వరదరాజులురెడ్డికి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు కొత్తేమి కాదు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 

వైయ‌స్ఆర్ జిల్లా:  టీడీపీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజులురెడ్డికి బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు కొత్తేమి కాద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమ‌ర్శించారు. ఎమ్మెల్యే తీరును ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. మంగ‌ళ‌వారం శివ‌ప్ర‌సాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.`ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి పోలీసు, రెవిన్యూ అధికారులు పూర్తి అవినీతిపరులంటూ మాట్లాడారు. అధికారం ఎవరిది...తెలుగుదేశం పార్టీది కాదా...? మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే కాదా..?. ప్రభుత్వ అదికారులంతా అసమర్థులు, లంచగొండిలని ఆయన మాట్లాడుతున్నారు. 
దాన్ని బట్టి ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అనే ఆయన చెప్పకనే చెబుతున్నారు. వరదరాజులరెడ్డి మాటల్లో రాజకీయ స్వార్ధం ఉందని అనుకోవాలా..? ఎందుకు డీఎస్పీని లంచగొండి అని మాట్లాడారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. కేవలం తన మనిషిపై క్రికెట్‌ బుకీగా కేసు నమోదు చేశారని ఆయన డిఎస్పీపై విరుచుకుపడ్డాడు. పోలీసులు సహకరించలేదని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తెరలేపాడు. ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు వరదరాజులురెడ్డికి కొత్త కాదు.. ఆయన చెప్పినట్లు వింటే...ఆ అధికారులు మంచివాళ్లు అంటాడు. ఆయన అక్రమాలకు మద్దతు పలకకపోతే అవినీతిపరులనే ముద్ర వేస్తాడు. మునీవర్‌ అనే వ్యక్తిపై క్రికెట్‌ బుకీగా కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 13మందిని అరెస్ట్‌ చేశారు...అందరూ మునీవర్‌ అనే వ్యక్తి పేరే చెప్పారు. పోలీసులకు సాక్షాలు, స్టేట్‌మెంట్లు అన్నీ తీసుకున్నారు..తప్పనిసరిగా కేసు నమోదు చేయాల్సి వచ్చే కేసు పెట్టారు.
ఏ నేరం చేయకుండా అధికార పార్టీ నేతపై కేసు పెట్టే ధైర్యం పోలీసులకు ఉంటుందా?. వరదరాజులురెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు అధికారులను బలి చేయాలని చూస్తున్నాడు. గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్‌ విషయంలో సహకరిస్తే...డిఎస్పీ మంచిదా...? ఈ రోజు మునీవర్‌పై కేసు పెడితే డిఎస్పీ అవినీతిపరురాలు అయ్యిందా..? మీ మనుషులు క్రికెట్‌ బుకీలుగా మారినా, ఇసుకను, భూములను, రేషన్‌ బియ్యం దోపిడీ చేసినా పట్టుకోకూడదా? టీడీపీ పార్టీ కార్యక్రమాల కోసం మొన్నీ మధ్య బ్రాంది షాపుల వారిని పిలిచి నువ్వు డబ్బులు అడగలేదా? అది లంచం కాదా? నీ మాట వినకపోతే అక్కడున్న అధికారులంతా చెడ్డవారే అంటున్నాడు. నువ్వు గెలిచిన 9 నెలల్లో ముగ్గురు డిఎస్పీలను మార్చారు` అంటూ శివ‌ప్ర‌సాద్‌రెడ్డి కామెంట్స్‌చేశారు.

Back to Top