న్యూఢిల్లీ: దొంగ ఓట్ల నమోదులో చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ దొంగ ఓట్లను ఎలా నమోదు చేయిస్తుంది, గతంలో సేవామిత్ర, ప్రస్తుతం మై టీడీపీ ద్వారా ప్రజల నుంచి ఏ విధమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందనే అంశాలపై సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు వివరించామని, వైయస్‌ఆర్ సీపీ విజ్ఞప్తిపై ఈసీ సానుకూలంగా స్పందించిందని, అన్నింటిపై పూర్తిగా విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసింది. ఈ మేరకు చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంపై సాక్ష్యాధారాలతో సహా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీతో సమావేశం అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎలాంటి వాడంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో దంటే’ అనే సామెతకు అసలు సిసలైన అర్థం చంద్రబాబు. వెన్నుపోటు పొడుస్తాడు.. తరువాత తానే ఎన్టీఆర్ ఫొటోకు పూలమాల వేస్తాడు. ఎవరైతే ఎన్టీఆర్‌ను బాగా చూసుకున్నారో వారిని వదిలేసి 100 రూపాయల కాయిన్ రిలీజ్‌కు చంద్రబాబు ఢిల్లీకి రావడం ఆశ్చర్యం. డూబ్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు తొలగించాలి.. ఫొటో సిమిలర్ ఎంట్రీ రిమూవ్ చేయాలని, ట్రాన్స్‌పరెంట్‌గా నిజమైన ఓటర్ల జాబితా తయారు చేయాలనే సిద్ధాంతాన్ని వైయస్‌ఆర్ సీపీ నమ్మింది. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఒకే ప్రాంతంలో ఉండాలని వైయస్‌ఆర్ సీపీ కోరుకుంటుంది.. ఆచరణలో కూడా పెడుతుంది. చంద్రబాబు హయాంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకల గురించి సాక్ష్యాధారాలతో సహా ఈసీకి వివరించాం. ట్యాబ్‌లర్ ఫాంలో 2015, 2016, 2017లో ఎన్ని దొంగ ఓట్లు నమోదయ్యాయి.. వైయస్‌ఆర్ సీపీ సానుభూతి పరుల ఓట్లను ఎన్ని తొలగించారో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. ఆరోజున 2019లో ఎన్నికలకు ముందు 3.98 కోట్ల ఓట్లు ఉంటే ఈరోజుకీ 3.97 లక్షల ఓట్లు ఉన్నాయి. ఎలక్టోరల్ రోల్స్‌లో వైయస్‌ఆర్ సీపీ ఏ రోజూ జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు దొంగ ఓట్లను నమోదు చేయించి.. వైయస్‌ఆర్ సీపీ ఓట్లను డిలీట్ చేయించాడు. మేము అలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదని సాక్ష్యాధారాలతో ఎన్నికల కమిషన్‌కు వివరించాం. 63 నియోజకవర్గాలకు 20 నియోజకవర్గాల్లో 15,800 దొంగ ఓట్లు ఉన్నాయి. 43 నియోజకవర్గాల్లో ఇంచుమించుగా 5,800 నుంచి 6 వేల దొంగ ఓట్లు ఉన్నాయని నియోజకవర్గాల వారీగా ట్యాబ్‌లర్ ఫాంలో ఎన్నికల కమిషన్‌కు విన్నవించాం. చంద్రబాబు ఏరకంగా 2019లో బోగస్ ఓట్లు ఎన్‌రోల్ చేశాడో.. ఈ రోజుకీ అవే కొనసాగుతున్నాయి కానీ, మా హయాంలో ఏమీ చేయలేదు.. వాటిని డిలీట్ చేయండి అని కోరాం. ఆధార్‌కు ఓటు లింక్ చేస్తున్నారు.. 63 నియోజకవర్గాల్లో తాను క్రియేట్ చేసిన బోగస్ ఓట్లు డిలీట్ అవుతాయనే బాధతో ఈసీకి చంద్రబాబు బోగస్ కంప్లయింట్ ఇచ్చాడు. ఒకే వ్యక్తి పేరు మీద స్పెల్లింగ్‌లు మార్చి, వయసు మార్చి, భర్త, తండ్రి పేరు మార్చి ప్రయోగాలు చేసి దొంగ ఓట్లు నమోదు చేసిన ఘనత ఒలంపిక్ హీరో చంద్రబాబుకే దక్కుతుంది. వీటిపై సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఇంటి నంబర్ విషయానికి వస్తే.. ఎన్నికల కమిషన్ రూల్స్‌ను దుర్వినియోగం చేశాడు. ఇంటి నంబర్‌కు ఉపయోగించే ఆల్ఫాబెట్ ఆర్డర్‌ను కూడా మ్యానిపులేట్ చేశాడని ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో సహా వివరించాం. సేవా మిత్ర, మై టీడీపీ అనే పేరుతో ఎలాంటి సమాచారం సేకరిస్తున్నాడో ఎన్నికల కమిషన్‌కు వివరించాం. చాలా అభ్యంతరకరమైన విషయాలను ప్రజల నుంచి సేకరిస్తున్నారు. ఓటర్ ప్రొఫైలింగ్ అనేది చాలా నేరం. అశోక్ దాకవరం అనే వ్యక్తి గతంలో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో సాక్షాలతో ఈసీకి వివరించాం. ఓటర్ పొలిటికల్ ప్రిపరెన్స్‌తో చంద్రబాబుకు సంబంధం ఏంటీ..? పార్టీ ఛాయిస్ వీరికి ఎందుకు..? చంద్రబాబు క్యాస్టిస్టు అనే దానికి నిదర్శనం.. సేవా మిత్ర, మై టీడీపీలో ఓటర్ క్యాస్ట్ అడుగుతున్నారు. సభ్యసమాజంలో నివసించే ఏ వ్యక్తి అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా ఓటర్ క్యాస్ట్ అడుగుతారా అని ప్రశ్నిస్తున్నాను. దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానంగా రెండు డిమాండ్లు.. ఎలక్టోరల్ ఫొటో ఐడీ కార్డు అనేది ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. చంద్రబాబు దురాలోచనలు ఏవైతే ఉన్నాయో.. ఎన్ని దొంగ ఓట్లు నమోదు చేశాడో.. ఆధార్‌తో ప్రతి ఓటర్‌ను లింక్ చేసినట్టయితే డూబ్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు తొలగిపోతాయనేది మా ప్రధాన డిమాండ్. ఆధార్‌లో బయోమెట్రిక్ లింకేజీ ఉంటుంది. వన్ సిటీజన్–వన్ ఓటు అనేది మా పార్టీ సిద్ధాంతం. ఒక్కసారి ఆధార్‌కార్డుకు లింక్ చేస్తే.. 18 సంవత్సరాలు పూర్తికాగానే ఆటోమెటిక్‌గా ఓటర్ అవుతాడు. ఎవరైనా ఓటర్ మరణించిన తరువాతే ఆధార్ కార్డు ఇన్‌వాలీడ్ అవుతుంది. దీంతో ఓటర్ లిస్ట్‌నుంచి తొలగించడం జరుగుతుంది. అడ్రస్ మారిస్తే మార్చబడిన చోట ఓటర్‌గా కొనసాగవచ్చు. ఎన్నికల కమిషన్‌కు మేము ఇచ్చిన డేటా అంతా ఆర్టీఐ కింద, ఏపీ సీఈవో ఫైల్ చేసి ఈ–మెయిల్ ద్వారా, రాతపూర్వకంగా వారి ఇచ్చిన సమాధానాలు అన్నింటినీ ఎన్నికల కమిషన్‌కు అందజేశాం. దొంగ ఓట్ల నమోదులో చంద్రబాబే వరల్డ్ ఛాంపియన్. 2014–19 వరకు దొంగ ఓట్ల నమోదు చంద్రబాబు చేశారు. 2018లోనే ఎన్నికల కమిషన్‌కు దీనిపై మా పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదులో బాబు చేసిన దొంగ పనులన్నీ వివరంగా చెప్పాం. ఆరోజున కొన్ని పరిశీలన చేసి నిజమైన ఓటర్లను చేర్చారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి. 2014 నుంచి ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై విచారణ చేపించాలి` అని డిమాండ్ చేశారు.