టీడీపీ కుట్ర వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు భగ్నం

వెంక‌ట‌గిరి మున్సిపాలిటీలో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

తిరుప‌తి జిల్లా: దొడ్డిదారిలో మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి పొందాల‌నుకున్న టీడీపీ కుట్ర‌ను వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్లు భ‌గ్నం చేశారు.వెంకటగిరి మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీ పట్టు నిలుపుకుంది. బుధ‌వారం టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. చైర్మన్‌పై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 20 మంది వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. 25 మంది కౌన్సిలర్లలో 20 మంది కౌన్సిలర్లు వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో, టీడీపీకి బిగ్‌ షాక్‌​ తగిలింది. అవిశ్వాస తీర్మానానికి ముందే వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్ల దెబ్బకు టీడీపీ ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ చేతులెత్తేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఇంచార్జ్‌ రామ్‌కుమార్‌ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్లు ఏక‌తాటిపై నిల‌బ‌డి చైర్మ‌న్ ప‌ద‌విని నిల‌బెట్టుకున్నారు.  ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ  మురళీధర్, రామ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నక్కా భాను ప్రియపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ చేసిన కుట్రను తిప్పి కొట్టారు. 


 
ఇక్క‌డ రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌ని చేయ‌దు : రామ్‌కుమార్‌రెడ్డి
వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు, నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌ని చేయ‌ద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ చెబుతున్న‌ట్లుగా విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త  ప‌ని చేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త నెదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వెంకటగిరి కౌన్సిలర్లు తగిన బుద్ది చెప్పారన్నారు.  అధికారం దుర్వినియోగం చేసిన.. దొడ్డిదారిలో మునిసిపల్ చైర్మన్ పదవిని కాజేయాలని చూశార‌ని ఫైర్ అయ్యారు.  వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్స్ సమిష్టిగా నిలబడి.. అవిశ్వాస తీర్మానాన్ని తిప్పికొట్టార‌ని చెప్పారు.  25 మంది కౌన్సిలర్స్ మా గుర్తు మీద గెలిస్తే.. ఆరుగురిని టీడీపీ లాక్కుంద‌ని, 19 మంది మాపై నిలబడ్డార‌ని తెలిపారు. కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని.. తద్వారా కౌన్సిలర్స్ ని బెదిరించి తమ వైపు తిప్పుకోవాలని చూశార‌ని ఆక్షేపించారు.  కూటమి ప్రభుత్వానికి వెంకటగిరి మున్సిపాలిటీ లో తొలి దెబ్బ త‌గిలింద‌న్నారు. జమిలి ఎన్నికలు రావడం ఖాయమ‌ని, రాష్ట్రంలో మళ్ళీ వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో రావడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్ల దెబ్బకి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు దిమ్మ తిరితిరిగింద‌న్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ వెంట నడిచిన కౌన్సిలర్ల‌కు పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్ అండగా ఉంటార‌ని,  నిజాయతీ, విశ్వాసనీయత వైపు నిలబడ్డ కౌన్సిలర్ల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. టీడీపీ కుట్రలను కౌన్సిలర్స్ భగ్నం చేశార‌ని, అవిశ్వాస తీర్మానం ఇచ్చిన టీడీపీ కౌన్సిలర్లు పత్తా లేకుండా పోయార‌ని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ.. రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపాలిటీపై పట్టు నిలబెట్టుకున్నామ‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ వైపు నిలిచిన వారికి పార్టీలో ఉజ్వ‌ల భవిష్యత్తు ఉంటుంద‌న్నారు.

Back to Top