తాడేపల్లి: సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ కందుకూరి జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో వీరేశలింగం పంతులుకు ఘనంగా నివాళులర్పిస్తూ పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆశయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకం. నేడు కందుకూరి వీరేశలింగం పంతులుగారి జయంతి సందర్భంగా నివాళులు.