సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందని, మా నాయకుడు చిటికేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీ పార్టీ సంక్షోభానికి లోకేష్ కారణమని, దాన్ని సరిచేసుకోలేక మా నాయకుడు వైయస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని, ఇలాగే ప్రవర్తిస్తే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. వైయస్ జగన్‌పై టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలను కొడాలి నాని ఘాటుగా తిప్పికొట్టారు. సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది నీవు కాదా? రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది చంద్రబాబే అని కొడాలి నాని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకెళ్లి..వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది వాస్తవం కాదా అన్నారు. ఆదినారాయణరెడ్డి సభలో అసభ్యంగా మాట్లాడితే చంద్రబాబు వెకిలినవ్వులు నవ్వింది నిజం కాదా అన్నారు. వైయస్ జగన్ ఎవరికి పార్టీ కండువా కప్పలేదన్నారు. చంద్రబాబు విధానాలను విభేదించిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ..తాను వైయస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో చేరతానని వంశీ ప్రకటించారన్నారు. దేవినేని అవినాష్ నామీద పోటీ చేశారని, చంద్రబాబు పెద్ద లుచ్చా ..తండ్రి లేని నిన్ను మోసం చేశాడని అప్పుడే చెప్పానని తెలిపారు. ఈ రోజు అతను వచ్చి మా పార్టీలో చేరారన్నారు. సన్న బియ్యం ఇస్తామని ఎవరికి చెప్పాం.. సన్నబియ్యం ఇస్తామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా మాట్లాడుతూ..సన్యాసి సన్నబియ్యం ఇస్తానని చెప్పాడని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తాను ఎవరికి చెప్పానని ఉమాను ప్రశ్నించారు. నాణ్యమైన బియ్యం ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించినట్లు కొడాలి నాని గుర్తు చేశారు. నాణ్యమైన బియ్యం ఇవ్వాలంటే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మేం అధికారంలోకి వచ్చింది మే 30న అన్నారు. ఈ నెలాఖరుకు వరి పంట రైతుల చేతికి వస్తుందని తెలిపారు. వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసి నాణ్యమైన బియ్యం ఇస్తామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నట్లు తెలిపారు. మా వద్ద రిసైక్లింగ్ చేసిన బియ్యం ఉందని, ఈ బియ్యం తినేందుకు పనికిరాదన్నారు. వాటిలో మంచి బియ్యాన్ని ప్రజలకు అందజేస్తుంటే ఈ వెధవలు చంద్రబాబు, దేవినేని ఉమా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. దేవినేని ఉమా తన అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చాడని, వదిన అడ్డుపడితే ఆమెను కూడా చంపారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడావు బాబూ.. అమ్మ ఆదేశిస్తే ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన చంద్రబాబు మూడు రోజులకే ఎన్టీ రామారావు పార్టీలో చేరారని గుర్తు చేశారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీలో సీటు ఇచ్చి, మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీని ఎందుకు వీడావని ప్రశ్నించారు. ఎన్టీ రామారావు బిడ్డనిచ్చి, మంత్రి పదవి ఇస్తే..ఆయనకే వెన్నుపొటు పొడిచి సీఎం పీఠాన్ని లాక్కున్న లుచ్చా, సన్యాసి, వెధవ చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా? మీ అమ్మ మొగుడికి చెప్పానా సన్నబియ్యం ఇస్తానని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని నెహ్రూకు అన్యాయం చేశావు.. ఈ రాష్ట్రంలో దేవినేని నెహ్రూ అనే వ్యక్తి ఎన్టీరామారావుతో పాటు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎన్టీఆర్ చనిపోయేదాకా నెహ్రూ ఆయనతోనే ఉన్నారన్నారు. ఆ సమయంలో చంద్రబాబును ఘోరంగా తిట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన చివరి దశలో నాలుగు మెట్లు కిందకు దిగి లుచ్చ చంద్రబాబు వద్దకు చేరారన్నారు. కొడుకు కోసం టీడీపీలో చేరిన నెహ్రూకు మోసం చేశారన్నారు. దేవినేని అవినాష్‌కు తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చారట. అది ఒక్క పదవా? కళా వెంకట్రావ్ మీ పార్టీ అధ్యక్షుడా? ఆయన్ను ఎప్పుడైనా అధ్యక్షుడిలా చూశావా? పురుగులాగా చూస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే వంశీ మాకు మద్దతిస్తున్నారు.. వంశీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మా పార్టీలోకి వస్తున్నట్లు చెప్పారన్నారు. లోకేష్ వంటి పప్పుగాడి చేతిలో ఉన్న టీడీపీలో ఉంటే మునిగే పోయే పడవ అని మా పార్టీలోకి వస్తున్నారన్నారు. అవినాష్‌ను వైయస్‌ఆర్‌సీపీలో చేర్చుకున్నామని, వంశీ ఇంకా చేరలేదన్నారు. పొద్దునుంచి టీవీలో మాట్లాడుతున్న ఈ సన్యాసులకు వంశీ పార్టీలో చేరింది, లేనిది తెలియదా అన్నారు. ఉమా పిచ్చవాగుడు మానుకో అని హితవు పలికారు. నీళ్లలో ఎవరైనా ఇసుక తీస్తారా అని ప్రశ్నించారు. సిమెంట్ వాడకపోతే రేట్లు ఎలా పెరుగుతాయన్నారు. కులాలు, మతాలపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. చంద్రబాబు ఆయన పార్ట్‌నర్ పవన్ మతాలు, కులాల గురించి మాట్లాడుతున్నారన్నారు. పవన్ పుస్తకాలు చదివా అని గొప్పగా మాట్లాడుతున్నారని, ఆయన విధి విధానాలు తెలుసా అన్నారు. కులాల గురించి మాట్లాడే వ్యక్తి రాష్ట్రంలో పవన్ మాత్రమే అన్నారు. తిరుపతి వెళ్లి అక్కడి పూజలు చేసిన తరువాతే వైయస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టారన్నారు. అయిపోయిన తరువాత కూడా తిరుపతి వెళ్లాడని, మసిదు, చర్చీలకు వెళ్లాడని వివరించారు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి పవన్ ప్రశ్నిస్తే వైయస్ జగన్ సమాధానం చెప్పాలా అన్నారు. వైయస్ జగన్ తిరుమలలో ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు. వైయస్ జగన్ ఆంధ్ర పౌరుడని, ఇక్కడ పుట్టిన వ్యక్తి అన్నారు. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చిందన్నారు. సోనియా అంటే నీకు భయమేమో కానీ, వైయస్ జగన్ భయపడలేదన్నారు. Read Also: బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికింది నీ తాతా, ఆయన తాత ఏం చేశాడో బయటకు తీస్తాం.. వైయస్ రాజారెడ్డి గురించి చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు తాత కస్తురినాయుడు తిరుపతి బస్టాండ్‌లో జేబులు కత్తరించాడా అని ప్రశ్నించారు. నీ అయ్య కర్జూరనాయుడు ఏం చేశాడని నిలదీశారు. చనిపోయిన రాజారెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డి గురించి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే..నీ బాబు తిరుపతి బస్టాండ్‌లో జేబులు కొట్టిన దగ్గర నుంచి నీ తాతా, ఆయన తాత ఏం చేశాడో తీసి జనం ముందు పెడతామన్నారు. మీ పార్టీలో సంక్షోభం నీ కొడుకు పప్పు వల్లే వచ్చిందన్నారు. రోడ్డు రోలర్ తొక్కినట్లు మీ పార్టీని తొక్కుతారని భయపడి అందరూ టీడీపీ వీడుతున్నారన్నారు. మూడు పూట్ల తిని ఇసుక దీక్ష చేస్తే జనం నమ్మరన్నారు. నీ దీక్షకు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారని ప్రశ్నించారు. ఇసుకను ఐదేళ్లు తిని దీక్షలో దండలు వేసుకున్నారన్నారు. వైయస్ జగన్‌పై ఆరోపణలు చేసేందుకు చంద్రబాబు వద్ద ఏమీ లేదన్నారు. పవన్..ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేవు పవన్ కళ్యాణ్ జగన్‌ను ఏమని పిలవాలని అడుగుతున్న పవన్ అసలు పేరేంటని కొడాలి నాని ప్రశ్నించారు. మీ తండ్రి కళ్యాణ్ బాబు అని పేరు పెడితే..సినిమాల్లోకి వచ్చాన పవన్ కళ్యాణ్ అని, నీ అభిమానులు పవన్ స్టార్ అని, నీ యాక్టింగ్, డ్రామా చూసి మా పార్టీ వాళ్లు పవన్ నాయుడు అని పేరు పెట్టినట్లు చెప్పారు. నీ దురాభిమానులు ప్యాకేజీ స్టార్ అని పెట్టినట్లు గుర్తు చేశారు. నీకు కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా ..నీ పార్టీ తరఫున ఓడిపోయిన 174 మందిని పిలిచి నిన్ను ఏ పేరుతో పిలవాలో తేల్చుకో అన్నారు. పవన్ ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రివి కాలేవని, ప్రతిపక్ష నేతవు కూడా కాలేవని చెప్పారు. చంద్రబాబు నీ డ్రామాలు చాలు నీవు పార్టీలు మారవచ్చు కానీ, వేరే వాళ్లు మారకూడదా అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మారరని నిలదీశారు. ఎన్టీఆర్ పార్టీని లాక్కొని ఆయన్నే సస్పెండ్ చేశారని తెలిపారు. వైయస్ జగన్ పాదయాత్రలో ఉండగానే ఎమ్మెల్యేలను చేర్చుకొని చంద్రబాబు శునకానందం పొందారన్నారు. వైయస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత లేదన్నారు. వైయస్ జగన్ కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు కాబట్టి నీవు ఇంకా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉంటున్నావని, ఆయన చిటికేస్తే నీకు ప్రతిపక్ష హోదా కాదు..టీడీపీ పార్టీని మా కింది గదిలో పెట్టిస్తామన్నారు. నీ పార్టీ సంక్షోభంపై మీరే తేల్చుకోవాలని, మా పార్టీ, వైయస్ జగన్ జోలికి వస్తే సహించేది లేదన్నారు. నీ కుక్కలను జాగ్రత్తగా పెట్టుకో.. దశల వారిగా మద్యపాన నిషేదం చేస్తానని వైయస్ జగన్ పాదయాత్రలోనే చెప్పారన్నారు. ఇంగ్లీష్ మీడియం తెస్తానని ఎన్నికల ముందే చెప్పారని, సీఎం అయ్యాక అదే చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ పిల్లలు ఏం మీడియంలో చదువుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇంగ్లీష్ మీడియంపై మాట్లాడాలని, జనం ఇంటికి వచ్చి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు నీ డ్రామాలు, యాక్షన్ 40 ఏళ్ల నుంచి చూస్తున్నారని, నిన్ను నమ్మరన్నారు. ఎన్టీఆర్‌కు ఏం చేశావో నీకు అదే జరుగుతుందన్నారు. వైయస్ జగన్‌ను మీరందరు కలిసి కూడా ఏమీ చేయలేరన్నారు. దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు బోకర్లను పక్కనపెట్టుకొని పార్టీని నడుపుతున్న చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని, నీ కుక్కలను అన్నింటిని కూడా బోన్లలో వేసి కట్టేసి జాగ్రత్తగా ఉంచుకోవాలని, వాటిని బయటకు వదిలితే వాటికి దేహశుద్ధి ఉంటుందని, నీకు కూడా తప్పదని కొడాలి నాని హెచ్చరించారు. Read Also: బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికింది