తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అమరావతి ఒక్కటే కాదు..రాష్ట్రంలోని 13 జిల్లాలు ముఖ్యమే అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు..చేసేవన్నీ మోసాలే అన్నారు. ఇవాళ అమరావతిలో చంద్రబాబుకు రాజధాని ప్రాంత రైతులు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రజలు 23 సీట్లు ఇచ్చినా కూడా ఆయనలో ఏ మాత్రం కూడా మార్పు రావట్లేదన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పేర్నినానితో కలిసి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..కొడాలి నాని మాటల్లోనే.. భూములిచ్చిన రైతులకు, రైతు కూలీలకు అందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఒక నీచుడికి, నమ్మకద్రోహం చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పులతో, రాళ్లతో, కర్రలతో స్వాగతం పలికి, గత ఎన్నికల్లో మంగళగిరిలో నీ కుమారుడిని చిత్తుచిత్తుగా ఓడించినా కూడా సిగ్గులేకుండా మా వద్దకు వస్తే ఏమి చేస్తామో చెప్పి..చెప్పులతో దాడి చేసిన రాజధాని ప్రాంత రైతులకు ధన్యవాదాలు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలోకి వెళ్లగానే నేలకు ముద్దు పెట్టుకున్నారు.ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగింది. బుద్ధి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్ననిరోజులు గ్రాఫిక్స్‌కు ముద్దులు పెట్టుకున్నారు. సింగపూర్‌కు, మలేసియాకు వెళ్లినా బుద్ధి రాని చంద్రబాబుకు ఇప్పటికైనా జ్ఞనోదయం కలగడం మంచి పరిణామం. చంద్రబాబు చెబుతున్నారు..అమరావతిని ఆర్థిక రాజధానిగా నిర్మించి, దానిపై ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు ఖర్చు చేయాలని అంటున్నారు. దేశంలోని టాప్ 5 నగరాలైన ఢిల్లీ, బాంబే, మద్రాస్, బెంగుళూరు, కలకత్తా, హైదరాబాద్‌లతో అమరావతిని పోల్చుతున్నారు. అంటే మిగతా రాష్ట్రాలు ఇలాంటి రాజధానులు కట్టుకోలేకపోయాయా?. ప్రధాన నగరాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు అమరావతిలో 33 వేల ఎకరాలు భూములు సేకరించారు. చంద్రబాబు ఇచ్చిన డీపీఆర్ లెక్కల ప్రకారం లక్ష 9 వేల కోట్లు అవుతుంది. అంటే ఎకరానికి రూ.2 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, కరెంటు కనెక్షన్లు ఇచ్చేందుకు చంద్రబాబు డీపీఆర్‌లు తయారు చేశారు. వాటిని పూర్తి చేసేందుకు రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయి. కేవలం ఇన్‌ఫ్రాస్ట్చర్ తయారు చేయడానికి అంత ఖర్చు అవుతుంది. మనకు అంత ఆర్థిక స్థోమత ఉందా? ఈ రోజు రూ.2 లక్షల కోట్లలో ఆయన ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. దానికి రూ.10.50 వడ్డీకి తెచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన తెచ్చిన అప్పులకు వడ్డీ కడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎంత, కనీసం వడ్డీలు కట్టేంత ఆదాయం రాష్ట్రానికి ఉందా? చంద్రబాబు గ్రాఫిక్స్‌లో భ్రమరావతిని చూపించి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో పని చేసిన నీచుడు చంద్రబాబు. ఈయన నీచబుద్ధిని అమరావతిని అడ్డుపెట్టుకొని పది కాలాలు బతకాలనుకున్న నీచుడు చంద్రబాబు. ఈయన బుద్ధిని రాష్ట్ర ప్రజలే కాదు..రాజధాని ప్రాంత ప్రజలు కూడా గమనించి 23 సీట్లకు పరిమితం చేసినా కూడా సిగ్గు,శరం లేదు. చింత చచ్చిన పులుపు చావలేదు అన్న దోరణిలో చంద్రబాబు జీవిస్తున్నారు. రోజుకో ఎలిగేషన్‌తో ఉన్నారు. మొదట ఇసుక అన్నారు. ఈ సమస్య పరిష్కారమైంది. ఆ తరువాత ఇంగ్లీష్ అన్నారు..జనం చెప్పులతో కొట్టే పరిస్థితికి రావడం..నీ కొడుకు, నీ మనవడు మాత్రమే ఇంగ్లీష్ చదువులు చదువుకోవాలి..మేం చదువుకోకూడదా అని జనం వ్యతిరేకిస్తే యూటర్న్ తీసుకొని వదిలేశాడు. ఇప్పుడు అమరావతి అంటున్నాడు. ఈ రోజు రైతులు గట్టి గుణపాఠం చెప్పారు. చెప్పు దెబ్బలు, రాళ్ల దెబ్బలు, కర్ర దెబ్బలతో గుణపాఠం చెప్పారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారు. తాను 90 శాతం కట్టించానని చంద్రబాబు అంటున్నారు. అంటే మేం ఈ ఆరు నెలల్లో 10 శాతం కట్టలేదని చంద్రబాబు ఏడుస్తున్నారా?. ఒక మంత్రి దీన్ని శ్మశానం అన్నారు. ఈ శ్మశానంలో 150 మంది చచ్చినోళ్లతో సమానమని కడప వెళ్లి అంటున్నారు. ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో ఏమి నిర్మించావని మంత్రి బొత్ససత్యనారాయణ ప్రశ్నిస్తే..దాన్ని చిలువలు,పలువలుగా మార్చి అమరావతిని శ్మశానం అన్నారని ఏడుస్తున్నాడు. నీవే ఒక శవంగాడికి, శవరాజకీయాలు చేస్తున్నావని అన్నాం. అమరావతిని అన్నట్లు ప్రజలను రెచ్చగొడుతున్నారు. నీ పార్టీ వాళ్లను అందరిని తీసుకొచ్చి నీవు పెట్టిన శిథిలాలను, పిచ్చి మొక్కలను చూపించావు. ఈయన విజన్ రెడీ చేస్తారట. నీవు 2002లో విజన్ 2020 అని ప్రకటిస్తే..2003లో ప్రజలు నేలకేసి కొట్టారు. విజన్ 2020 వచ్చే ఏడాది వస్తుంది. ఇప్పుడు నీవు అధికారంలో లేవు. చంద్రబాబు చేసిన తప్పుడు విధానాల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితిలో లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమంటే అమరావతి ఒక్కటే కాదు..అమరావతితో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలు ముఖ్యమే. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, ప్రతి ఒక్కరూ అనేక ఆశలతో వైయస్ జగన్ ప్రభుత్వాన్ని గెలిపించారు. వాళ్లందరిని ఏరకంగా చూస్తామో..అమరావతిని కూడా అదేరకంగా చూస్తాం. నీవు దోచుకొని బినామీలకు కొన్న పొలాలకు రేట్లు పెంచడానికి ఇక్కడ 20 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెట్టం. చంద్రబాబు నిన్ను కొట్టాలంటే..నీపై రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడి చేయించాలంటే నిన్న నీవు కడప వెళ్లావు కదా.. వైయస్ జగన్ ఒక్క మాట చెబితే అక్కడే నిన్ను ఫుట్‌బాల్ అడేవాళ్లు. మొన్న వెస్టు గోదావరి వెళ్లావు..ప్రతి జిల్లాలో రెండు రాత్రులు పడుకుంటున్నావు. నిన్ను కొట్టాలి..తిట్టాలంటే అక్కడ కొట్టలేమా? అమరావతిలోనే ఎందుకు కొడతాం. నీకు సిగ్గు,శరం, నీతి, జాతీ లేదు. అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిన నీచాతి నీచమైన లుచ్చా కాబట్టి కొట్టినా ఆయనకు అధికారం కావాలి. చంద్రబాబు ఈ రోజు అమరావతి డ్రామాను విజయవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి డ్రామాలు రేపు ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు, నాటకాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ ఆయన కుమారుడు లోకేష్(పప్పు) బస్సులో చెబుతున్నారు.. ఎవడిదో హెర్ స్ట్రైల్ బాగుంది..ఫ్యాంట్, షర్ట్ బాగుందని అంటున్నాడు. కొడుకెళ్లి ఖాళీ స్థలాలు చూసుకొని ఎక్కడ కొల్లగొట్టాలో ఈ రోజు ప్రయత్నం చేశాడు. మేం తెనాలి నుంచి ఫెయిడ్ ఆర్టీస్టులను తీసుకొచ్చామంట?. నీది తెనాలే..నాది తెనాలే. అక్కడ డబ్బులు బ్యాచ్‌ను వెంట వేసుకొని తిరిగేవాడికి కాబట్టి అలా అంటున్నావు. వైయస్ జగన్‌కు తెనాలి, కడప, కర్నూలు, పులివెందుల ఇలా అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తారు. అన్ని కులాలను, మతాలను, దేవుళ్లను సమానంగా చూస్తారు. అందరిని సమాన దృష్టితో చూస్తున్నారు. అలాంటి జగన్‌మోహన్‌రెడ్డిని అందరూ దీవించండి. చంద్రబాబుకు 70 ఏళ్ల వయసు వచ్చింది. అవుట్‌డేటెడ్..ఆయన మరో ఐదేళ్లకు ఉంటాడో..పోతాడో కూడా తెలియదు కాబట్టి..ఏదోరకంగా వైయస్ జగన్‌ను అభాసుపాలు చేసి..కొడుకు పప్పును తీసుకురావాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. పప్పు సుద్ధపప్పు అవుతుందే కానీ. ఆయనతో ఎలాంటి కార్యక్రమాలు జరుగవు. కాబట్టి చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకొని వైయస్ జగన్‌పై విమర్శలు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. Read Also: బాబు రైతుల కాళ్లు మొక్కి క్షమాపణ చెప్పాలి