాంకులలో కుదువపెట్టిన బంగారమంతా ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి.. రకరకాల టీవీలలో ప్రచారం, ప్రతిచోటా అబద్దాలు, మోసాలతో మీటింగ్‌లు పెట్టారు. చివరకు రూ.87,612 కోట్లు రైతులు చంద్రబాబు ∙కట్టొద్దంటే కట్టకపోవడం వల్ల.. వడ్డీలతో తడిసి మోపుడైన పరిస్థితులు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి. 

మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన సంగతి దేవుడెరుగు... ఐదేండ్లు కలిపి కూడా కేవలం రూ.15వేలు కోట్లు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి. దీనివల్ల రైతుల జీవితాలు అగమ్యగోచరంగా తయారైన పరిస్థితి మన కళ్లతోనే చూశాం. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేయడం కూడా చూశాం. 
అదేవిధంగా పొదుపుసంఘాలదీ అదే పరిస్థితి. మహిళలకు సంబంధించి, వారి ఆర్ధిక స్వావలంబనకు సంబంధించి
రూ.14,205 కోట్ల పొదుపుసంఘాల రుణాలన్నీ మాపీ చేస్తానని చెప్పడం, మాఫీ చేయకపోగా2016 అక్టోబరు నుంచి సున్నావడ్డీ పథకాన్ని సైతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వకుండా రద్దు చేశారు. 

వీటన్నింటి ద్వారా.. ఏకంగా పొదుపుసంఘాలకు సంబంధించిన ఎన్‌పీఏలు, అవుట్‌స్టాండింగులు దాదాపుగా 18శాతానికి ఎగబాకాయి. ఏ, బీ గ్రేడ్‌ సంఘాలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మన పరిపాలన మొదలైంది. మహిళలకు సంబంధించి ప్రతి అడుగు వాళ్ల కాళ్లమీద వాళ్లును నిలబెట్టే దిశగా వేయాల్సి వచ్చింది. 

రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ మనం ఎదుర్కొంటున్న, వెంటాడుతున్న రెవెన్యూలోటుకు మూలాలను కూడా గమనిస్తే.. 60 ఏళ్లుగా మనం అంతా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్నది హైదారాబాద్‌ నగరం. అది ఎకనమిక్‌ పవర్‌ హౌస్‌. నేను ఎందుకు ప్రతిసారీ విశాఖపట్నం అని ఎందుకు ప్రస్తావిస్తానంటే.. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనమిక్‌ పవర్‌హౌస్‌ ఉండాలి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలు ఏ  రాష్ట్రానికైనా లేకపోతే.. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. దానికి నిదర్శనం మనం హైదరాబాద్‌ను కోల్పోయి.. ఏ రకంగా నష్టపోయామో చూపించే డేటా.

విభజన కారణంగా స్ధూలఉత్పత్పి(జీఎస్‌డీపీ)పరంగా గమనిస్తే... ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి జీఎస్‌డీపీ 2018–19లో రూ.17,31,148 కోట్లు ఉంటే... 50శాతం మనకు, తెలంగాణాకు మరో 50శాతం కనిపిస్తుంది. చూడాల్సింది ఏమిటంటే.. ఏపీలో 50 శాతం 58శాతం జనాభాకు, తెలంగాణాలో 50శాతం 42శాతం జనాభాకు.. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీని ప్రభావం ఏమిటంటే... రాష్ట్రం ప్రతి సంవత్సరం రూ.13వేల కోట్లు నష్టపోతుంది. 58శాతం జనాభాకు 50శాతం జీఎస్‌డీపీలో వాటా వలన.. ప్రతి ఏటా రాష్ట్రం రూ.13వేల కోట్లు నష్టపోతున్న పరిస్థితి.
మరోవైపు జనాభా చూస్తే మన రాష్ట్రంలో 2018–19లో జనాభా 5.14 కోట్లు, తెలంగాణాలో 3.63 కోట్లు ఉంది.

రాష్ట్ర విభజన వల్ల తలసరి ఆదాయం తగ్గిపోయింది. తెలంగాణాలో రూ.2.36లక్షలు తలసరి ఆదాయం ఉంటే... మన ఆదాయం రూ.1.69లక్షలు మాత్రమే ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి పన్నులు రూపంలో వచ్చే ఆదాయాలు గమనిస్తే... 2018–19లో 58శాతం జనాభా ఉన్న ఆంధ్రరాష్ట్రంలో స్టేట్‌ ఓన్‌ రెవెన్యూస్‌ రూ.58వేల కోట్లు అయితే, 42శాతం జనాభా ఉన్న తెలంగాణాలో స్టేట్‌ ఓన్‌ రెవెన్యూస్‌ రూ.65వేల కోట్లు ఉంది. తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం, ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 

చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే... టాక్స్‌ బాయెన్సీ. అగ్రేరియన్‌ ఎకానమీ ఉన్న మనలాంటి రాష్ట్రాలలో టాక్సులలో పెరుగుదల తక్కువ ఉంటుంది. సర్వీస్‌ సెక్టార్‌ ఉన్న పెద్ద, పెద్ద నగరాలలో, ఐటీ ఉన్న నగరాలలో టాక్స్‌ రెవెన్యూస్‌ ఎక్కువ ఉంటుంది. అందుకనే నేను విశాఖపట్నం అని గట్టిగా చెబుతుంటాను.

