ప్రతి పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం గడపాల‌న్న‌దే ల‌క్ష్యం

జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజ‌య‌వాడ‌:  రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం గడపాలనే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టార‌ని మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని నిజం చేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని  అన్నారు. విజ‌య‌వాడ‌ పశ్చిమ నియోజకవర్గంలోని 37, 51, 42, 44వ‌ డివిజన్లలోని 4 సచివాలయలలో పరిధిలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు.  వైద్యం చేయించుకున్నా ప్రజలకు మందులు పంపిణీ చేసి వైద్య పరీక్షలు ఏ రకంగా చేస్తున్నారో పర్యవేక్షించారు. అనంతరం  37వ డివిజన్ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని త‌నిఖీ చేశారు.  

వెలంప‌ల్లి శ్రీ‌నివాసరావు ఏమ‌న్నారంటే.. 
 ప్రజల ఆరోగ్యం కోసం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికీ రాని ఆలోచన మన సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చిందని, ఇందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌లను నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పరితపించిన దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి తనయుడు తన తండ్రి కంటే ఒక అడుగు ముందుకు వేసి గ్రామస్థాయి నుంచి ప్రతి ఇంటికీ వైద్య సదుపాయాలను అందించేలా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్యాంపుల ద్వారా వైద్యులను ఇంటి వద్దకే పంపి పరీక్షలు చేయించి, చికిత్సలు అందిస్తూ, ఖరీదైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని చెప్పారు. అలాగే సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం చేయిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అదనంగా 17 మెడికల్‌ కళాశాలను తీసుకువచ్చారని, అందులో 5 కళాశాలలను ఇటీవల ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో పారదర్శక పాలన అందించడంలో భాగంగా చిన్నస్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. నవంబర్‌ 15వ తేదీ వరకు జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.  కార్యక్రమంలో నగర మేయర్ రాయన బాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు ఎండీ రుహుల్లా, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు మండెపూడి ఛటర్జీ, మరుపిళ్ల రాజేష్, పడిగపాటి చైతన్య రెడ్డి, మైలవరపు రత్నకుమారి, మైలవరపు దుర్గారావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మనోజ్ కొఠారి, తదితర కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Back to Top