తాడేపల్లి: కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్‌ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఏమన్నారంటే..: సజ్జల రామకృష్ణారెడ్డి: వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్: – ఐదు కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతి గడపకూ వెళ్ళి సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించింది వైయస్ జగన్ ప్రభుత్వం. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే విధంగా వైయస్ జగన్ పాలన కొనసాగించారు. కలలు కనడం కాదు దానిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ గారు మాత్రమే అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్ళలో దానిని సమాన స్ధాయికి తీసుకొచ్చారు. పేదలు, ఎస్సీలు, మైనార్టీలు వీరిని ఎలా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలుచేసి నిరూపించిన ఘనత జగన్ గారిది. ఒక సంస్కర్తలా అణగారిని వర్గాలను చేయి అందించి పైకి తీసుకొచ్చారు. మొక్కవోని దీక్ష, నిబద్దత వల్లే ఇది సాధ్యమవుతుంది. అవన్నీ జగన్ గారిలో మనం చూశాం. మన పార్టీ పేదల పక్షం అని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్నిచ్చారు. అదే కూటమి నాయకులు ఏడాది తిరగక ముందే బయటికి రాలేని పరిస్ధితుల్లో ఉన్నారు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తూ పాలన సాగిస్తున్నారు. బరితెగింపు పాలన స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా వైఎస్సార్‌సీపీ నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి ఉంది. వైఎస్సార్‌సీపీ డీఎన్‌ఏ పేదల పక్షపాతిగా ఇలాగే ఉంటుంది. జగన్ గారు అన్నట్లు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా బడుగు బలహీన వర్గాలనేది ఈ పార్టీలో ఎప్పటికీ అదే ఉంటుంది. ఉన్నత విద్య, వైద్యం పేదవాడికి అందినప్పుడే నిజమైన అభివృద్ది అని భావించి జగన్ గారు పాలించారు. సమగ్రమైన ప్రణాళిక, ఆలోచనతో పాలన సాగింది. దేశం గర్వించే రీతిలో విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసింది జగన్ గారి ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై నిబద్దతతో ఆలోచించి ఏర్పాటు చేస్తే చంద్రబాబు సీఎంకాగానే దానిని గాలికొదిలేశారు. కచ్చితంగా దానిని మనం ఎదుర్కుందాం, జాతి సంపద అంబేద్కర్ విగ్రహం, దానికి ఎవరు ఎలాంటి నష్టం తెచ్చే ప్రయత్నం చేసినా నిలువరించి మనం అధికారంలోకి రాగానే పూర్వ వైభవం తీసుకొద్దాం. అంబేద్కర్ విగ్రహం కొందరికి కంటగింపుగా మారింది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను రక్షించుకుందాం. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు, కులాలు, మతాలు, జాతుల మధ్య వైషమ్యాలంటూ ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారు. పైగా వ్యక్తిత్వ హననం చేస్తూ మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎప్పుడూ చూడలేదు. మనమంతా ఒక్క తాటిపైకి వచ్చి కలిసి ముందుకు నడుద్దాం. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడం, మనం సంస్ధాగతంగా బలోపేతం అవడంపై దృష్టి పెడదాం. మనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కుందాం. కమిటీల నియామకం త్వరగా పూర్తిచేయాలి. నిత్యం జనం మధ్య ఉందాం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం, మనమంతా కలిసికట్టుగా ఒక్క తాటిపైకి వచ్చి వచ్చే ఎన్నికలకు సిద్దమవుదాం, మనం గతంలోకంటే మెరుగైన విజయం సాధిద్దాం, అది చారిత్రాత్మక అవసరం కూడా. మనల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో రెండింతలు చూపిద్దాం. కూటమి నాయకులకు కూడా ఇప్పటికే అర్ధమైంది. కావున మనం కార్యకర్తల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. టీజేఆర్ సుధాకర్ బాబు: వైయస్సార్ïసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు. కొమ్మూరి కనకారావు పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ – వైయస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగింది. కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పవన్‌కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారు. దళితులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. మన ఆత్మగౌరవం మళ్ళీ నిలబడాలంటే మనమంతా జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి. తండ్రికి తగ్గ తనయుడిగా మన జగనన్న మన దళిత బిడ్డలకు అన్ని సంక్షేమ పథకాలు అందజేశారు. మన దళితులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆదుకున్నారు. దేశమంతా జగనన్న పాలనను భేష్ అన్నారు. మనం జగనన్న నాయకత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావించాలి. అణగారిన వర్గాలకు రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత మన జగనన్నది. డిప్యూటీ సీఎంతో పాటు మన దళితులు ఐదుగురికి క్యాబినెట్‌లో చోటు కల్పించిన ఘనత జగనన్నది. మన ఎస్సీ బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించారు. మన జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవాలి. జగనన్న పాలనలో ఏ విధంగా సంక్షేమం అమలు చేశారు.. ఇప్పుడు అదెలా దూరం అయిందో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏపీలో వైయస్ జగన్ పాలన నిజమైన అభివృద్దికి, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దేశంలో మరెక్కడా లేని విధంగా చక్కటి పాలన ప్రజలకు అందించారు. మనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం జగనన్నను సీఎం చేసుకుని సంక్షేమ రాజ్యాన్ని