తాడేపల్లి: నేను నిప్పు అని చెప్పుకుంటున్న చంద్రబాబును నమ్మెద్దు అని, తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని, న్యాయం గెలుస్తుందని చెప్పడానికి స్కిల్ స్కామ్‌లో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన జరుగుతోందనేది స్పష్టంగా తేలిందన్నారు. అవినీతి ఎవరు చేశారో.. నిరుద్యోగుల ట్రైనింగ్ పేరుతో రూ.371 కోట్ల ఏపీ ఖజానాకు కొల్లగొట్టిన ఘనుడు ఎవరో ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడారు. చంద్రబాబునాయుడు దొరికిన దొంగ. మేం చంద్రబాబు అవినీతిపరుడు అని మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాం. నేను తెల్లకాగితాన్ని అని చెప్పుకుంటున్న చంద్రబాబును నమ్మవద్దని ప్రజలకు చెప్తూనే ఉన్నాం. దొరికిపోయిన దొంగలా ఈ రోజు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఏపీ ప్రజలు చంద్రబాబు అకృత్యాలను గమనించాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి వైయస్ జగన్ రూ.2.35 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇస్తే దానిలో ఒక్క పైసా అవినీతి జరిగిందని కూడా చంద్రబాబు చెప్పలేక పోయాడు. ఆయన 14 ఏళ్లలో మాత్రం ప్రజలకు ఏమీ చేయకుండా కోట్ల రూపాయలు దండుకున్నాడు. చంద్రబాబు పాపం పండింది. ఇలాంటి పలు అవినీతి కేసుల్లో ఇంకా దొరుకుతూనే ఉంటాడు. రాబోయే రోజుల్లో ఆయనపై అనేక కేసులు రాబోతున్నాయి. ఆయన ప్రజల్ని మోసం చేసిన తీరు దోషిగా నిలబెడితే.. ప్రజా క్షేత్రంలో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని దొంగ. చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త..నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అచ్చెన్నాయుడు ఇంతక ముందే చెప్పాడు..పార్టీ లేదు..ఏమీ లేదని. ఈ రోజు కూడా జనం రోడ్ల మీదకు రావాలని అచ్చెన్నాయుడు కోరుతున్నాడు అంటే వారి పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.