గతంలో స్కూళ్లు తెరవగానే తమ పిల్లలకు మంచి పుస్తకాలు కొని ఇవ్వాలి..యూనిఫాం కొనాలని తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రతి పిల్లాడికి మంచి చేయాలనే ఆలోచనతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కూల్ తెరచిన వెంటనే జగనన్న విద్యా కానుక కిట్లు అందజేస్తున్నాం. మన రాష్ట్రంలో బడిమానేసే వారు తగ్గాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చదువుకునే పిల్లలు పెరగాలి. బడికి పంపించేలా, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు, పేదరికం సంకెళ్లు తెంచే విధానంగా అడుగులు ముందుకు వేస్తున్నా. సామాజిక అంతరాలు తొలగిపోవాలి. ఆర్థిక అసమానతలు కూడా తగ్గాలి. పెద్ద చదువులు, మంచి చదువులు, ఇంగ్లీష్ మీడియం చదువులు పేదింటి పిల్లలకు కూడా అందాలి. అప్పుడే విద్యా విప్లవం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందాన్ని చూస్తాం. ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధిని చూడగలుగుతాం. ఇది నా సంకల్పం. మీ మేనమామ సంకల్పం. నా చెల్లెమ్మలకు ఒక మంచి అన్నయ్యగా ఇదే నా సంకల్పమని ఈ సందర్భంగా సగర్వగా తెలియజేస్తున్నాను.– సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు: రేపటి తరం భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం మనదని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే.. ఇవాళ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా రూ.931 కోట్లతో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 47 లక్షల మందికి మంచి చేయబోతున్నాను. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతోంది. చిక్కటి చిరునవ్వులతో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గత మూడేళ్లుగా ప్రతి అడుగులోనూ పేదరికం నుంచి బయట పడాలి. పోటీ ప్రపంచంలో నిలబడే పరిస్థితి రావాలి. అప్పుడే పేదరికం పోతుందనే గొప్ప ఆశయంతో మూడేళ్లుగా అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. అందులో భాగంగా తమ పిల్లను బడికి పంపిన తల్లులకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశాం. ఒక ఉద్యమంలా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చుతూ మన బడి నాడు–నేడు ద్వారా చరిత్రలో ఎప్పుడూ జరగని వి«ధంగా మార్పులు తెస్తున్నాం. నాణ్యమైన పౌష్టికాహారం గురించి గత ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలేదు. వాటి పరిస్థితిని మారుస్తూ జగనన్న గోరు ముద్దు కార్యక్రమం తెచ్చాం. బడుల్లో ఇంగ్లీష్ మీడియం తెచ్చాం. బైలివింగ్ టెస్ట్ బుక్స్ తెచ్చాం. మెరుగైన చదువులు అందుబాటులోకి తెచ్చేలా, శ్రీమంతుల పిల్లలకు మాత్రమే పరిమితమైన బైజూస్ యాప్‌ను మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చాం. రేపటి తరం భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం మనది. పది సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో ఆ పిల్లలు ఎలాంటి పోటీ ఎదుర్కోవాలి. ఆ పిల్లలు ఆ పోటీలో నిలబడుతారా? లేదా అన్నది ఆలోచన చేసి మన పిల్లలు నెగ్గుకురావాలనే ఆలోచనతో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చాం. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడ వెనుక బడిన పేదలందరికీ కూడా నవరత్నాల ద్వారా ఒక వైపున మంచి జరిగిస్తున్నాం. మరోవైపున పిల్లలను జాగ్రత్తగా పైకి తీసుకురావాలే సంకల్పంతో పిల్లలు చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం. నాణ్యమైన చదువును అందిస్తున్నాం. పిల్లల తలరాతలు మార్చే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ రోజు జగనన్న విద్యా కానుక అన్న పథకానికి శ్రీకారం చుడుతున్నాం. వరుసగా మూడే ఏడాది విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతుండగానే, పిల్లలు బడిలో అడుగుపెట్టగానే విద్యా కానుకను ఆ పిల్లల చేతుల్లో పెడుతున్నాం. ప్రభుత్వ బడులతో పాటు ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా జగనన్న విద్యా కానుక కిట్టు అందిస్తోంది. కావాల్సిన వస్తువలన్నీ కూడా ఉచితంగానే నాణ్యమైనవి అందిస్తున్నాం. ప్రతి ఏటా నాణ్యతను పెంచుతూ..మరో వైపు విద్యార్థుల సంఖ్యను పెంచుతూ పోతున్నాం. ఖర్చు కూడా పెరుగుతూనే ఉంది. అయినా కూడా మీ జగన్ ఎక్కడా కూడా..మీ పిల్లల మేనమామ వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నాను. 2020–2021లో విద్యా కానుకకు అక్షరాల రూ.652 కోట్లు ఖర్చు చేశాం. 2021–2022లో రూ.790 కోట్ల వ్యయంతో విద్యా కానుక కిట్లు ఇచ్చాం. ఈ ఏడాది కిట్లకు రూ.1964 చొప్పున ఖర్చు చేస్తూ 47 లక్షల మంది పిల్లలకు రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇంతటితో సరిపెట్టడం లేదు. ఈ పిల్లల జీవితాలను మెరుగు పరిచేందుకు అడుగు ముందుకు వేస్తున్నాం. 8వ తరగతి చదువుతున్న ప్రతి పిల్లాడికి అక్టోబర్‌లో ఒక లాప్‌టాప్ ఇస్తున్నాం. రూ.12 వేలు విలువ చేసే లాప్‌టాప్‌ను ఇస్తున్నాం. మరో రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకొని, ఆ కంటెంట్ సులభంగా అర్థమయ్యేలా అనుసంధానం చేస్తున్నాం. సీబీఎస్‌ఈ పరీక్షలు ఇంగ్లీష్‌లో రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆలోచన చేస్తున్నాం. విద్యా కానుక కిట్లు ప్రతి విద్యార్థికి ఉచితంగా కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫాం, ఉచితంగా బైలివింగ్ టెస్ట్‌బుక్స్, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, వీటితో పాటు నిరుడు ఏడాది డిక్షనరీలు ఇచ్చాం. కొత్తగా ఎవరైనా ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లలకు డిక్షనరీలు ఇస్తున్నాం. విద్యారంగంలో మెరుగైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థలో గొప్ప మలుపులు తిరుగుతున్నాయి. గతంలో స్కూళ్లు తెరవగానే విద్యా కానుక ఇవ్వాలని, పుస్తకాలు ఇవ్వాలని తల్లిదండ్రులు భారంగా ఆలోచన చేసేవారు. ప్రతి పిల్లాడికి మంచి చేయాలనే ఆలోచనతో విద్యా కానుక కిట్లు అందజేస్తున్నాం. మన రాష్ట్రంలో బడిమానేసే వారు తగ్గాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చదువుకునే పిల్లలు పెరగాలి. బడికి పంపించేలా, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు, పేదరికం సంకెళ్లు తెంచాలి. సామాజిక అంతరాలు తొలగిపోవాలి. ఆర్థిక అంతరాలు కూడా తగ్గాలి. పెద్ద చదువులు, మంచి చదువులు, ఇంగ్లీష్ మీడియం చదువులు పేదింటి పిల్లలకు కూడా అందాలి. అప్పుడే విద్యా విప్లవం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందాన్ని చూస్తాం. ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధిని చూడగలుగుతాం. ఇది నా సంకల్పం. మీ మేనమామ సంకల్పం. నా చెల్లెమ్మలకు ఒక మంచి అన్నయ్య సంకల్పమని ఈ సందర్భంగా సగర్వగా తెలియజేస్తున్నాను. ఈ రోజు విద్యారంగంలో ఇన్ని రకాలుగా మార్పులు చేశాం. ఒక్కసారి గమనిస్తే.. గత ప్రభుత్వ హయాంలో 2018–2019ని గుర్తుకు తెచ్చుకుంటే..ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు కేవలం 35.10 లక్షల మంది మాత్రమే. నిరుడు సంవత్సరం 1 నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ బడుల్లో చదివే సంఖ్య 44.30 లక్షలకు పెరిగింది. దాదాపుగా 7.20 లక్షల మంది అదనంగా ప్రైవేట్‌బడులను మానేసి ప్రభుత్వ బడుల్లో వచ్చి చేరుతున్నారు. ఈ మార్పును గమనించాలి. ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ చదువులు చదవాలి. ప్రపంచంతో పోటీపడాలి. విద్యారంగంలో 9 ప్రధాన కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మన బడి నాడు–నేడు విద్యా కానుక గోరుముద్దు సంపూర్ణ పోషణం అమ్మ ఒడి ఇంగ్లీష్ మీడియం చదువులు విద్యా దీవెన వసతి దీవెన బైజూస్‌తో ఒప్పందం ఇవన్నీ కూడా చిన్నారులకు మంచి భవిష్యత్ ఉండాలనే ఉద్దేశంతో తపన, తాపత్రంయంతో ఈ రోజు అడుగులు ముందుకు వేస్తున్నాను. ఆ పిల్లలందరూ బాగా చదవాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో కేవలం విద్యారంగంపైనే అమ్మ ఒడి పథకం కోసం మీ మేనమామ ప్రభుత్వం, ఆ చెల్లెల మంచి అన్న ప్రభుత్వం అక్షరాల రూ.19617 కోట్లు ఖర్చు చేసింది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పెద్ద చదువులు ఉచితంగా అందే పరిస్థితి కోసం రూ.7700 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన కింద రూ.3329 కోట్లు ఇచ్చాం. తేడా గమనించండి. గోరుముద్ద పథకం కోసం ఏడాదికి రూ. 1800 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ఏడాదికి రూ. 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. బకాయిలు పెట్టి చంద్రబాబు దిగిపోయాడు. ఈ గోరుముద్ద పథకానికి రూ. 1800 కోట్లు ఖర్చు చేస్తున్నానని సగర్వంగా చెబుతున్నాను. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ఇచ్చే మంచి పౌష్టికాహారం కోసం గతంలో చంద్రబాబు హయాంలో రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ రోజు వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణం పేరుతో ఏడాదికి రూ.1950 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యా కానుక ద్వారా ఈ ఏడాది రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. బైజూస్‌తో ఒప్పందం చేయించుకొని ట్యాబ్స్ కోసం రూ.500 కోసం ఖర్చు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో ఈ పథకానికి రూ.150 కోట్లు కూడా ఇవ్వలేదు. తేడా గమనించండి. ఆడపిల్లలకు మరింత అండగా నిలుస్తూ టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం నెలకు 10 బ్రాండెండ్ శానిటరీ న్యాప్‌కిన్లు అందజేస్తున్నా. ప్రతి తల్లి, చెల్లి తేడా గమనించాలి. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువే. పేదరికం పోవాలంటే మన పిల్లలు ఆ పేదరికాన్ని జయించాలి. మంచి చదవులతోనే సాధ్యం. ఆ పిల్లల జీవితాలు బాగుండాలని మనసా, వాచా, కర్మన మనసారా కోరుకుంటూ..ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఆ దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.. ఆదోనికి వరాల జల్లు –ఆదోనికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నా.. – ఆదోనికి ఆటో నగర్ మంజూరు – జగనన్న కాలనీకి బీటీ రోడ్డు మంజూరు – బుగడజంగాల కోసం ఎస్టీ సర్టిఫికెట్ మంజూరు కోసం వన్ మేన్ కమిషన్ రేకమెండేషన్‌ను ఎస్సీ కమిషన్‌కు పంపించాం. అటు నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బోయల సమస్యల పరిష్కారానికి ఇవే అడుగులు వేస్తాం. –మంచినీటి సమస్య పరిష్కారానికి రూరల్ ప్రాంతంలో సర్వే చేయిస్తాం. ప్రతి గ్రామానికి మంచినీరు సరఫరా చేస్తాం. – ఆదోని టౌన్‌లో రోడ్ల విస్తరణకు రూ.50 కోట్లు అవసరమన్నారు. వీటికి కూడా నిధులు మంజూరు చేస్తున్నా. – దేవుడి అనుమతితో కొండపైన ఉన్న దర్గాను కూడా సందర్శిస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ హామీ ఇచ్చారు.