నేడు తిరుమ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న సీఎం

తాడేప‌ల్లి: క‌లియుగ దైవం తిరుమ‌ల‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు తిరుమ‌ల‌కు వెళ్ల‌నున్నారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నేడు, రేపు తిరుమ‌ల ప‌ర్య‌ట‌న అనంత‌రం నంద్యాల జిల్లాలో సీఎం ప‌ర్య‌టిస్తారు. 

నేడు సీఎం ప‌ర్య‌ట‌న‌ వివ‌రాలు....
మ‌ధ్యాహ్నం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. అక్క‌డి నుంచి రేణిగుంట విమానాశ్ర‌యానికి బ‌య‌ల్దేర‌తారు. 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్‌ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు. 

28న‌ సీఎం ప‌ర్య‌ట‌న‌ వివ‌రాలు....
ఉదయం 6.05 గంటలకు తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామివారిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ద‌ర్శించుకుంటారు. అనంత‌రం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభిస్తారు. 7.10 గంటలకు టీటీడీ కోసం వైయ‌స్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్‌ రెస్ట్‌ హౌస్‌ను ప్రారంభిస్తారు. 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఓర్వకల్‌ బయలుదేరుతారు. 10.55 గంటలకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల చేరుకుని రామ్‌కో సిమెంట్స్‌ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.05 గంటలకు ఓర్వకల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top