ఆంధ్రప్రదేశ్ మొత్తం సిద్ధం!  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: 2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ్ఞప్తి చేశారు.  ఈ మేర‌కు శ‌నివారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)ఖాతాలో ట్వీట్ చేశారు.

ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కాదు. రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపుని నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు వైయ‌స్ జగన్‌కి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మన  వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా వైయ‌స్ జ‌గ‌న్ కోరారు.  

అంద‌రూ సిద్ధం అవ్వండి! 
మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేందుకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సిద్ధం కావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ సిద్ధం అవ్వండి. ఈ యుద్ధంలో మీరు వేయబోయే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతోంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. 

ముస్లిం సోదరసోదరీమణులందరూ ఆలోచించండి!
ముస్లింలకి 4 శాతం రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే. ఇదీ మీ వైయ‌స్ జగన్ మాట.. ఇదీ వైయస్ఆర్‌ బిడ్డ మాట. మరి మోడీ  సమక్షంలో చంద్రబాబుకి ఈ మాట చెప్పే ధైర్యముందా? అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల‌ను అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాలి
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసినా అతని పేరు చెబితే ఏ పేదవాడికైనా కనీసం ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. వచ్చాక మోసాలు చేయడం చంద్రబాబు నైజం. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని చంద్రబాబు మోసం చేశాడు. వచ్చే ఎన్నికల్లో మన  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరారు.

జాగ్రత్త!
సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఓటు వేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభ్య‌ర్థించారు.

మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి! 
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచి చేశాం, ప్రతి వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ధైర్యంగా అడుగుతున్నా.. మీ బిడ్డ జగన్‌ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు.

Back to Top