ఇంత ఆత్మవంచన అవసరమా పురంధేశ్వరి గారూ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి వైఖ‌రిని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తారు చిన్నమ్మా! కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చెయ్యమంటారు. ఇంత ఆత్మవంచన అవసరమా పురంధేశ్వరి గారూ? తను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావ గారికి బెయిల్ వచ్చిందని ఆనందంలో తేలిపోతున్నారు. అయ్యో! అలాంటిది ఏమీ లేదంటే…సుప్రీంకోర్టు CJI గారికి లేఖ రాయండి బెయిల్ రద్దు చేయమని అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top