విజయవాడ: జగ్గయ్యపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు సారూప్య, వరుడు యశ్వంత్ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)లకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.