దేశవ్యాప్తంగా గమనిస్తే.. వ్యవసాయరంగం నుంచి జీడీపీ కాంట్రిబ్యూషన్‌ చూస్తే 18 శాతం ఉంటే... తెలంగాణాలో 17శాతం ఉంది. మన రాష్ట్రంలో వ్యవసాయరంగం నుంచి జీడీపీ కాంట్రిబ్యూషన్‌ 34 శాతం ఉంది. మనది రైతులతో కూడిన ఎకానమీ. దీనివల్ల ఏం జరుగుతుందంటే... ఎబిలిటీ టు జనరేట్‌ టాక్స్‌ మనకు తగ్గుతుంది. ఇటువంటి చోట హైదరాబాద్‌లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం. దానివల్ల  ఏం అవుతుందంటే... బాయెన్సీ ఆఫ్‌ టాక్స్‌ రెవెన్యూస్‌ కూడా తక్కువ అవుతాయి. అందుకే 2018–19లో ఏపీలో స్టేట్‌ ఓన్‌ టాక్స్‌ రెవెన్యూస్‌ రూ.58వేల కోట్లు అయితే, తెలంగాణాలో రూ.65వేల కోట్లు ఉంది. అక్కడ జనాభా 42శాతం 3.63 కోట్లు, మన జనాభా 58శాతం 5.14 కోట్లు. ఇదంతా లెక్కించి చూస్తే.. విభజన వల్ల రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.13వేల కోట్లు ఆదాయాలపరంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

రూ.13వేల కోట్లు ప్రతి ఏటా అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటే.. చంద్రబాబునాయుడు గారి 5సంవత్సరాలు అంటే రూ.65వేల కోట్లు, మన హయాంలో ఈ ఐదేళ్లు కలిపి దాదాపుగా రూ.1.30 లక్షల కోట్లు అదనపు ఆదాయం చేతిలో ఉండేది. ఆ ఆదాయం మన చేతిలో ఉండుంటే ఎన్నో కార్యక్రమాలు చేసే వెసులుబాటు ఉండేది. కానీ అన్యాయంగా ఆ వెసులుబాటు మన చేతిలో నుంచి తీసేయడమే కాకుండా.. ప్రత్యేక హోదా అన్న అంశం కనీసం చట్టంలో పెట్టి ఉంటే... కనీసం కోర్టుకు వెళ్లి అయినా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చలేదు. దీనివల్ల కేంద్రంలో రావాలంటే మనమీద ఆధారపడితే తప్పని పరిస్థితుల నుంచి.. మన కర్మకొద్దీ ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా కనిపిస్తోంది. నిజంగా ఇది బాధనిపిస్తుంది.

కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వారికి పూర్తి మెజారిటీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన సపోర్టుతో ఆధారపడే ప్రభుత్వం వచ్చిందంటే... ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశ. కానీ దురదృష్టవశాత్తూ అలా లేదు.
విడగొట్టడమే అన్యాయమైతే.. ప్రత్యేక హోదాను రాష్ట్ర విభజన చట్టంలో పెట్టకపోవడం దారుణం.

ఇటువంటి పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందులు, సవాళ్లు మధ్య మన ఆర్ధిక వ్యవస్ధను గత 57 నెలలుగా నడుపుతూ ముందడుగులు వేశాం. ఏ రకమైన సవాళ్లను ఎదుర్కున్నాం.. ఈ సవాళ్లలో ఏ రకంగా అడుగులు వేశామనేది గమనిస్తే.. ఇన్ని సమస్యులున్నా మన 57 నెలల ప్రయాణాన్ని గర్వంగా చెప్పగలుగుతాం.

ఎక్కడా అవినీతి లేకుండా పూర్తిగా వ్యవస్ధను ప్రక్షాళనం చేశాం. గతంలో మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఇచ్చే ఒక రూపాయి.. ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా? అని ప్రజలనెవరినైనా అడిగితే ఎవ్వరూ కూడా ఇది జరిగే పరిస్థితి కాదు అని సమాధానం చెప్పే పరిస్థితి నుంచి.. ఇవాళ బటన్‌ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి. లంచాలు, వివక్ష లేకుండా రూ.2.55లక్షల కోట్లు నేరుగా జమ చేసి చూపించగలిగాం. ఇదొక గొప్ప కార్యక్రమం. నాన్‌ డీబీటీ స్కీంలు ఇళ్లపట్టాలు, ట్యాబులు, విద్యాకానుక, పవర్, సంపూర్ణపోషణం, పీడీఎస్‌ బియ్యం వంటి వాటిని కూడా తీసుకుంటే.. రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. 
ఇళ్ల స్ధలాల మార్కెట్‌ విలువ కూడా తీసుకుంటే... దాదాపుగా రూ.1.76 లక్షల కోట్లు అవుతుంది. మనం ఇళ్ల స్ధలాలు ఇచ్చి తర్వాత లేఅవుట్స్‌ చేసి, ఇళ్లు కట్టించే కార్యక్రమం చేశాం కాబట్టి వాటి విలువ పెరుగుతుంది. అక్కడ కూడా మరో రూ.60 వేల కోట్లకు పైగా పెరుగుదల కనిపిస్తుంది. 

దురదృష్టవశాత్తూ మనకు శత్రువులు ఎక్కువ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇలా గోల చేసేవాళ్లు, ఒకే అబద్దాన్ని వందసార్లు చెప్పిందే చెప్పి.. అదే నిజమని భ్రమ కల్పించే కార్యక్రమం చేసేవాళ్లు కూడా ఎక్కువ. ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. 

వీళ్లందరూ మనమీద చేసే ఇంకో ఆరోపణ ఏమిటంటే.. మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ, క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు  తక్కువ ఖర్చు చేస్తున్నామనే  ఆరోపణ చేస్తుంటారు. ఇది కూడా శుద్ధ అబద్ధం. 
క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా చంద్రబాబు నాయుడు హయాంలో సగటున ఏడాదికి రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ 57 నెలల కాలంలో ఏటా సగటున మన ప్రభుత్వంలో రూ.17,757 కోట్లు మనం చేశాం. నాడు–నేడు స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు, ఇరిగేషన్‌ వంటివాటికోసం ఖర్చు చేశాం. వీటికి అదనంగా మరో మూడు పోర్టులు కడుతున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు మరో రూ.12వేల కోట్లు కలపాలి. ఇది కూడా ఖర్చు చేయడం మొదలుపెట్టాం. ఇవి కాకుండానే రూ.17,757 కోట్లు క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కింద మన ప్రభుత్వం ఖర్చుపెడుతున్న అమౌంట్‌ ఇది.

ఇక ఈ సోకాల్డ్‌ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మన మీద చేసే మరో ఆరోపణ ఏమిటంటే... మన ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని.. జగన్‌ హయాంలో విపరీతంగా అప్పులు చేసిందని నోటికి హద్దులేకుండా ఇష్టం వచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంనేరుగా గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు, సంస్ధలకు చేసిన అప్పులు, ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా ప్రభుత్వ రంగ సంస్ధలు చేసిన అప్పులు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే... విభజన నాటికి రూ.1,18,050 కోట్లు అప్పులు ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పు మరో రూ.14వేల కోట్లు మొత్తంగా చూస్తే... రూ.1.32 లక్షల కోట్లు ఉంది. వీటికి అదనంగా పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్‌ నాన్‌ గవర్నమెంట్‌ గ్యారంటీ అప్పు మరో రూ.21 వేల కోట్లు కలుపుకుంటే... ఏ రకంగా చూసినా రాష్ట్ర విభజన నాటికల్లా రూ.1.53 లక్షల కోట్లు అప్పు ఉంటే... 

చంద్రబాబు నాయుడు గారు మే 2019 దిగిపోయే వరకు ఆయన హయాంలో అప్పులు గమనిస్తే... రూ.4,12,288 కోట్లు అప్పు చేసి ఆయన దిగిపోయారు. అంటే రూ.1.53 లక్షల కోట్లు కాస్తా... రూ.4.12 లక్షల కోట్లు చేశారు. 
ఆ తర్వాత మన ప్రభుత్వంలో రూ.4.12లక్షల కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది రూ.7.03 లక్షల కోట్లు అప్పు కనిపిస్తోంది.

అప్పుల్లో ఎవరెవరి హయాంలో గ్రోత్‌ రేట్‌ ఎంత నమోదైందన్నది చూస్తే... చంద్రబాబు హయాంలో సంవత్సరానికి  అప్పుల్లో గ్రోత్‌ రేటు 21.87శాతం ఉంటే.. మన హయాంలో కేవలం 12.13 శాతమే పెరుగుదల కనిపిస్తోంది. పైగా చంద్రబాబు హయాంలో బటన్లు లేవూ, పథకాలూ లేవు, మంచి చేసే పరిస్థితి కూడా లేదు. చరిత్రా లేదు. కేవలం అప్పుడున్నది డీపీటీ దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడికింత, జన్మభూమికమిటీలకు ఇంత అని పంచుకోవడమే వీళ్లపని. 

మన హయాంలో కోవిడ్‌ వల్ల ఆదాయాలు తగ్గాయి. అదనపు ఖర్చు పెరిగింది. మరోవైపు ఎప్పుడూ ఎవ్వరూ ఊహించని విధంగా బటన్‌ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ ఇన్ని లక్షల కోట్లు ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా పారదర్శకంగా ప్రతి అకౌంట్‌కు చేర్పించిన పరిస్థితులు. మనం ఇంత చేసినా మన హయాంలో అప్పుల్లో పెరుగుదల 12.13 శాతం మాత్రమ ఉంటే... ఇవేవీ లేకున్నా చంద్రబాబు హయాంలో అప్పుల్లో పెరుగుదల(కంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ ఆప్‌ డెట్‌) 21.87 శాతం ఉంది. ఇందులో ఆర్బీఐ, కాVŠ  డేటా, స్టేట్‌ బడ్జెట్‌ డాక్యుమెంట్లు అన్నీ  ఉన్నాయి. 

స్టేట్‌ గవర్నమెంట్‌ డెట్, స్టేట్‌ గవర్నమెంట్‌ గ్యారెంటీ డెట్‌ రెండూ పరిగణలోకి తీసుకుంటే... రూ.1.32లక్షల కోట్లు రాష్ట్ర విభజన సమయంలో అప్పులు ఉంటే... రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు దిగిపోయిన మే 2019 నాటికి రూ.3.31 లక్షల కోట్లకు పెరిగింది.

చంద్రబాబు పీరియడ్‌కు, మన హయాంలో గమనిస్తే.. పెరుగుదల 14.94శాతం పెరుగుదల కనిపిస్తుంది. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 విపరీతంగా అప్పులు తీసుకొస్తున్నాడు అని మనమీద విపరీతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది కాక సగం తెలిసి, సగం తెలియని అనుంగ బ్యాచ్‌ ఇలా కౌరవసైన్యంలో భాగస్తులుగా మాట్లాడతారు. 

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014–19 మధ్య కేంద్ర ఆర్ధికసంఘం పరిమితికి మించి చేసిన అప్పులు రూ.28,457 కోట్లు. ప్రతి సంవత్సరమూ అధికంగా తీసుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ ప్రతి సంవత్సరం ఓవర్‌ బారోయింగ్‌ చేసి.. నిబంధనలకు మించి రూ.28,457 కోట్లు అప్పు చేశారు.

