అసెంబ్లీ: లోకేష్‌కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. మహిళల భద్రతపై చర్చిస్తుంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ చేస్తుందని, మహిళల పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. దిశ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించాయని, కాల్‌మనీ సెక్స్ రాకెట్, లోకేష్ ఫోటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎక్కడ మాట్లాడుతారో అన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. మహిళా భద్రత అంశంపై ఆమె మాట్లాడారు. మహిళా భద్రత అంశంపై ఈ రోజు చర్చించడానికి అవకాశం ఇచ్చినందుకు సీఎం వైయస్ జగన్‌కు , స్పీకర్‌కు ధన్యవాదాలు. ఈ రోజు మహిళలందరూ కూడా దిశ సంఘటనతో తల్లడిల్లిపో్యారు. వారి భద్రత గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మొదటిసారి మహిళా భద్రతపై చర్చ జరుగుతుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ముందుగా సీఎంకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో దిశను రేప్ చేసి, కాల్చేశారంటే..మానవత్వం ఉన్న ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు వైయస్ జగన్‌పై నమ్మకం ఉంది. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ తమ గోడును వినిపించాలని ఉన్నారు. వాళ్లలో ఉన్న భయం, ఆక్రోశం సొంత అన్న లాంటి వైయస్ జగన్‌కు వినిపించాలని ఉన్నారు. ఈ రోజు టీడీపీ సభ్యుల గొడవ చూస్తే ఎక్కడ కాల్‌మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడుతారో..ఎక్కడ లోకేష్ ఫోటోల గురించి మాట్లాడుతారో..ఎక్కడ బాలకృష్ణ అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలి, కమిట్ కావాలన్న అంశం గురించి మాట్లాడుతారో అన్న భయం టీడీపీ నేతల్లో ఉంది. ఈ రోజు మహిళల భద్రత కోసం ఒక ఎస్సీ మహిళను హోం మంత్రిని చేసిన ఘనత వైయస్ జగన్‌కు దక్కింది. ఆ భద్రత గురించి హోం మంత్రి మాట్లాడుతుంటే..ఉల్లిపాయల గురించి మాట్లాడుతున్నారు. వీళ్లు మహిళలను చులకన చేసే విధంగా పరిపాలన చేశారు. అందుకే వీళ్లను ఆ మూలన కూర్చోబెట్టారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ తినే పప్పులో ఉల్లిపాయ లేదని బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల మానప్రాణాల భద్రత అన్న విషయంపై చంద్రబాబుకు బాధ లేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయనకు తెలియదు. 13 సంవత్సరాలు సీఎంగా చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఆడబిడ్డల భద్రత గురించి తెలియదా?. మహిళల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని ఇవాళ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఉల్లిపాయల గురించి కూడా చర్చించేందుకు సమయం కేటాయిస్తామని సీఎం చెప్పారు. గతంలో చంద్రబాబు అన్నారు కదా..కోడలు మగబిడ్డను కంటే అత్త సంతోషించదా అని ఆడవారి పుట్టుకనే విభేదించిన చంద్రబాబు ..ఇవాళ ఆడవాళ్ల భద్రత గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. దిశ సంఘటన తరువాత ఆడవాళ్లు కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అంతకుముందు రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ, స్వప్నిక, ప్రతిణ, రేపు ఎవరు అని ఆడవాళ్లు భయపడుతున్నారు. దిశను అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష వెంటనే పడాలని దేశంలోని అందరూ కోరారు. నడిరోడ్డుపై శిక్షించాలని మాట్లాడారు. ఆ నలుగురిని ఎన్‌కౌంటర్ చేస్తే మహిళలు సంబరాలు చేసుకున్నారు. మహిళలను ఆడవిలో వదిలేస్తే క్షేమంగా ఇంటికి వస్తుందన్న నమ్మకం ఉంది కానీ, అదే సమాజంలో వదిలేస్తే వస్తుందా? రాదా అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆడపిల్లల పరిస్థితి దిగజారిపోయింది. ఎక్కడికి వెళ్లినా అత్యాచారాలు, వెక్కిరింపులు, వేధింపులు, తాగుబోతుల వేధింపులు ఇలా ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు. దిశను అత్యాచారం చేసి దుర్మార్గంగా హతమార్చారు. ఇదే విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో 250 మందికి పైగా మహిళలను వ్యభిచారంలోకి దించారు. ప్రసవ వేదన అనుభవించి, నవమాసాలు కష్టపడి బిడ్డకు జన్మనిస్తే..అలాంటి ఆడవాళ్లను చంపుతున్నారు. అలాంటి సంఘటనపై వీళ్లు మనసాక్షి లేదా? వీళ్లు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు. ఆడవాళ్లు ఎందుకు ఇన్ని హింసలు భరిస్తున్నారంటే..చదువు కోసం, బతుకుదెరువు కోసం మాత్రమే. వాళ్లు తిరగబడితే ఏమవుతుందో చూస్తున్నాం. ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే ..బహుబలి సినిమాలో సేనాధిపతి భార్య భుజంపై మరో సేనాధిపతి చేయి వేసి వెకిలి చేష్టలు చేస్తే..ఆ హీరో కామాంధుడి తల తెగనరికాడు. ఆ రోజు థియేటర్‌లో చూశాను..ఆడవాళ్ల కళ్లలో ఆనందం చూశాను. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఈ రోజు దిశను హత్య చేసిన వారు ఎన్‌కౌంటర్ అయ్యారు. నిర్భయను హత్య చేసిన వాళ్లు జైల్‌లో ఉన్నారు. రిషితేశ్వరిని హత్య చేసిన వారికి ఇంతవరకు ఎలాంటి శిక్ష పడలేదు. అదే స్వప్నిక, ప్రణితలపై యాసిడ్ దాడి చేసిన వారిని దివంగత మహానేత వైయస్‌ఆర్ హయాంలో శిక్షించారు. ఇవన్నీ కూడా మీడియాలో హైలెట్ అయ్యాయి. మీడియాకు దొరక్కుండా చనిపోయిన ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. మీడియాలో కనిపించకపోతే మానం, ప్రాణం కాదా? ఆడపిల్లలకు కష్టం వస్తే..గన్ వచ్చే లోపే సీఎం వైయస్ జగన్ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం కావాలి. ఆడపిల్లలు కన్నీరు కార్చితే..ఆ కన్నీరు అవిరి అయిపోయే లోగా నిందితులకు శిక్ష విధిస్తారన్న నమ్మకం కలగాలి. నమ్మకాన్ని ఈ అసెంబ్లీ సాక్షిగా ఇవ్వాలి. మహిళలు బతికి బట్టకట్టాలంటే సత్వర న్యాయం కావాలి. కోర్టులు, చట్టాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. అవి వేగంగా పని చేయాలి. ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలపై వెంటనే శిక్షించాలి. Read Also: దోపిడీని బయటపెట్టకూడదా..?