విజయవాడ: చంద్రబాబు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను, అధికారమిచ్చిన ప్రజలనే కాదు.. తన అబద్ధాలతో బెయిల్ ఇచ్చిన జడ్జిని కూడా మోసం చేశాడని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బెయిల్ వచ్చాక చంద్రబాబు డ్రామాలన్నీ బయటపడ్డాయన్నారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. రిషికొండపై టీడీపీ వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసిందన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖపై టీడీపీ విషం చిమ్ముతూనే ఉందని మండిపడ్డారు. టీడీపీ ఎంత గింజుకున్నా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగానే సీఎం క్యాంపు కార్యాలయం ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు లేని జబ్బులన్నీ టీడీపీ నేతలే ప్రచారం చేశారన్నారు. నారా లోకేష్‌కి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నా.. ఆయన సినిమా అన్న భయమేనని, అందుకే వ్యూహం సినిమా మీద ఫిర్యాదు చేశాడన్నారు.