సచివాలయం: సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంచి పౌష్టికాహారం ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తల్లీ, పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లను ఆదుకునేందుకు స్టేట్ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పెళ్లి కానుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ తీరుతో శిశు సంక్షేమ శాఖలో బకాయిలు పేరుకుపోయాయన్నారు. వాటన్నింటిని క్లియర్ చేస్తూ తల్లి, బిడ్డలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులని, వారికి ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. Read Also: దేవాలయాల దీప దూపా నైవేద్యాల కోసం నిధులు