స్వర్గీయ శ్రీ డా. వైయస్ రాజశేఖర రెడ్డి గారు

Designation: 
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
Location: 
పులివెందుల

చెదిరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు... ఆ పాదం అడుగిడిన నేలంతా అయ్యింది సస్యశ్యామలం.. వ్యవసాయం దండగంటూ కొంతమంది బాబులు ఈసడించినా, దానిని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించారు. ఆయన జీవితం ఎందరో నాయకులకు పాఠ్యపుస్తకం. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపగా మడమతిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహస్వప్నం అయ్యింది. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 

Back to Top