తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా డాక్టర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ సమతా విగ్రహాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశామని మంత్రి మేరుగు నాగార్జున, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తెలిపారు. సంతనూతలపాడులో నా గెలుపునకు టీజేఆర్ సహకరిస్తారు: మంత్రి మేరుగు నాగార్జున వచ్చే ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పోటీచేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, గౌరవ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశించారు. ఆమేరకు ఇప్పటికే అక్కడ మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ టీజేఆర్ సుధాకర్‌బాబు కూడా నాకు అన్నివిధాలుగా సహకరించి పార్టీ గెలుపునకు పనిచేయనున్నారు. మేమిద్దరం కలిసి ఆ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాము. సమన్వయకర్తగా నియామకాన్ని స్వాగతిస్తున్నాను: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వేమూరు శాసనసభ్యులు, మంత్రివర్యులు మేరుగు నాగార్జున అన్నను నూతనంగా సంతనూతలపాడు నియోజకవర్గానికి సమన్వయకర్తగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఆయనకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే: దళితుల్ని హీనంగా చూసిన చంద్రబాబుః చంద్రబాబు పరిపాలనలో దళితుల్ని నీచంగా చూశారు. చాలా దారుణంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, మా కులప్రస్తావనల్ని తెచ్చి మా కులాల్లో ఎవరూ పుట్టకూడదని చంద్రబాబు అన్నాడు. మా దళిత జాతి అంతుచూస్తానన్నాడు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన చట్టాలను ఆయన చుట్టాలుగా వాడుకుని మా మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలకు పాల్పడ్డాడు. దళిత మహిళల్ని వివస్త్రలను చేయించాడు. ఇంత నీచమైన ఘటనలకు పాల్పడిన ఆయన.. ఏనాడూ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు పూనుకోలేదు. ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యవాదులంతా ఆరాధ్యదైవంగా పూజించే అంబేద్కర్ మహాశయుని విగ్రహం పెట్టాలనే కనీస ఆలోచన కూడా చేయలేదు. దేశానికే ఐకాన్ గా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుః డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిపై ఉన్నటువంటి భక్తి, అనురక్తితో ఒక గొప్ప సంకల్పానికి జగన్ గారు శ్రీకారం చుట్టారు. విజయవాడ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జాతి యావత్తూ గర్వించ దగ్గ విషయం. మొదట్లో రూ.175 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడదామని అనుకున్నప్పటికీ.. దాదాపు రూ.400 కోట్లను వెచ్చించి ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తులో, మరో 81 అడుగుల పీఠంతో.. దేశానికే ఒక ఐకాన్‌లా అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ప్రపంచ నలుమూలలనున్న అంబేడ్కరిస్టులు భారతదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో, విజయవాడలో నిర్మితమైన ఈ భారీ విగ్రహ ప్రాజెక్టును సందర్శించేంత గొప్పగా ఇక్కడ తీర్చిదిద్దారు. అంబేడ్కర్ గారి మహా శిల్పంతోపాటు మ్యూజియం, లైబ్రరీ, అత్యంత సుందరంగా స్మృతివనం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సామాజిక న్యాయ సంస్కర్త వైయస్ జగన్ః ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయ సంస్కర్త, ఎంతమంది అడ్డు తగిలినా మొక్కవోని దీక్షతో తన సంకల్పాన్ని పూర్తి చేసిన బడుగు బలహీన, పేద వర్గాల పక్షపాతి. జగన్ గారి ప్రతి సంస్కరణా.. అంబేద్కర్ గారి ఆలోచనల నుంచి పుట్టిందే. నూటికి నూరు శాతం అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న ప్రభుత్వం ఇది. ఆయన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి, అమల్లోకి తెచ్చామని చెబుతూ.. విజయవాడలో అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని 19న జగన్‌గారు జాతికి