

















వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిక
హైదరాబాద్: వైయస్ఆర్‌సీపీలోకి వలసలు పోటెత్తుతున్నాయి. పలువురు నేతలు, వివిధ రంగాల ప్రముఖుల చేరిక, ఆ సందర్భంగా తరలివస్తున్న వారితో పార్టీ అధినేత వైయస్ జగన్ నివాసం కిటకిటలాడుతోంది. తాజాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత లబ్బి వెంకటస్వామి, టీడీపీ నాయకుడు దస్తగిరిరెడ్డిలు వైయస్ఆర్ సీపీలో చేరారు. వీరికి వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాగా, నిన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లు అర్జున్‌కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, పెద్దబాబు, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మతో పాటు పలువురు వైయస్ జగన్‌ను ఆయన నివాసంలో వేర్వేరుగా కలసి వైయస్ఆర్ సీపీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వెల్లడించారు. జగన్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.