

















అధికార పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రకటన
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం, పిన్నెల్లికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
మా పార్టీ నాయకులు, సానుభూతిపరులకు అండగా ఉంటాం
పిన్నెల్లిలో అరాచకాలను మా నాయకులు జగన్‌గారికి చెప్పారు
అందుకు కక్ష కట్టి, తెలంగాణలో ఉంటున్న వారిని అరెస్టు చేశారు
కాసు మహేష్‌రెడ్డి వెల్లడి
నర్సారావుపేట: గురజాల నియోజకవర్గం పిన్నెల్లి వైయస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి తెలంగాణలో అరెస్ట్ చేసి తీసుకురావడంపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులు, అధికార పార్టీ నేతల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. ప్రభుత్వం, పోలీసుల తీరును ఎండగట్టారు.
వీడియోలో కాసు మహేష్‌రెడ్డి ఏమన్నారంటే..:
ఇక్కడ ఉండకున్నా అక్రమ అరెస్ట్‌లు:
తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇంఛార్జ్ ఎంపీపీ కుమారుడు షేక్ సైదా, పిడుగురాళ్ళ మండలం అగ్రహారంకు చెందిన అల్లా బ„Š ను ఈ రోజు ఉదయం అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలిసింది. పిన్నెల్లిలో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను ఇదే సైదా, మరికొంతమంది పెద్దలు వారం, పది రోజుల క్రితం జగన్‌గారి దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 400, 500 కుటుంబాల వారు గడిచిన 9 నెలలుగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామం విడిచి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, దమనకాండను జగన్ గారి దృష్టికి తీసుకువెళ్ళారన్న కుట్రతో ఒక దొంగ కేసు రిజిస్టర్ చేశారు.
ప్రైవేట్ కేసులు వేస్తాం:
అలా ఎక్కడో తెలంగాణలో చిన్న వ్యాపారం చేసుకుంటున్న వారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్న పోలీసులపై కూడా ప్రేవేట్ కేసులు వేస్తాం. పోలీసులు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కుంటామని కాసు మహేష్‌రెడ్డి వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితం..
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. దాదాపు 400 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేసిన విషయాన్ని వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కుటుంబాలన్నీ మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందినవే.
వచ్చే రెండు నెలల్లో ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి సిద్దమవుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గ్రామ బహిష్కరణ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన వైయస్ జగన్, వారికి అవసరమైన పూర్తి న్యాయ సహాయం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు.