యేసు ప్రభు ఆశీస్సులు ప్ర‌జ‌లంద‌రిపై ఉండాలి 

ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్ 

తాడేపల్లి:  ప్ర‌జ‌లంద‌రిపై యేసు ప్ర‌భు ఆశీస్సులు ఉండాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రార్థించారు. ఈస్టర్‌ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయ‌న‌ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్ర‌జ‌లంద‌రికీ ఈస్ట‌ర్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని వైయ‌స్ జ‌గ‌న్‌ ఆకాంక్షిచారు. 

Back to Top