అంకింతం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంబేడ్కర్ గారి మహా శిల్పం సువర్ణాక్షరాలతో లిఖించబడుతూ ప్రపంచంయావత్తూ జగన్‌గారి ప్రయత్నాన్ని కొనియాడే తరుణమిది. ఎస్సీల సంక్షేమానికి రూ.63 వేల కోట్లు ఖర్చుః తరతరాలుగా ఎదుగుబొదుగులేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల బతుకుల్లో వెలుగులు నింపిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సామాజిక విప్లవానికి ధైర్యంగా ముందడుగేసిన నాయకుడిగా జగన్ గారిని ప్రతీ పల్లెల్లో, ప్రతి వాడల్లో మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దేవుడిగా కొలుస్తున్నారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్‌లు పెట్టి వాటి ద్వారా ఎస్సీ కులాల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్‌గారు. ఐదేళ్ల చంద్రబాబు అధికార హయాంలో కేవలం రూ.33వేల కోట్లు మాత్రమే ఎస్సీల సంక్షేమానికి ఖర్చుచేస్తే.. అదే జగన్ గారు అధికారంలోకొచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలోనే రూ. 63 వేల కోట్లు ఖర్చు చేసి ఎస్సీ కులాల్ని అభివృద్ధిలోకి తెచ్చారు. ఎస్టీలకు గతంలో పంపిణీ చేసిన భూముల్లో అనాదిగా ఎలాంటి హక్కులు లేకుండా లబ్ధిదారులు సాగుచేసుకుంటున్న పరిస్థితి ఉండేది. అ భూముల్ని గుర్తించి సుమారు 22వేల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించి.. వారికి సంపూర్ణ హక్కులు ప్రసాదించిన ఘనత జగన్‌గారికే దక్కుతుంది. పేదవాడి ఆరోగ్యానికి ప్రయార్టీ ఇచ్చి, తెల్లరేషన్ కార్డు ఉంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా ఎంపిక చేసిన ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యచికిత్సలు చేయించుకునే సదుపాయం కల్పించిన పేదల పెన్నిధి జగన్‌గారు. పేదవారికి ఒకపక్కన చదువు, మరో పక్కన ఆరోగ్యం, వారికి స్వంత ఇల్లు ఉండాలనే తాపత్రయంతో ఇళ్లు లేని వారికి 31 లక్షల ఇళ్లపట్టాలతో ఉచితంగా ఇంటిస్థలమిచ్చి, 22 లక్షల ఇళ్ళ నిర్మానం చేపట్టిన మహోన్నత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారు. ఇవేకాకుండా రాజకీయ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అగ్రతాంబూలం అందించిన సామాజిక విప్లకారుడు ఆయన. అంబేద్కర్ భావాల్ని అణగదొక్కిన చంద్రబాబుః పేద పిల్లలు పెద్ద చదువులు చదవకూడదని కుట్ర చేసిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. ఆయన హయాంలో దాదాపు రాష్ట్రంలో 6వేల ప్రభుత్వ పాఠశాలల్ని మూసేశాడు. ఒకే పెన్‌స్ట్రోక్‌తో అసలు జీవోలే లేకుండా రాష్ట్రంలో 2 వేల హాస్టళ్లు కూడా మూసేయించాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులపై శ్రద్ధ చూపకుండా, ప్రైవేటు విద్యా సంస్తలకు దన్నుగా నిలిచి అంబేద్కర్ మహాశయుని ఆలోచనల్ని పూర్తిగా తుంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు. పేదలను చంద్రబాబు ఎంతగానో దగా చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు తలెత్తుకుని బతికేలా.. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులు ఎటువంటి రక్షణ లేకుండా బిక్కుబిక్కు మంటూ బతికారు. ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం మారుతుందా..? అని అందరూ ఎదురుచూశారు. అదే జగన్‌గారు అధికారంలోకొచ్చాక దళిత కుటుంబాల స్థితిగతులు మారాయి. ఈరోజు దళితులు ధైర్యంగా బతుకుతున్నారు. నాడు 12 శాతం ఉన్న పేదరికం నేడు 6 శాతానికి వచ్చిందంటేనే జగన్ గారి పరిపాలనా సమర్థత ఎంతగా ఉందో ఆందరూ గమనించాలి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా నేడు తలెత్తుకుని గర్వంగా బతుతుకున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ లంటూ వారికి డీబీటీ ద్వారా రూ.2.50 లక్షల కోట్లు సంక్షేమ లబ్ధిని అందించి ఆర్థికసమున్నతికి దోహదం చేసిన ప్రభుత్వమిది. రాష్ట్రంలో దాదాపు 2.10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తే.. అందులో 80 శాతం ఉద్యోగాలు పొందినవారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటమనేది ఒక చరిత్ర. ఈ రాష్ట్రంలో పేదవాడి మనోధైర్యం పెరిగి వారి జీవన స్థితి మారింది. రాజ్యాధికారంలో మేమంతా భాగస్వామ్యులం అయ్యామని చెప్పేందుకు గర్విస్తున్నాం. ఒకప్పుడు ఎస్టీ కమిషన్ ఉండేదికాదు. అదే జగన్‌గారు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించాలని తీర్మానం చేసిన చరిత్ర జగన్ గారిదని తెలియజేస్తున్నాను. ఇవన్నీ అంబేద్కర్ ఆలోచనల మీద నిర్మితమైనవి గనుకే, వాటి పునాదుల మీదనే 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని ధైర్యంగా, దమ్ముగా చెబుతున్నాం. విగ్రహం పెట్టలేనందుకు చంద్రబాబు సిగ్గుపడాలిః చంద్రబాబు దళితుల్ని అడుగడుగునా చులకన చేస్తూ.. వారిని హీనాతీహీనంగా చూశాడు. అందుకనే, ఆయనకు అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే మనసు రాక.. పెట్టలేక చేతులెత్తేస్తే ఈనాడు రామోజీరావుకు ఎల్లో పత్రికలకు, టీవీలకు కనిపించదు. సిగ్గులేకుండా, ఇంకా చంద్రబాబు తన పార్టీలో ఉన్న దళిత నేతలతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై మాట్లాడిస్తున్నాడు. చంద్రబాబు చెబితే ఆ పార్టీ నేతలు గొర్రెల్లా తలూపి, అంబేద్కర్ మహాశయుని విగ్రహం ఏర్పాటుపై అవాకులు చెవాకులు మాట్లాడటానికి సిగ్గుండాలి కదా..? రూ.400 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలా..? అంటూ చంద్రబాబు తన పార్టీ నేతలతో మాట్లాడిస్తున్నందుకు సిగ్గుపడాలి. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అందరూ భాగస్వాములవ్వాలిః దళిత, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతిగా ఉన్న అంబేద్కర్ మహాశయుని విగ్రహానికి రూ.400 కోట్లే కాదు. ఎంతైతే అంత ఖర్చుపెట్టడానికి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు మేం గర్వపడుతున్నాం. అంబేద్కరిస్టులుగా చెప్పుకునే ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరూ చేయలేని సాహసోపేత నిర్ణయం మా ముఖ్యమంత్రి జగన్ గారు తీసుకున్నారని గొప్పగా చెప్పుకుంటున్నాం కాబట్టి.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలతో పాటు ఇతర సామాజికవర్గాల్లోని అంబేద్కరిస్టులంతా కులాలు, మతాలకతీతంగా, రాజకీయాల్ని పక్కనబెట్టి విజయవాడలో జాతికి అంకింతం చేయబోతున్న అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఆ వర్గాలన్నీ రుణపడి ఉంటాయిః ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు దళితజాతి యావత్తూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న మహాకార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ. ఈ కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా మొదలుపెట్టి పూర్తిచేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దళితజాతి మొత్తం రుణపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో అంబేద్కర్ మహాశయుని పేరు తలవని, ఆయన విగ్రహం లేని ప్రాంతముండదు. అలాంటిది, ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంలా అందరూ గర్వపడే విధంగా నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టింపజేసిన విధానాన్ని విజయవాడలో మనం చూస్తున్నాము. సామాజిక న్యాయ సమతా విగ్రహావిష్కరణకు తరలిరావాలిః పేదవాడి అభ్యున్నతికి, అభివృద్ధికి.. బడుగు, బలహీనవర్గాల హక్కుల పరిరక్షణకు దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ మహాశయుని విగ్రహం ఏర్పాటు అనేది రాష్ట్రంలో ఊరూరా పండుగేనని చెప్పాలి. కనుక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఇతర సామాజికవర్గాలంతా కులాలు, మతాలకతీతంగా సామాజిక న్యాయ సమతా విగ్రహావిష్కరణకు తరలిరావాలి. గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఈ మహాయజ్ఞాన్ని అంతా ఆశీర్వదించాలని ఆహ్వానిస్తున్నాము. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వారి బాటలో నడిచే పరిపాలనాధినేత వైయస్ జగన్ గారు చేసిన సాహసోపేత ప్రయత్నాన్ని అందరూ అభినందించాలని కోరుతున్నాను.