స్ధాపించుకుందాం. ఎందుకంటే మన ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. నందిగం సురేష్: మాజీ ఎంపీ. – జగనన్న మన అణగారిన వర్గాలకు అండగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మనల్ని అణగదొక్కుతున్నారు. చంద్రబాబు దళితులను అవమానిస్తే జగనన్న ఢిల్లీలో కూర్చోబెట్టి మనల్ని గౌరవించారు. పవన్‌కళ్యాణ్ పిఠాపురంలో దళితులను అవమానిస్తున్నా కనీసం స్పందన లేదు. చంద్రబాబు విజనరీ అంటూ రాష్ట్ర సంపదను దోచుకుంటాడు. రాష్ట్రంలో అనేక చోట్ల దళితుల కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ముళ్ళకంపల్లో పడేస్తే జగనన్న విజయవాడ నడిబొడ్డున నిలువెత్తు ఆత్మగౌరవంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతా ఎస్సీలపై అరాచకాలు చేస్తున్నా పవన్‌కళ్యాణ్ నోరు మెదపడం లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి భయపడాల్సిన అవసరం లేదు, మనం బానిసత్వ సంకెళ్ళకు భయపడకుండా జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం. రాజ్యాధికారంలో భాగమవుదాం. తానేటి వనిత, మాజీ హోం మంత్రి. – జగనన్న తన క్యాబినెట్‌లో దళితులకు ఉన్నత స్ధానం కల్పించారు, మనకు ఇచ్చిన గౌరవాన్ని జీర్ణించుకోలేక కూటమి పార్టీలు మనపై అసత్య ప్రచారం చేశాయి. మన పార్టీని మనం బలోపేతం చేసుకుందాం, జగనన్న మన దళితులకు, మన కుటుంబాల ఉన్నతికి పాటుపడ్డారు. మనకు రాజ్యాధికారం ఇచ్చారు. హోంమంత్రి అనిత తన మూలాలు గుర్తించుకోవాలి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. మళ్ళీ జగనన్నను సీఎం చేసుకునే బాధ్యత మన అందరిపై ఉంది. గొల్ల బాబూరావు: రాజ్యసభ సభ్యుడు (ఎంపీ). – నాకు జగనన్న ఇచ్చిన ఎంపీ పదవి నాది కాదు, మా దళిత సోదరులందరిది. మాలలు, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారు, కానీ మనమంతా కలిసి పేదల ప్రభుత్వమైన జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి. రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం అవ్వాలంటే జగనన్న మరోసారి సీఎం కావాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పేదల ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకునేందుకు మనమంతా కార్యోన్ముఖులమవుదాం. ఆదిమూలపు సురేష్: మాజీ మంత్రి. – జగనన్న 24 క్యారెట్ గోల్డ్, జగనన్న ఆలోచనా విధానం గొప్పగా ఉంటుంది. దళితుల ఆత్మగౌరవం బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటుచేసి మనందరి గౌరవాన్ని నిలబెట్టారు. అణగారిన వర్గాలకు సంక్షేమం అందాలంటే జగనన్న మరోసారి సీఎం అవ్వాలి, మన బ్రాండ్ జగనన్న, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్న జగనన్నను మనం నా జగన్ అని సొంతం చేసుకుందాం. మనం మన పార్టీని బలోపేతం చేసుకుందాం. విద్యా, వైద్యం అనేవి బడుగు బలహీనవర్గాల గడప వద్దకు తీసుకొచ్చింది మన జగనన్న. రాబోయే రోజుల్లో మనం అహర్నిశలు శ్రమించి మళ్ళీ అధికారంలోకి వద్దాం. మేరుగ నాగార్జున: మాజీ మంత్రి. – రాబోయే రోజుల్లో మనం జగనన్నను సీఎంగా చేసుకునేందుకు మనమంతా ఒక్కటవుదాం, మన ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ మరిచిపోరు. రాష్ట్రంలో దళిత సోదరులపై జరుగుతున్న దాడులు, అరాచకాలు ఒకటా రెండా అనేకం, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోటా ఇవే ఘటనలు. రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొచ్చింది మన జగనన్న ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో దళితులపై దేశంలోనే అత్యధికంగా దాడులు జరిగాయని ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని బెదిరిస్తూ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ గారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని భావితరాలకు దిక్సూచిలా ఏర్పాటుచేశారు. కానీ ఈ రోజు చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని మరుగునపరిచి, పీపీపీ పద్దతిలో ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని మనం ఎదుర్కుందాం. మనం వీర సైనికుల్లా పనిచేసి దానిని కాపాడుదాం, ఆరునూరైనా అంబేద్కర్ విగ్రహం జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలారి వెంకట్రావు, కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో విజయవాడ స్వరాజ్ మైదనంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తీరు, దానిని కూటమి ప్రభుత్వం మరుగునపరిచే ప్రయత్నాలపై మాజీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, కైలే అనిల్, అలజంగి జోగారావు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ సంస్ధాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్దతులపై మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌కుమార్ ప్రసంగించారు. గ్రామస్ధాయి నుంచి రాష్ట్రస్ధాయి వరకు సంస్ధాగత నిర్మాణంపై పెట్టాల్సిన దృష్టిపై క్లుప్తంగా వివరించారు. దళితుల సాధికారతకు వైయస్ జగన్ హయాంలో చేపట్టిన రాజకీయ సంస్కరణలపై ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ మంత్రి తానేటి వనిత ప్రసంగించారు. అలాగే ఆర్ధిక సంస్కరణలపై ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ఎం. జగన్ మోహన్ రావు మాట్లాడారు. సామాజిక సంస్కరణలపై మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున ప్రసంగించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా, రాబోవు రోజుల్లో వాటి కార్యాచరణపై ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు మాట్లాడిన అనంతరం, వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు.