అమరావతి: చంద్రబాబు అమరావతికి ఎందుకు వెళ్లారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్ఏ రోజా ప్రశ్నించారు. బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వెళ్లారా అని ఆమె నిలదీశారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా అన్నారు. అడుగుకు రూ.10 వేలు దోపిడీ చేశారని విమర్శించారు. రాజధాని పేరుతో ఎల్లోమీడియాలో గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. Read Also: మోసం చేసినందుకే చెప్పులేసి తరిమికొట్టబోయారు