అదే మన ప్రభుత్వ హయాంలో ఈ ఐదు సంవత్సరాలలో ఆర్ధిక సంఘం రికమెండ్‌ చేసిన దానికన్నా రూ.366 కోట్లు తక్కువ అప్పు చేసిన పరిస్థితులు. వాస్తవాలు ఇలా అయితే ఎప్పుడు చూసినా అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. 

ఇంకో డేటా చూస్తే..తెలుగుదేశం పార్టీలో వాళ్లు  మొత్తం 5 ఏళ్ల పీరియడ్‌లో  రూ.2,58,941 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అదే 5 ఏళ్లకు సంబంధించి క్యుమిలేటివ్‌ జీఎస్‌డీపీ.. చంద్రబాబు తీసుకొచ్చిన అప్పులు 7.5శాతం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు 3.6 శాతం ఉంది.  కోవిడ్, రకరకాల కారణాలతో వల్ల ప్రపంచ వ్యాప్తంగా పెరిగినట్టే .. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ల అప్పులు శాతం 6.5శాతం అయితే... మనం అప్పు చేసింది మన జీఎస్‌డీపీలో 5.2 శాతం అప్పు చేశాం. అప్పులు పరంగా, గవర్నెర్స్‌ పరంగా, ఫిజికల్‌ మేనేజిమెంట్‌ ఇలా  ఏ రకంగా చూసినా , ఏ స్టాండర్డ్‌లో గమనించినా గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఎవరూ ఊహించని విధంగా ఈ మాదిరిగా పరిపాలన చేసామని చెప్పడానికి గర్వపడుతున్నాను. 14 ఏళ్ల అనుభవం ఉందని చెప్పే ఆయన అనుభవం ఎందుకూ పనికిరాదు.

నిజాలిలా ఉంటే... 
మన ప్రభుత్వ హయాంలో రూ.2.91లక్షల కోట్లు మనం అప్పు చేస్తే.. రూ.10లక్షలు కోట్లని, రూ.13 లక్షలు కోట్లని వారికి ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటూ పోతున్నారు.

చంద్రబాబు నాయుడు సీఎంగా 14 ఏళ్లు ఉన్నా...తాను కుటుంబాలకు ఏనాడు మంచి చేయలేదు. ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్ల పది సంవత్సరాల బ్యాంకు స్టేట్‌మెంట్‌ తీసుకోమని చెబుతున్నాను. ఆ ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మల బ్యాంక్‌ అకౌంట్‌ చూస్తే.. చంద్రబాబు పరిపాలన కాలం ఐదేళ్లలో కనీసం రూ.1 అయినా వారి బ్యాంకు అకౌంట్‌కి చేరిందా? అని వాళ్లనే అడగండి. అదే మన ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల రూపాయలు వాళ్ల బ్యాంక అకౌంట్‌కి జమ అయిందో వాళ్లనే అడగండి.

అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌.. మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమే. అప్పులు గ్రోత్‌ రేటు అప్పటి కన్నా ఇప్పుడు తక్కువున్నప్పుడు.. ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి అక్కచెల్లెమ్మలకు మంచి జరిగింది ? గత 5 సంవత్సరాలలో చంద్రబాబు హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సభ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాను.

ఆ డబ్బులున్నీ ఎవరి జేబులోకి పోయాయని ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నాను. ఆధార్‌ నెంబరు, బ్యాంకు అకౌండ్‌ yీ టెయిల్స్‌తో సహా రూ.2.55లక్షల కోట్లు ఎవరికి ఇచ్చామన్నాది.. వివరాలు చెప్పగలుగుతున్నాం.

మరి చంద్రబాబు హయాంలో ఎందుకు ఇవన్నీ చేయలేకపోయాడు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి ? ఈనాడుకి, ఆంధ్రజ్యోతి, టీవీ5కి ఎంత పోయింది. దత్తపుత్రుడుకి ఎంతిచ్చారు. చంద్రబాబుకి ఎంత పోయింది. ఇవన్నీ ఆలోచన చేయాలని ప్రజలను కోరుతున్నాను.

మనం చేయని అప్పును మనం చేసినట్టుగా.. తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడటం నిజంగా ఎంతవరకు ధర్మమని అడుగుతున్నాను?
అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎంతో చిత్తశుద్ధి, పట్టుదల, నిబద్ధతతో రాష్ట్రంలో రైతన్నలకు, పిల్లలకు, అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, సామాజిక వర్గాల సంక్షేమం కోసంఏ రకంగా అడుగులు ముందుకు వేశామో.. ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనం. హిస్టరీ విల్‌ ఆల్వేజ్‌ రిమంబర్‌. 
ఇవన్నీ కూడా నిజాలే.

కేంద్రప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా, బాబు చేసిన వల్లమాలిన అప్పులను, ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు, అసలు కట్టుకుంటూ, మరోవంక కోవిడ్‌ కారణంగా రెండు ఆర్ధిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగిన∙పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఏ కారణం చూపించలేదు.

ఎగరగొట్టడానికి ఇవన్నీ కారణాలు చూపించి.. మంచి చేసే విషయంలో ఏదీ ఎవరికీ, ఎక్కడా ఎగరగొట్టలేదు. ఎన్ని కారణాలున్నా, ఇబ్బందులున్నా, అవస్ధలున్నా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. 

ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ.. ఏకంగా మేనిఫెస్టోలో ఇచ్చిన 99శాతం హామీలను అమలు చేసి, ప్రతి ఇంటికి మేనిఫెస్టోని తీసుకునిపోయి.. చూపిస్తూ ఇవాళ ఆశీస్సులు అందుకుంటున్న ప్రభుత్వం మనది మాత్రమే. 
కాబట్టే.. ఇంటింటి ఆర్ధిక వ్యవస్ధను మార్చగలిగాం. పేదకుటుంబాలకు వీలైనంత అండగా నిలబడగలిగాం. పేదలకు అందించే ప్రతి రూపాయినీ వారి తలరాతను మార్చే విధంగా, వారి భవిష్యత్తును మార్చే విధంగా, వారి పిల్లలు పేదరికం నుంచి బయటకు వచ్చే విధంగా... ప్రతి రూపాయినీ బాధ్యతతో ఖర్చుపెడుతూ, బాధ్యతతో వాళ్లకిస్తూ.. హ్యూమన్‌ క్యాపిటల్‌ మీద పెట్టుబడి పెడుతూ వచ్చాం.

ఏ ప్రభుత్వం అయినా కూడా ఐదేళ్ల పాలనలో ప్రజలకు చెడు చేసిందని కానీ, మంచి చేయలేదని కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే.. నిజంగా నమ్మితే.. అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది. 

జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ, పరోక్షంగా మరొకరితోనూ అవగాహన కుదుర్చుకుని, కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్ధితిలో ఈ రోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్ధం ఏమిటో ఆలోచన చేయండి?

ఇంతమందిని ఏకం చేసి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, ఇన్ని పొత్తులు, ఇన్ని పార్టీలు... ఆటువైపు ఒక్కడే. ఆలోచన చేయండి.
ప్రతిపక్షం బలపడలేదు. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగులేదు. దీని అర్ధం ఇదే. ప్రజల్లో వారు లేరు కాబట్టి.. ప్రతిపక్షం పొత్తులును, కుట్రలను ఆశ్రయించింది. పొత్తులతోపాటు అబద్దాలను, మోసాలను కూడా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం. 

అందుకనే చంద్రబాబుగారు కొత్త వాగ్ధానాలతో గారడీలు చేస్తున్నారు. చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడేముందు.. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు వయస్సు 75 ఏళ్లు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయింది. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు తర్వాత.. మూడు సార్లు సీఎం అయిన తర్వాత కూడా ఇది చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని ఆయన నోట్లోనుంచి రావడం లేదు. ఇప్పుడు కూడా నాకు మరోసారి ఛాన్స్‌ ఇస్తే అది చేస్తాను, ఇది చేస్తాను అని చెబుతున్నాడు.

ప్రతిపేదకుటుంబం, ప్రతి సమావేశంలో ఈ విషయంగా చర్చ జరగాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే.. గుర్తుకొచ్చే ఒక్క స్కీం అయినా ఉందా? ఆలోచన చేయాలి.
ఆయన పేరు చెబితే.. మాత్రం ఇవాల్టికి కూడా వెన్నుపోటు గుర్తుకు వస్తుంది. ఎన్టీరామారావును ఎవరు వెన్నుపోటు పొడిచారు అంటే చంద్రబాబు పేరు గుర్తుకు వస్తుంది. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే చంద్రబాబు పేరు గుర్తుకు వస్తుంది. అక్కచెల్లెమ్మలకు ఎవరు వెన్నుపోటు పొడిచారంటే చంద్రబాబు పేరు గుర్తుకు వస్తుంది. రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎగరగొట్టింది ఎవరూ అంటే చంద్రబాబు పేరు గుర్తుకు వస్తుంది. 

బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానని ఎగరగొట్టిందీ, రైతులకు రుణమాఫీ చేస్తానని ఎగరగొట్టింది ఎవరంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబే.
ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి. మీ సామాజిక వర్గాలకు చంద్రబాబు చేసిన మేలు ఏమన్నా ఉందా ? అన్నది కూడా ప్రతి సామాజిక వర్గంలో చర్చ జరగాలి. అయన మేనిఫెస్టో కూడా పెద్ద పుస్తకం వస్తుంది. ఒక్కో పేజీలో ఒక్కో సామాజికవర్గానికి ఇన్నిహామీలు పెడతాడు. ఎన్నికల అయిన తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. కనీసం నెట్‌లో వెదికినా దొరకదు.

ఏ గ్రామానికి అయినా తాను వెళ్లి... అక్కడ నిలబడి నా హయాంలో ఇది చేశాను అని చెప్పడానికి ఒక బిల్డింగ్, స్కూల్, ఆసుపత్రి కూడా కనిపించదు. స్కూళ్లన్నీ నిర్వీర్యం చేశాడు. 
ఈ మనిషి ఇప్పుడు కూడా మరోసారి అలాంటి అబద్దాలు, మోసాలతో మరో మేనిపెస్టో అని చెప్పి ముందుకు వస్తాడు. ఈయన్ను నమ్మడం అంటే బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబిలోకి దింపి.. మనుషుల్ని తినే కథలో పులి మాదిరిగా కొత్త ఎరలో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు.
ఈయన్ను నమ్మితే ఆ పులికధే గుర్తుకు వస్తుంది. 
అబద్దాలు చెబితే భావదారిద్య్రం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం. అబద్దాలు లక్షైనా, కోటైనా చెప్పవచ్చు. అది ఆయన సిద్ధాంతం. నమ్మినవాడు మునుగుతాడు. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడు.

 ఇటీవల నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల్లో ప్రజలుకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు. ఏవి ఇంపుగా ఉన్నాయో తెప్పించుకున్నాడు. అందులో నుంచి ఒక అరడజను తీసుకున్నారు.  వేరే రాష్ట్రాల్లో ఆ పార్టీలు చెప్పిన మాటలు అక్కడి ప్రజలు నమ్మారు కాబట్టి...  మన రాష్ట్రంలో పేదలను నమ్మించి, మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఆ అరడజను హామీలను తీసుకొచ్చాడు. హైదరాబాద్‌లో ఇంట్లో కూర్చుని .. కాలు బయటపెట్టకుండా.... వేరే రాష్ట్రాలలో ఇచ్చిన హామీలన్నీ కిచిడీ చేసి.. ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు. ప్రజలమీద చిత్తశుద్ధి లేకుండా.. ఈ హామీలన్నీ నిజంగా అమలు చేస్తామా? చేసే అవకాశం, పరిస్థితిలున్నాయా?అన్న ఆలోచన లేదు. ప్రజలను మోసం చేయడానికి ఏం చెప్పాలి. ఏది చెబితే ప్రజలను  సులభంగా నమ్మించగలుగుతాం అనే ఆలోచనలతో అడుగులు వేస్తున్నాడు. 

మరోవైపు గతంలో జగన్‌ పేదలకు ఎక్కువగా సంక్షేమపథకాలు ఇచ్చేస్తున్నాడని... ఇలా ఇవ్వడం సరికాదని, సంక్షేమపథకాలు వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, జగన్‌ మాదిరిగా డీబీటీ ఇస్తే  రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబు, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇదే రాతలు రాసి.. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి జగన్‌ ఇంత చెప్పాడా? నేను ఇంకా ఎక్కువ  చేస్తానని, మోసాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి చిత్తశుద్ధి, నిజాయితీ ఎక్కడుంది. చెప్పింది చేస్తారా అని నమ్మడానికి వీళ్లలో నిబద్ధత ఎక్కడుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.

వీళ్లకి అధికారం ప్రజలకు మంచి చేయడానికి కాదు. వీళ్లకి అధికారం ఎందుకు అంటే.. ప్రజలను మోసం చేయడానికి, వీళ్లు దోచుకుని, పంచుకోవడానికి మాత్రమే కావాలి. చంద్రబాబు చరిత్ర చూసినా, మేనిఫెస్టో చూసినా అదే కనిపిస్తుంది. అవే మోసాలు కనిపిస్తాయి. 1999 మేనిఫెస్టో చూసినా, 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూసినా అవే కనిపిస్తాయి. ఆయన తొలిసంతకాలు, సామాజిక వర్గాలకిచ్చిన వాగ్దానాలు,  రైతులకిచ్చిన వాగ్దానాలు, పిల్లలకు, నిరుద్యోగులకు, అక్కచెల్లెమ్మలకు ఇలా మొత్తంగా 650 వాగ్దానాలతో మేనిఫెస్టో ఇచ్చి.. అందులో 10శాతం అమలు చేయకుండా, మేనిఫెస్టో ఎక్కడుందో తెలియకుండా వెబ్‌సైట్‌లో కనిపించకుండా తీసేసిన పరిస్థితుల్లోకి వెళ్లిన ఇలాంటి వ్యక్తిని 2024లో నమ్మడం కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఇంటిలో ఆలోచన చేయాలి.

ఎలాగూ ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు మార్క్‌ గ్యాంబ్లింగ్‌ మొదలుపెట్టాడు. వేరే రాష్ట్రాల్లో పనిచేసిన వాగ్దానాలను పట్టుకుని పేకాడకు దిగాడు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన అదే నోటితోనే.. ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్‌ వ్యవహారంలో 6 వాగ్దానాలను ఈ మధ్య చెప్పాడు. ఇవి కేవలం శాంపిల్‌. వీటికి ఇంకా అదనంగా వస్తాయని చెప్పాడు.

ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మన పార్టీకి సంబంధించి డీబీటీ అయితే నేరుగా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం, నాన్‌ డీబీటీ స్కీంలు ఇళ్లపట్టాలు, గోరుముద్ద ఇటువంటివి గమనిస్తే... రూ.2.55లక్షల కోట్లు డీబీటీగా ఇచ్చాం. మరో రూ.1.07  లక్షల కోట్లు నాన్‌ డీబీటీగా ఇచ్చాం. మొత్తంగా ఏడాదికి రూ.70వేల కోట్లు ఐదేళ్ల పాటు ఖర్చు చేశాం. 

ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని కొన్ని పథకాలు ఎవరూ రద్దు చేయలేదు. 66.34 లక్షల మందికి మనం పెన్షన్‌ ఇస్తున్నాం. దానికి సంవత్సరానికి రూ.23,600 కోట్లు ఖర్చవుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇది రద్దు చేయాడనికి లేదు. ఎవరైనా చేయాల్సింది.
రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ కోసం రూ.11వేల కోట్లు ఖర్చువుతుంది. సబ్సిడీ బియ్యం కోసం రూ.4,600 కోట్లు ఖర్చవుతుంది. ఇది కూడా ఎవరూ టచ్‌ కూడా చేయలేరు.ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరా, 108,104 కోసం రూ.4,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎవరూ ఇది టచ్‌ చేయలేని సబ్జెక్ట్‌. మరో రూ.2,200 కోట్లు వసతి దీవెన కింద ఇస్తున్నాం. ఇది కూడా ఎవరూ టచ్‌ చేయలేరు. 
సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు, బాలింతలకు, 6ఏళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం కోసం రూ.2,200 కోట్లు, ప్రతి బడిలోనూ పిల్లలకు రోజుకొక మెనూతో న్యూట్రీషియస్‌ పుడ్‌ పెడుతున్నాం. రూ.1900 కోట్లు ఖర్చవుతుంది. ఈ 8పథకాలకే రూ.52,700 కోట్లు అవుతుంది. 

ఎవరైనా రద్దు చేయాలనుకుంటే చేయికూడా వేయలేని పథకాలు. ఈ రూ.52,700 కోట్లకు చంద్రబాబు చెప్పిన ఈ 6 హామీలు కలిపితే.. మహాశక్తి 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు రూ.1500. ఓటర్ల జాబితా చూస్తే 18 ఏళ్లు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అలా అయినా రూ.36వేల కోట్లు. తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు. నోటికి ఎంతవస్తే అంత చెప్పడమే. ఇచ్చేది లేదు చచ్చేది లేదు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకుమనం మంచి చేస్తూ.. 44 లక్షల మంది తల్లులకు ఇస్తున్నాం. ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్కవేస్తే దానికి రూ.12,400 కోట్లు. 
ఆ తర్వాత యువగళం. ఈయన ఇంతకముందు 2014లో ఇంటింటికీ ఉద్యోగం, లేకపోతే రూ.2వేలు నిరుద్యోగభృతి అని 2014 ఎన్నకల మేనిఫెస్టోలో చెప్పింది చేయలేదు. దీనికి 20 లక్షల మందికి నెలకి రూ.3వేలు చొప్పున రూ.7,200 కోట్లు.

తర్వాత దీపం పథకం. 2014లో ఇలాంటికి పెట్టి చేయలేదు. ఇప్పుడు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం అని పెట్టారు .దానికి రూ.4,600 కోట్లు. తర్వాత అన్నదాత అని పెట్టాడు. మనం రైతన్నలకు రూ.12వేలు అని చెప్పి దానికంటే మిన్నగా రూ.13,500 ఇస్తున్నాం.
ఆయన రైతురుణమాఫీ చేస్తామని ఐదేళ్లకు రూ.87,612 కోట్లు చేయాల్సింది ఎగురగొట్టి.. కేవలం రూ.15 వేల కోట్లు ఇచ్చాడు.
మనం ఈ ఒక్కపథకానికి రూ.33వేల కోట్లు రైతుభరోసా కింద ఇచ్చాం. అలాంటి పథకానికి కూడా అప్పుడు మనసు రాలేదు. ఇప్పుడు పోయేదేముందని రూ.20వేలు అంటున్నాడు. దానికి ఇంకో రూ.11వేలు కోట్లు. అంతా కలిపితే రూ.73వేల కోట్లు. వీటికి అదనంగా నేను చెప్పిన రద్దుచేయలేని 8 పథకాలు కోసం రూ.52,700 కోట్లు కలిపితే.. రూ.1.26,140 కోట్లు. మన ప్రభుత్వం రూ.73 వేల కోట్లు చేయడానికి కిందా మీద పడుతున్నాం. అవినీతి లేకుండా ప్రభుత్వంలో మార్పులు చేశాం. చిత్తశుద్ధితో నిబద్దతో చేస్తున్నాం. ఈయన రూ.1.26లక్షల కోట్లు ఏడాదికి చేస్తాను అని చెబుతున్నాడు. ఈ 6 పథకాలకంటే ఇంకా ఉన్నాయని చెబుతున్నాడు. 
ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత అబద్దాలు ఆడడం  ధర్మమేనా ? మోసం చేసందుకు దుర్భిద్ధితో ప్రజలను మోసం చేయడం కోసమే రంగురంగుల మేనిఫెస్టోను తీసుకొచ్చాడు.

జగన్‌ రూ.70వేల కోట్లకే ఇంత కష్టపడుతున్నాడు. దీనికే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటున్నారు కదా ? మరి మీకు రూ.1.50 లక్షల కోట్లు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని అడిగితే.. వారికి మీడియా బలం ఎక్కువ. ఎల్లో మీడియా ఎక్కువ. గోబెల్స్‌ ప్రచారం చేయగలుగుతారు. వాళ్లంతా ఏమంటారంటే.. 

చంద్రబాబునాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యమనిపిస్తుంది. సంపద సృష్టించే కార్యక్రమం అనుకున్నా.. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాలేదు. మూడు సార్లు కలిపి.. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు చేశాడు. ఆ ట్రాక్‌రికార్డులో ఆయన ఏ మేరకు సంపద సృష్టించాడు అని కూడా చూద్దాం. ప్రజలందరూ ఈ సభద్వారా వాస్తవాలు చూడాలి.మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు సంపద సృష్టించాడో తెలియాలి. అప్పుడూ ఆయన మేనిఫెస్టో అమలు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కాకమనుపు వరకు.. 1993 వరకు రాష్ట్రం రెవెన్యూ సర్ప్‌లెస్‌.

ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత.. 1994 నుంచి ఏ సంవత్సరం తీసుకున్నా.... పదిసంవత్సరాలు చూస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న  ఏ సంవత్సరం చూసినా రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్‌. 2004 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత... 2005–06 నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో రెవెన్యూ సర్ప్‌లెస్‌. 
మరలా 2014–15లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత మరలా రెవెన్యూ డెఫిసిట్‌. ఏ సంవత్సరం చూసినా బాబు హయాంలో రెవెన్యూలోటు కనిపిస్తున్నప్పుడు మరి ఎక్కడ సంపద సృష్టించాడు. నిజంగా సంపద సృష్టించి ఉంటే.. ఏ స్కీమూ ప్రజలకు అమలు చేయని రోజుల్లో.. కూడా రెవెన్యూ  వ్యయం కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగిందంటే.. ఏక్కడ ఆయన సంపద సృష్టించాడు.

ఆయన నిజంగా అంత విజనరీ, గొప్ప మేథావి అయితే... ఆయన పాలనలో రాష్ట్రం ఎంత మెరుగుపడి ఉంటే, దేశం జీడీపీలో మన రాష్ట్రం జీఎస్‌డీపీ వాటా ఎంత అని చూస్తే.. ఆయన హయాంలో 2014–19 వరకు చూస్తే..  4.47శాతం అయితే, మన హాయంలో ఈ ఐదేళ్లలో 4.82 శాతం మనం కాంట్రిబ్యూట్‌ చేశాం. అంటే ఎవరు సంపద సృష్టించినట్లు.  అంతో ఇంతో మనమే సంపద సృషించాం. అది కూడా కోవిడ్‌ రెండు సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గడం, ఖర్చులు పెరగడం మరోవైపు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు వడ్డీలు చెల్లిస్తూ రావడం, మనం బటన్‌ నొక్కి ఇన్ని పథకాలు అక్కచెల్లెమ్మలకు జమ చేయడం వంటివి ఉన్నా కూడా.. దేశం జీడీపీలో రాష్ట్రానికి సంబంధించిన జీఎస్‌డీపీ కాంట్రిబ్యూషన్‌ మన హయాంలో ఎక్కువగా ఉంది. 

చంద్రబాబు మనసులేని నాయకుడు. మోసం చేసే నాయకుడు. తాను కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు. మనది మనసున్న ప్రభుత్వం. మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం. నిజాలు చెప్తుంది. ఇదీ ఆయనకూ మనకు ఉన్న తేడా. 
బాబుకు వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశ్యం లేదు. అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏ ఓక్కరైనా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమే. 

రాష్ట్ర ప్రజలకు వినమ్రంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. 
2014లో ఇదే చంద్రబాబునాయుడు గారి కూటమికి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా చూస్తే..  మనకు 45శాతం ఓట్‌ షేర్‌ వస్తే.. మనకన్నా 1శాతం ఎక్కువ ఓట్‌షేర్‌తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మనకు చంద్రబాబుగారి కూటమికి తేడా... దాదాపు 1శాతంతో మనం ప్రతిపక్షంలో కూర్చున్నాం. అప్పట్లో నాతో చాలామంది అన్నారు. మనం కూడా రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని మనం కూడా చెప్పేద్దాం అని అన్నారు. నా శ్రేయోభిలాషులే, నన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి సంతోషపడే మన పార్టీ శ్రేయోభిలాషులే అన్నారు. అప్పుడు నేను చేయలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అని అన్నాను. 

ఆ ఒక్కమాట నేను అబద్దం చెప్పని కారణంగా.. అధర్మం చేయని కారణంగా.. 1శాతంతో 5సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది రియాలిటీ. ఒక్క అబద్దం చెప్పి ఉంటే అధికారంలో జగన్‌ ఉండేవాడు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండేవాడు. ఆరోజు నేను చెప్పిన దానికి ఈ రోజుకీ దాని మీద చింత లేదు. మరలా వెనక్కి పోయి ఈ రోజుకీ నేను చెబుతున్నాను. నా నోటిలో నుంచి అబద్దాలు రావు. 

ఆ రోజు నేను చేసిన పనివల్ల నేను అధికారంలోకి రాకపోయి ఉండవచ్చు. నేను అధికారంలోకి రాలేకపోయినా... ప్రజల్లో విశ్వసనీయత అనే మాటకుఅర్ధం జగనే అని నన్ను నమ్మారు. 
2019 నుంచి 2023 వరకు చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టోలో 99శాతం హామీలను చిత్తశుద్ధిగా, నిబద్ధతతో అమలు చేసి.. అలా చేసిన హామీలను ప్రతి ఇంటికి వెళ్లి చూపించి... ప్రజలతోనే మార్కులు వేయించి.. ప్రజలే శెభాష్‌ అని ప్రతి ఎమ్మెల్యేను గడపగడపకూ తిప్పుతున్న ప్రభుత్వం కూడా మనదే.

మనకూ చంద్రబాబునాయుడుగారికీ ఇదీ తేడా.
అప్పట్లే బాబు రైతులను, పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలను మోసం చేయడమే కాకుండా అక్టోబరు 2016 నుంచి సున్నావడ్డీ రద్దుచేయడం, ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగభృతి ప్రతి పిల్లాడికి రూ.1.25లక్షలు బాకీ పడి, అదీ ఎగరగొట్టాడు. ఇలా రకరకాలుగా అబద్దాలు చెప్పాడు, మోసం చేశాడు కాబట్టే... 2019లో బాబుకు 175 స్ధానాలకు కేవలం 23 స్ధానాలిచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మాటమీద నిలబడ్డాం కాబట్టే...151 స్ధానాలిచ్చి మనకు ప్రజలు అధికారం ఇచ్చారు.  తొలిరోజు నుంచే మాటమీద నిలబడ్డాం కాబట్టే ...  ఆ తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలైనా, ఉప ఎన్నికల్లో అయినా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. 
విశ్వసనీయత అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది. దాన్ని ఒక వ్యక్తి సంపాదించుకోవాలంటే... ఆ పేరు సంపాదించుకోవాలంటే కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. మంచివాళ్లైనా వాళ్లకి ఆ అవకాశం రాకపోవచ్చు. దేవుడి దయ వలన ఆ పేరు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపాదించుకోగలిగింది.

ఈ రోజుకీ చెపుతున్నా.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చే యగలిగిందే చెప్తుంది. చెప్పింది ఏదైనా  కచ్చితంగా మాట మీద నిలబడుతుందని నూటికి నూరుశాతం చెబుతున్నాను. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలిని కోరుకుంటున్నాను.

దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మళ్లీ మూడు నెలలకు మళ్లీ ఇదే చట్టసభలో పూర్తిస్ధాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి అఖండమైన మెజార్టీతో మళ్లీ ప్రజల మన్ననలు పొందుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Back to Top