తాడేపల్లి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని కోరుతామని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. సమావేశం వివరాలను ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ సూచించారని తెలిపారు. విభజన చట్టంలోని అంశాల సాధనకు పార్లమెంట్ సమావేశాల్లో అడగాలని సూచించినట్లు చెప్పారు. పోలవరానికి రావాల్సి నిధులపై కూడా కేంద్రాన్ని కోరాలని తెలిపారన్నారు. పోలవరం కాపర్ డ్యామ్ పూర్తి చేసిన తరువాత భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సభలో ఒత్తిడి చేయాలని సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు తప్పని సరి చేస్తూ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపామన్నారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా ఎంపీలందరూ కృషి చేయాలని సీఎం వైయస్ జగన్ తమకు సూచించినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ అనేక పోరాటాలు చేసిందన్నారు. గత సమావేశాల్లో కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అందరం కలిసి కేంద్రాన్ని కోరుతామన్నారు. వీటిని సాధించుకుంటునే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని చెప్పారు. Read Also: బీసీలను టీడీపీ వాడుకొని వదిలేసింది