చంద్ర‌బాబు, అనిత రాజీనామా చేయాలి

మాజీ మంత్రి ఆర్కే రోజా

చిత్తూరు: రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు విఫ‌ల‌మ‌య్యాయ‌ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, హోం మంత్రి అనిత నైతిన బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయాల‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్‌ ఆర్డర్‌పై, పోలీస్‌ శాఖపైనా  ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి రోజా స్పందించారు.  కూట‌మి సర్కార్ అన్నిరంగాల్లో విఫ‌ల‌మైంద‌ని ఆమె అన్నారు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల్లోనే వంద‌కు పైగా అఘాయిత్యాలు జ‌రిగాయ‌న్నారు. హోం మంత్రిగా అనిత ఫెయిల్ అయ్యార‌ని డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతున్నారు..మేం కూడా అనిత తీరును మొద‌టి నుంచి ఎండ‌గ‌డుతున్నామ‌ని గుర్తు చేశారు. అత్యాచార నిందుతుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్కే రోజా డిమాండు చేశారు.

Back to Top