తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న జారీ చేసిన నియామక ఉత్వర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డికి ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. అలాగే..పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు, మీడియా సమన్వయ బాధ్యతలు ఇచ్చారు.