అనంతపురం: జగనన్న పరిపాలనలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతుంటే ఎల్లో మీడియా అబద్ధపు కథనాలు ప్రచురించి ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నాయని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఎల్లో మీడియా కథనాలు నమ్మొద్దని సూచించారు. బుక్కరాయ సముద్రం మండలం చెదుళ్ల గ్రామంలో ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రతి గడపకి వెళ్లి మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ, జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. జగనన్న పథకాల వల్ల ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో, ఆ విద్యార్థి చదువు ఎంతవరకు సాగిందో, వారి కష్టాలు ఎన్ని తీరాయో అన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే కొందరు మహిళలను ఎల్లో మీడియా రాస్తున్న వార్తలను చూపిస్తూ, అమ్మా వీరిలా రాస్తున్నారు, మరి ఆ వార్తలు నిజమా? మీకు అందుతున్న జగనన్న సంక్షేమ పథకాలు నిజమా? అని ప్రశ్నించారు. అందుకు ఒక మహిళ, పథకం అందుకున్న తర్వాత, మా పిల్లలు సక్రమంగా చదువుతున్న తర్వాత, పాఠశాలలు అందంగా మారిన తర్వాత, ఆరోగ్య శ్రీ అందుకున్న తర్వాత, ఇలా ఎన్నో పథకాలను తీసుకుంటూ లేవని ఎలా చెబుతామమ్మా, ఎలా చెప్పగలమని సమాధానమిచ్చారు. ఇలాంటి సమాధానాలు చూసిన తర్వాతైనా సరే, దుష్టచతుష్టయంతో కూడిన ఎల్లో మీడియా తన పిచ్చి రాతలను మానుకోకపోతే ప్రజలే ఆ పత్రికలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రెండోరోజు ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమం దిగ్విజయంగా సాగిపోయింది. మహిళలు ఎమ్మల్యే జొన్నలగడ్డ పద్మావతికి నీరాజనాలు పట్టారు. హారతులు ఇచ్చారు. జగనన్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చి ఎమ్మెల్యేగారి వెంట ఊరేగింపుగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి,ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్లు, వైయస్సార్ సీపీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, అధికారులు ఉన్నతాధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు,పాల్గొన్నారు.