పోప్ ఫ్రాన్సిస్ మరణం బాధాకరం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి: క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్ మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఎక్స్ వేదిక‌గా పోప్‌ మృతి పట్ల వైయ‌స్ జ‌గ‌న్‌ సంతాపం వ్యక్తం చేశారు.  

ఎక్స్ వేదికగా వైయ‌స్ జ‌గ‌న్‌..
కాథలిక్ చర్చిలో పరివర్తన కలిగించే మరియు ప్రభావవంతమైన అధిపతి - లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరుణ, వినయం ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. చిన్నప్పటి నుంచీ, ఆయన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసేందుకు కృషి చేశారు. పేదలు, అణగారిన వర్గాలకు సేవ చేశారు. ఆయన అకాల మ‌ర‌ణం బాధాక‌రం. ఆయ‌న‌ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరుగాక అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

Back to Top