తాడేపల్లి: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. పలు నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు సమన్వయకర్తలను(ఇన్‌ఛార్జిలను) మారుస్తోంది అధికార వైయస్ఆర్‌సీపీ. తాజాగా బుధవారం రాత్రి ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను వైయస్ఆర్‌సీపీ విడుదల చేసింది. ఒంగోలు పార్లమెంటరీ స్థానం ఇన్‌ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు.. గుంటూరు ఎంపీ ఇన్‌ఛార్జిగా ప్రమోషన్ దక్కింది. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైయస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. 8వ జాబితా ఇలా..