సంస్కరణలతో ఆదాయం వృద్ధి

వైయ‌స్‌ జగన్‌ ఆదేశాలతో అధి­కా­రులు వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా స్నేహపూ­ర్వక శాఖగా మార్పు

రిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే సంవత్సరం 10కిపైగా కీలక సంస్కరణలు

అందుబాటులో ఆటోమేటెడ్‌ చెక్‌ ఆఫ్‌ వెహికల్‌ ట్రాఫిక్‌ వ్యవస్థ 

అమరావతి: వాణిజ్యపన్నుల శాఖలో ప్రభు­త్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఆ శాఖ ఆదా­యం భారీగా పెరిగింది. 2022–23లో జీఎస్టీ ఆదా­యం 20.13% వృద్ధితో ఏకంగా రూ.28,092.87 కోట్లు నమోదవడం విశేషం. గతంలో వాణిజ్యప­న్నుల శాఖ అధికారులు అంటే వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎప్పుడు తనిఖీలు చేస్తారో.. ఎలాంటి జరిమానాలు విధిస్తారో.. అన్న భయం ఉండేది. కానీ సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశాలతో అధి­కా­రులు వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా స్నేహపూ­ర్వక శాఖగా మార్చారు. గత ఏడాది కాలంగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు.

అవకతవకలకు పాల్ప­డకుండా పన్నులు చెల్లించే వ్యాపారులకు రక్షణ కల్పిస్తూ.. అదే సమయంలో పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో తనిఖీల భయం లేకుండా నిజమైన వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ సంస్కరణలతో రాష్ట్రంలో పన్ను ఎగవే­తలకు అడ్డుకట్టపడింది. గతేడాది (2022–23)లో ఈ సంస్కరణల ద్వారా అదనంగా రూ.1,745 కోట్ల ఆదాయం సమకూరినట్లు రాష్ట్ర పన్నుల ప్రధాన అధికారి గిరిజాశంకర్  తెలిపారు. రాష్ట్ర వాణి­జ్యపన్నుల శాఖ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే సంవత్సరం 10కిపైగా కీలక సంస్కరణలతో పూర్తిస్థాయి ప్రక్షాళన చేశామన్నారు.

పన్ను చెల్లించని వ్యాపారులను గుర్తించి వారితో పన్ను కట్టించడం ద్వారా రూ.263.9 కోట్ల ఆదాయం వచ్చిందని తెలి­పారు. ఆటోమేటిక్‌ రిటర్న్‌ స్క్రూట్నీ ద్వారా రూ.132.91 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పా­రు. ఆడిటింగ్‌ ద్వారా రూ.38.79 కోట్లు, తనిఖీల ద్వారా రూ.64.29 కోట్లు, వ్యాట్‌ బకాయిలను వసూ­లు చేయడం ద్వారా రూ.235.13 కోట్లు వచ్చా­యన్నారు. 2021–22తో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ ఆదా­­యం (పరిహారం లేకుండా) 2022–­23లో 20.13% వృద్ధితో రూ. 28,092.87 కోట్లుగా నమో­దైం­దని తెలిపారు. పరిహారంతో కలిపి చూస్తే మొత్తం జీఎస్టీ ఆదాయం రూ.33,511.33 కోట్లని చెప్పారు. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక సంస్కరణలివే..
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అధికారుల ప్రమే­యం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాహనా­లను తనిఖీచేసే ఆటోమేటెడ్‌ చెక్‌ ఆఫ్‌ వెహికల్‌ ట్రాఫిక్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానంలో ఏ అధికారి వాహనాలను చెకింగ్‌ చేస్తారన్న విషయాన్ని 24 గంటలు ముందుగానే ఎస్‌ఎంఎస్‌ విధానంలో తెలియజేస్తారు. రిటర్నుల స్క్రూట్నీలో కూడా అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్‌ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్‌ స్క్రూట్నీ ఆటోమేటెడ్‌ టూల్‌ను అందుబాటులోకి తెచ్చారు.

జీఎస్టీ పోర్టల్‌లోని డేటా, ఎనలిటికల్‌ నివే­దికల ఆధారంగా స్క్రూట్నీ కోసం రిటర్నులను ఎంపిక చేస్తారు. అలాగే ఎనలిటిక్‌ రిపోర్టులను ఎప్పటి­కప్పుడు తెలిపేలా డ్యాష్‌బోర్డు, కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేలా లీగల్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, సెంట్రల్‌ రిజిస్ట్రేషన్‌ యూనిట్, ఈ–జర్నల్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రీకృత డేటా ఎనలిటికల్‌ సెంటర్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. తద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి నేరుగా వారివద్దే తనిఖీలు చేస్తున్నారు.

Back to Top