బాబు - మోడీ మధ్య డీల్ ఏంటి?

మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి?

మాజీ మంత్రి పేర్ని నాని సూటి ప్రశ్నలు

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రెస్ మీట్...

కుర్చీల కోసమే జెండాల కలయిక

మోడీని తిట్టిన నోటితోనే పొగడ్తలా బాబూ..?

మోడీ కనికరం కోసం కాళ్ళబేరానికి వెళ్ళిన బాబు

పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తాజాగా ఎలా మారాయి?

అవినీతి బాబుపై విచారణ ఏమైంది మోడీ గారూ..?

బాబు పాపాలను ఏ గంగాజలంతో కడిగారు?

ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు?

ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీలా కాంగ్రెస్

తాడేప‌ల్లి:  చంద్ర‌ బాబు - న‌రేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటి?, మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి? అని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి పేర్ని నాని సూటి ప్రశ్నించారు. పగలు మోదీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు. పోలవరం ఏటీఎమ్‌లా వాడుకున్నారని మోదీ అన్నారు కదా?. చంద్రబాబు ఎలా పునీతుడు అయ్యాడో చెప్పాల‌న్నారు. చిలకలూరిపేటలో మూడు పార్టీల సభ వెలవెలబోయిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. నన్న క్షమించు మోదీ.. సీఎం వైయ‌స్ జగన్‌ నుంచి నన్ను కాపాడు మోదీ అని చంద్రబాబు వేడుకున్నారని సెటైర్లు వేశారు. ఐదేళ్ల కిందట చంద్రబాబు ఎందుకు తిట్టారు.. ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మోదీ ఉగ్రవాదిలాంటి వారు అన్న చంద్రబాబు.. ఐదేళ్లు తిరిగే సరికి విశ్వగురులా కనిపించారని ఎద్దేవా చేశారు.  ఆదివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

వారిది అవకాశవాద కూటమి

  • చిలకలూరిపేటలో జరిగిన మోడీగారి బహిరంగ సభను చూశాక, అది సంసిద్ధం సభగా కాకుండా..  వైఎస్ఆర్సీపీ ఐదవ సిద్ధం సభగా భావిస్తున్నాం.. ఆ నాలుగు సిద్ధం సభల్లో మళ్ళీ జగన్ గారే సీఎం కావాలని ప్రజలు పెద్దఎత్తున ఎలా ఆశీర్వదించారో.. ఈ మూడు పార్టీల చిలకలూరిపేట సభ చూశాక, ఆ సభలో సక్రమంగా మైకులు కూడా ఏర్పాటు చేసుకోవడం చేతగాని వీళ్ళ దీన స్థితిని చూశాక, ఈ సభ ద్వారా కూడా జగన్ గారే మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారనిపించింది. 
  • సభ జరుపుకోవడం చేతకాదు.. మైక్ ముందు సాక్షాత్తూ దేశ ప్రధాని పావుగంట బొమ్మలా నుంచునే పరిస్థితి.. సభ జరుపుకోవడం చేతకాని మీరు జగన్ గారి మీద యుద్ధం.. సంసిద్ధమా?  దేనికి సంసిద్ధం.. ప్రధాని గారిని ఆ రకంగా అవమానపరచడానికా..?
  • జగన్ గారు పాల్గొన్న నాలుగు సిద్ధం సభల్లో రాష్ట్ర ప్రజలు, వైయస్ఆర్సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్త జగన్ గారు ఎందుకు మళ్ళీ కావాలనేది తేటతెల్లం చేశారు. 
  • - సిద్ధం ఐదవ సభ ఇది ఎందుకంటే  మేము చేసేవే వచ్చే ఐదేళ్ళలో చేస్తాం అని చెబుతున్నారు .. జగన్ గారు కన్నా మేము ఎక్కువ చేయలేం.. మాకన్నా జగన్ గారు ఎక్కువ చేస్తున్నారు.. జగన్ గారు చేసేవే మేము చేస్తామని చెప్పే సిద్ధం ఐదవ సభ ఇది..
  • ఈ అవకాశవాద కూటమికి ఓటు వేస్తే రాష్ట్రానికి ఏం చేస్తారు? రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు.. అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి.

పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తాజాగా ఎలా మారాయి?
 2014లో తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మాది గొప్ప కలయిక అని పవన్ కల్యాణ్ చెప్పారు.
2019లో పాచిపోయిన లడ్డూలు ఇవాళ ఎలా తాజా లడ్డూలుగా మారాయో పవన్ కల్యాణ్ చెప్పారా? కాకినాడలో పాచిపోయిన లడ్డూలు ఎలా ఐదేళ్లలో చిలకలూరిపేట సభలో తాజాగా మారాయి.? ఎందుకు రుచిగా మారాయో చెప్పలేదు.

మోడీ కనికరం కోసం కాళ్ళబేరానికి వెళ్ళిన బాబుః

  • భారతదేశానికి దుర్మార్గ పరిపాలకుడు, ఒక నియంత, ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు నరేంద్రమోడీ అని గతంలో తిట్టిన చంద్రబాబుకు,  ఇవాళ  హఠాత్తుగా మోడీ ఎలా భారతదేశాన్ని  ఉద్దరించే నాయకుడిగా మారాడో చెప్పలేదు.
  • ఏపీ ప్రజలు మోడీ నాయకత్వానికి ఎందుకు ఓటు వేయాలో.. వారు ముగ్గురు కలిసిన అవకాశవాది కూటమికి ఎందుకు ఓటు వేయాలో చంద్రబాబు చెప్పలేదు
  • చంద్రబాబు చిలకలూరిపేట సభలో అంతా కూడా..  క్షమతత్వం.. అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ.. అన్నట్టుగా నడిచింది. అయ్యా.. మోడీ గారు నన్ను క్షమించు.. "నా నోటితో  నిన్ను భార్య లేదు, కుటుంబం లేదు, పాపాత్ముడివి, దుర్మార్గుడివి, నీవు దేశానికి అరిష్టం" అని దూషించాను.. కానీ అదే నోటితో ఇవాళ నిన్ను మోడీ అంటే అభివృద్ది, సంక్షేమం, ఆత్మగౌరవం అంటూ మాట్లాడాడు అంటే క్షమతత్వం.. అన్యధా శరణం నాస్తి ..నన్ను జగన్ గారి నుంచి కాపాడేవారు ఎవరూ లేరు.. పవన్ కల్యాణ్ ను నమ్మకుంటే కాపాడలేకపోతున్నాడు.. నువ్వు తప్పితే నన్ను జగన్ గారి నుంచి కాపాడే వారు ఎవరు లేరు.. అని మోడీ కాళ్ల మీడ పడడం తప్పితే ఈ సభలో చంద్రబాబు మాట్లాడింది ఏం లేదు..

నాడు లుచ్చా.. నేడు అచ్చానా..?
చంద్రబాబు ఏం మాట్లాడాడు.. మొన్న ఎందుకు తిట్టాడు.. ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తానని మోసం చేశాడని చెప్పిన నోటితోనే మోడీ అంటే అభివృద్ది, సంక్షేమం, ఆత్మగౌరవం అంటూ మోడీ గారి గురించి కీర్తించాడు.
చంద్రబాబు భజన మాములు భజన కాదు చిడతలు కొడుతూ.. హరిలో రంగ హరి .. మనందరం మోడీ ఆశయాలతో అనుసంధానం కావాలంటా .. ఎందుకు కావాలి చంద్రబాబు మీరే తిట్టారు కదా.. మీ బామ్మర్ధి తో తిట్టాంచారు కదా మోడీ లుచ్చా హై అని.. నేడు అచ్చా హై ఎందుకు అయ్యారు?
దొంగలు దొంగులు ఊళ్ళు పంచుకున్నట్లుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా?  మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనమో అని ముగ్గురులో ఒక్కరు కూడా చెప్పలేదు 

పిల్లనిచ్చిన మామే వెన్నుపోటుదారుడువని చెప్పలేదా?*

  •  కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మీ మామగారు నీకు ఓటేయొద్దని, నువ్వు సర్వనాశనం అయిపోవాలని నువ్వు దగాకోరు అని చెప్పారు
  • నీ తోడబుట్టిన తమ్ముడు రామ్మూర్తినాయుడు మా అన్న చంద్రబాబుకు ఓటేయొద్దని ఊరూరు తిరిగారు కదా..
  • మీ సొంత బావ హరికృష్ణ మా బావ పెద్ద దొంగ ఓటేయొద్దని సందు సందూ తిరిగారు కదా..
  • మీ తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నువ్వొక వెన్నుపోటుదారుడువి, కుట్రదారుడుని, దొంగవి  అని తిరిగారు కదా..
  • మా మరిది చంద్రబాబు ఒక మోసగాడు, దొంగ ఓటేయొద్దని మీ వదిన గారు కూడా  తిరిగారు కదా..
  • మీ మేనకోడలు భర్త నార్ని శ్రీనివాసరావు చంద్రబాబుకు ఓటేయొద్దని ఊరువాడా తిరిగారు
  •  మీ చుట్టాలందరూ నీకు ఓటేయొద్దని తిరిగారు  కదా...

రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పారా..?
 నారా చంద్రబాబు మోడీ కాళ్ళు పట్టుకుని బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని.. ఈ ఒప్పందాలు, పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు.. రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు.. ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరికోసం ఎందుకోసం..? ఈ రాష్ట్రప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండానే, రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలో చెప్పకుండానే వీళ్లు కూడబలుక్కుంటే వెంటనే మనం ఓటేసేయాలా? జగన్ గారిని ఓడించాలంట..

40 గుడులను కూల్చిన బాబును పక్కన పెట్టుకుని రాముడు, కృష్ణుడా..!* అయోధ్యలో రాముడిని స్థాపించుకున్న మోడీ గారు చిలకలూరిపేట వచ్చి.. బెజవాడలో 40 గుళ్ళను ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాలను చెత్తకుండిలో  నించోపెట్టిన అతని పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎవర్ని అవమానిస్తున్నారు? ఎవర్ని మోసం చేస్తున్నారు? మోడీ గారు.. ఏది మీ నిబద్దత.. 
* దేశంలో రాముడిని ప్రతిష్ట చేసుకున్నామని మాట్లాడుతున్నారు.. ఇక్కడ మీరు వచ్చి సావాసం, చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేది ఎవరితో? 40 దేవుడు గుళ్లను ధ్వంసం చేసిన వారితో సావాసమా? మీ నిబద్ధతను రాష్ట్రంలోని హైంధవులు ఎలా నమ్మాలి? 

అవినీతి బాబుపై విచారణ ఏమైంది మోడీ గారూ..?
 ఐదేళ్ళ క్రితం మోడీ గారు ఇదే గుంటూరు గడ్డ మీద నిలబడి ఏం మాట్లాడారు? చంద్రబాబు అవినీతిపరుడు, పచ్చి రాజకీయ దగాకోరు, అవినీతిలో కూరుకుపోయిన, మళ్లీ  మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు, మీ మేనిఫెస్టోలో అమరావతి రాజధాని రియల్ ఎస్టేట్ స్కాం.. ఆ స్కామ్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి బాధ్యులైన ప్రతిఒక్కరిని జైల్లో పెడతామని చెప్పారు.. ఏమైంది ఆ మేనిఫెస్టో.. రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాలి కదా? అమరావతి స్కాం ఏమైంది.. పోలవరం పూర్తి చేస్తామన్నారు.. వారం వారం పోలవరం కాదు అది అతనికి  ఏటీఎమ్ అని మీరే చెప్పారు. విచారణ చేస్తామన్నారు ఆ విచారణ ఏమైంది? చంద్రబాబు దోషా? నిర్దోషా?

బాబు పాపాలను ఏ గంగాజలంతో కడిగారు?
 ప్రపంచం మొత్తం గర్వంగా తిరుగుతున్నారు నేను భారతదేశ బిడ్డనని.. అలాగే ఈ రాష్ట్ర గడ్డమీద కూడా.. గుంటూరు గడ్డమీదకు వచ్చినప్పుడు ఐదేళ్ల క్రితం మీరు ఏం చెప్పారు? ఈరోజు చంద్రబాబును ఎలా పునీతుడిని చేశారు.. ఏ గంగాజలం పెట్టి అతని ఒళ్ళంతా కడిగారు..  అతని పాపాలన్నీ ఏ గంగను తెచ్చి కడిగారు.. ఇదే చంద్రబాబు మిమ్మల్ని అపహాస్యం చేశాడు.. చారెడు మట్టి..  చెంబుడు నీళ్ళు ఇచ్చిన మోడీని తీసుకొచ్చి చిడతల భజన చేస్తున్నారు.

ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు?
చిలకలూరిపేట సిద్దం 5 అంటున్నా.. ఎందుకంటే.. ఇది జగన్ గారికి అనుకూలమైన మీటింగ్.. ఇవాళ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా? ఇవ్వరా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పరా? పోలవరం ప్రస్తావన ఏది? గడిచిన మూడేళ్ళుగా పోలవరం డబ్బులు ఇవ్వండి, రైతులకు , నిర్వాసితులకు డబ్బులు ఇవ్వండని కనీసం 15వేల కోట్లైనా వేయండి.. . మీ  దగ్గరకు తిరిగి కేబినెట్ లో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెట్టడానికి ఆఖరకు మా అకౌంట్ కు వేయవద్దు...నిర్వాసితులు, రైతాంగం అకౌంట్ లో వేయండని అకౌంట్ లు ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులు వేయలేదు? మొదటి దశలో 41.5 అడుగులకు నీళ్ళు నిలబెట్టడానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు.. ఐదేళ్ళలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు.. ఎందుకు పోలవరం ప్రస్తావనే లేదు.. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంచుతారా? అమ్ముతారా?

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు 31 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైనా విశాఖ ఉక్కు ఉంచుతారా? అమ్ముతారా? ఈ సభలో ఎవరైనా అడిగారా.. 
  •  సొల్లు కబుర్లు చెప్పిన పవన్ కల్యాణ్ అయినా ఈ సభలో అడిగాడా? జగన్ గారిని తిట్టడానికి తప్పితే రాష్ట్రానికి ఇది కావాలని సభలో మోడీ గారిని సమాధానం చెప్పమని, హామీ ఇవ్వమని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా? విశాఖ ఉక్కు కార్మికుల దగ్గరకు వెళ్ళి ఎన్నో నాటకాలు వేశారుగా.. విశాఖ ఉక్కును నిలబెడతామని హామీ ఇవ్వమని ఒక్కరూ కూడా మాట్లాడలేదు.. మోడీగారు కూడా ఉంచుతారా? అమ్ముతారా అనేది సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు.. విశాఖ రైల్వే జోన్ ఏది.? కడప స్టీల్ ప్లాంట్ ఏది? 
  • నీలి విప్లవం సృష్టిస్తారంటా? పోర్టులు సృస్టిస్తారంటా.. రాష్ట్రంలో యువకుడైన ముఖ్యమంత్రి హయాంలోనే నాలుగు పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. ఇప్పటికే ఒక పోర్టును పూర్తి చేసి, మూడు పోర్టులు శరవేగంగా నిర్మాణం చేస్తుంటే సాయం అందించారా? నయాపైసా ఇచ్చారా మోడీ గారు.. ఇవ్వకపోగా మళ్లీ కొత్త మాయాప్రపంచాన్ని సృష్టిస్తున్నారు..మాయమాటలు చెబుతున్నారు.. విభజన హామీల చట్టంలోనే ఒక పోర్టు కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేయాలని ఉంటే కనీసం సాయం చేయకపోగా మళ్లీ కొత్తగా ఎండమావుల్లాంటి హామీలు మోడీగారు కురిపిస్తున్నారు.. ఉన్న పోర్టులకు, జగన్ గారు కడుతున్న పోర్టులకు సాయం చేయకపోగా మాయమాటలు చెబుతున్నారు.

ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీలా కాంగ్రెస్

  • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒక్కటే అంటే రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా? టీడీపీ కార్యకర్తలు నమ్ముతారా? బీజేపీ కార్యకర్తలు నమ్ముతారా? మోడీ గారు పక్కనున్న వారు గజదొంగలు అనే విషయం అర్థంచేసుకోవాలి మీరు. 
  •  ఏఐసీసీ అంటే ఏపీ, తెలంగాణకు వచ్చేటప్పటికీ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీ.. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి, తులసీరెడ్డి, షర్మిల ఉంటారు..  వీళ్ళందరూ చంద్రబాబు మేలు కోసం పనిచేసే శక్తులు, వ్యక్తుల అనే విషయం మోడీ గారు గమనించాలి.. చంద్రబాబును మోడీ గారు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి.. పగలు మీతో చేయి లేపుతాడు.. రాత్రి రాహుల్ గాంధీతో చేయి లేపుతాడు.. మాకు కంగారు లేదు.. ఎన్టీఆర్ గారితో అయిపోయింది మీరు కూడా సభలకు వచ్చేటప్పుడు వెనకాల జాకెట్ వేసుకోండి.. చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచాడు.. చంద్రబాబుని వెనుకరాకుండా చూసుకోండి.. పగలు మీతో.. రాత్రి రాహుల్ గాంధీతో చేతులు కలిపే చంద్రబాబులాంటి వ్యక్తిని పక్కనపెట్టుకుని వైయస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఒక్కటే అని మోడీ గారు మాట్లాడటం ఆయనకే చెల్లుతుంది.

పక్కన వెన్నుపోటుదారుడ్ని పెట్టుకుని ఎన్టీఆర్ ను కీర్తించడమా?
ఎన్టీఆర్  పేరుతో వెండి నాణెలు ముద్రించి  గౌరవించింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెబుతున్నారు.. పక్కన చంద్రబాబును సాక్షాత్తూ వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని,  అతి క్రూరంగా, నీచంగా,  హేయంగా , పదవి నుంచి దింపి, పార్టీని లాక్కుని మానసికంగా కుంగదీసి చావుకు కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఎన్టీఆర్ గారిని గౌరవిస్తున్నామంటే ఎలా నమ్మాలి.. సాక్షాత్తూ ఎన్టీఆర్ చనిపోయేముందు జామాతా దశమగ్రహం అని, నా అల్లుడిని నమ్మకండి- గజదొంగ అని ఆయన  చివరి మాటలు మాట్లాడారు అటువంటి ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబును పక్కన పెట్టుకుని చేతులు కలిపి రామారావు గారి గురించి మాట్లాడితే ఎలా నమ్మాలి? ఎన్టీఆర్ మీద గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? సాక్షాత్తూ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించారు ఒక జిల్లాకు ఎన్టీఆర్ అని పేరు పెట్టి గౌరవించారు.. మీరు ఎవరితో చేతుల కలిపారు.. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వ్యక్తితో చేతులు కలిపి మాట్లాడితే ఎవరూ నమ్మరు.

మీ ఇద్దరి మధ్య లాలూచీ ఏమిటి?

  • ఎన్డీఏ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఏం ఒనగూరింది? కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది అన్యాయం చేసింది.. వాటిని సరిచేసి న్యాయం చేస్తామని చెప్పారు. ఏం న్యాయం చేశారు.. ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎంలు లాంటి సంస్థలు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టారా? దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు.. ప్రత్యేకంగా మాకు ఏమి ఇచ్చారు మోడీ గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామన్నారు.. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం న్యాయం చేశారు.. చంద్రబాబు అవినీతిని విచారణ చేయకుండా ఎందుకు మళ్లీ చెట్టాపట్టాలేసుకుని అతన్ని సీఎం చేద్దామంటున్నారు.. ఏంటి ఈ లాలూచీ.. ఈ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం.. రాష్ట్రానికి ఏం లాభం.. ప్రజలకు ఏం లాభం.. సమాధానం చెప్పారా?
  • మీరు వచ్చే ఐదేళ్ళలో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు..  అల్రెడీ గరీబ్ కల్యాణ్ జగన్ గారు చేస్తున్నారు.. రాష్ట్రంలో ఎనలేని అభివృద్ది జరిగింది. 
  • - 2019-2024 వరకు మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా చేసి చూపించారు.. పోర్టులు నిర్మాణం అల్రెడీ చేస్తున్నారు ఒకటి పూర్తి చేశారు.. మీకు ఓటేస్తే వచ్చే ఐదేళ్లలో చేస్తామంటున్నారు అల్రెడీ ఇవన్నీ జగన్ గారు చేస్తున్నారు..

మళ్ళీ మీ పాత సర్కారును తెస్తామని చెప్పే ధైర్యం ఉందా?
మోడీ గారిని ప్రశ్నిస్తున్నా.. 2014-2018వరకు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. అదే డబుల్ ఇంజిన్ సర్కార్ మళ్ళీ తెస్తామని చెప్పే ధైర్యం , సహాసం చేయగలరా? ఈ పొత్తు వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏంటి.. అవకాశవాద పొత్తు.
* ఈ సభ సిద్దం 5వ సభ తప్పితే జగన్ గారి కంటే మేము గొప్పగా పరిపాలించలేము.. ఆయనలాగే పరిపాలిస్తామని చెప్పే సభగా అభివర్ణిస్తున్నాను.

కుర్చీల కోసమే జెండాల కలయిక
ఈ పొత్తు వల్ల జెండాలు కలవడం.. ఈ మూడు జెండాలు కలిసేది కేవలం వాళ్ళ కుర్చీల కోసమే.. వాళ్లు కుర్చీలో కుర్చోవడం కోసమే .. అంతేకాని రాష్ట్రప్రజల మేలు కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం కాదనేది వాళ్ల ముగ్గురు మాటల్లోనే తేటతెల్లం చేసినందుకు, ఇంత గొప్పగా, ఇంత ఖర్చుపెట్టి జగన్ గారి కోసం, ఆయన మంచి కోసం  ఈ సభను పెట్టినందుకు అభినందిస్తున్నాను.. అని మాజీ మంత్రి పేర్ని నాని చురకలు అంటించారు. 

Back to Top