తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన ప్రయోజనం కోసమే పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటెలెక్చువల్స్ వింగ్ ఏర్పాటు చేశారని,ప్రజల్లోకి పార్టీ భావజాలాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు వై ఈశ్వర ప్రసాద్ రెడ్డి, అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ ఇంటెలెక్చువల్ పోరం విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు నివాళులర్పించిన నేతలు. ఈ సందర్బంగా పలువురు నాయకులు ఏమన్నారంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్ఆర్‌సీపీ ఇంటెలెక్చువల్ వింగ్ ను పార్టీ విస్తృతమైన ప్రయోజనం కోసం పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది వివిధ రంగాల నుంచి వచ్చిన వారితో నూతనంగా ఏర్పాటైన విభాగం. ఇంటెలెక్చువల్ వింగ్ ప్రతినిధులంతా వైయస్ఆర్‌సీపీ భావజాలాన్ని అర్ధం చేసుకోవడంతో పాటు, నిరంతరం ప్రజల్లో ఉంటూ మీకున్న ఆలోచనలతో వారికి అవగాహన కలిగించాలి. ప్రజల్లోకి పార్టీ భావజాలాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ విభాగం పనితీరుకు పరిమితి లేదు. మన అవగాహనను విస్తృతంగా పెంచుకుని వాటిని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రక్రియ నిరంతరంగా జరగాలి. గతంలో వ్యక్తులగా చేసిన పనిని ఆర్గనైజ్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని అంతిమంగా పార్టీకి ఉపయోగకరంగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో పాటు, విలువలకు కట్టుబడి ఉండడం అన్నది ముఖ్యం. అలాంటి నాయకుడిగా వైయస్.జగన్ మోహన్ రెడ్డి కనిపిస్తారు. రాజకీయాలు, రాజకీయ పార్టీలు ప్రజలకోసమే ఉండాలని బలంగా నమ్మిని వ్యక్తి మన పార్టీ నాయకుడు. సమాజంలో అన్నివర్గాలకు సమాన అవకాశాలు అవసరమూ.. ఆ దిశగా వైయస్ఆర్‌సీపీ చేస్తున్న ప్రయత్నాలు మంచివి అనే స్పృహ వివిధ వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న సదుద్దేశంతో చేశాం కాబట్టి ఏకంగా దాదాపు రూ. 2.70 లక్షల కోట్లుకు పైగా నేరుగా డీబీటీ ద్వారా జమ చేశాం. మనం ఇంత చేస్తున్నా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫేక్ ప్రచారాన్ని నమ్మి దానిపైనే దృష్టి పెట్టాడు. మన ప్రభుత్వం హయాంలో సాచ్యురేషన్ విధానంలో చేసిన అభివృద్ధికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చిన మెడికల్ కాలేజీలు, పోర్టులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన పోర్టులు ఎన్ని పెరిగాయో అందరికీ తెలుసు.వీటిపై మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇపుడు ఎక్కడ చూసినా బెల్టు షాపులే మరలా కనిపిస్తున్నాయి. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. కోవిడ్ మహమ్మూరి సమయంలో దేశంలోనే అత్యున్నతమైన వైద్య సేవలు అందించాం. విపత్తు సమయంలో ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ఎంతలా అండగా ఉందో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపించింది. వైయస్ఆర్‌సీపీ మరలా అధికారంలోకి వచ్చి ఉంటే దేశంలోనే అత్యుత్తమమైన వైద్యం, విద్య అందించే రాష్ట్రంగా నిలబడి ఉండేది. వీటన్నింటిని అవగాహన చేసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకునిపోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ సరైన విధానంలో పార్టీకి ఉపయోగపడేట్టు ప్రచారం చేయాలి. సోషల్ మీడియాలో కూడా ప్రజలకు అవగాహన కలుగజేయాలి.అధికార పార్టీలో వందలాది ఫేక్ అకౌంట్లు సృష్టించి..... ప్రచారం చేశారు. దీన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలి. మీ పాత్ర పార్టీకి కచ్చితంగా స్పష్టంగా ఉపయోగపడుతుంది. ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన మంచి పనులను ప్రజలకు చెప్పడంతో పాటు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలు, కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు వివరించాలి.ఇది ఇంటెలెక్చువల్ ఫోరమ్ బాధ్యత. పార్టీ అధ్యక్షుడు మన మీద నమ్మకంతో ఉంచిన ఈ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. గత ఎన్నికల్లో మన పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దివంగత వైయస్ఆర్ మన మధ్య దూరమైన ప్రజలు ఆయన్ను తలచుకుని నేటికీ కన్నీరు పెట్టుకుంటారు. అదే బాటలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వెనక్కితగ్గని మనిషి. ఎన్నికల మేనిఫెస్టోలో ఏది చేయగలమో అదే చెబుదామని స్పష్టంగా చెప్పారు. అందుకే చంద్రబాబులా అబద్దపుహామీలు ఇవ్వలేదు. వీటిని ఆయా వర్గాల ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్లాలి. ఇంటెలెక్చువల్ కమిటీ అసెంబ్లీ, మండల స్ధాయి నియమకాలను త్వరలోనే పూర్తి చేస్తాం. ఆ తర్వాత పంచాయితీ స్ధాయిలో కూడా కమిటీల నియామకాలను పూర్తి చేస్తాం. రానున్న మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.