జ‌కియా ఖానం కుమారుడి వివాహానికి హాజ‌రైన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అన్న‌మ‌య్య జిల్లా: శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. అన్న‌మ‌య్య‌, వైయ‌స్ఆర్ జిల్లాల్లో రెండ్రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం తాడేప‌ల్లిలో త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన సీఎం.. అన్నమ‌య్య జిల్లా రాయ‌చోటికి చేరుకున్నారు. రాయ‌చోటిలో మండ‌లి డిప్యూటీ చైర్‌ప‌ర్స‌న్ జ‌కియా ఖానం కుమారుడి వివాహ వేడుక‌కు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అంత‌కు ముందు రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలను ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ క‌లిసి మాట్లాడారు.

Back to Top